Jump to content

చెట్టిచెర్ల

అక్షాంశ రేఖాంశాలు: 15°31′46.632″N 79°6′3.996″E / 15.52962000°N 79.10111000°E / 15.52962000; 79.10111000
వికీపీడియా నుండి

చెట్టిచెర్ల ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని గ్రామం[1].

చెట్టిచెర్ల
గ్రామం
పటం
చెట్టిచెర్ల is located in ఆంధ్రప్రదేశ్
చెట్టిచెర్ల
చెట్టిచెర్ల
అక్షాంశ రేఖాంశాలు: 15°31′46.632″N 79°6′3.996″E / 15.52962000°N 79.10111000°E / 15.52962000; 79.10111000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంబేస్తవారిపేట
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తిగిరెడ్డి భూపాలరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. [3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ గ్రామంలో 2013 డిసెంబరు 14 నుండి 16 వరకూ, శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజలు జరిగినవి. పండితులు యంత్ర, నాగప్రతిష్ఠలు, కలశ స్థాపన చేశారు. కుంభాభిషేకం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. 3 పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. [4]

శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు, స్వామివారి వార్షిక ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, అఖండ దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రద్యోషకాల పూజ, ధార్మిక ఉపన్యాసం చేశారు. కులుకు భజన, చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [5]

గ్రామ విశేషాలు

[మార్చు]

2017, జూన్‌లో ప్రకటించిన జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో ఈ గ్రామానికి చెందిన బొజ్జ సాయివంశీధరరెడ్డి, ఆలిండియా ఓపెన్ క్యాటగిరీ విభాగంలో 208వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల నిర్వహించిన జె.ఇ.ఇ. మెయిన్స్ లోనూ 310వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యర్ధి 2017 ఆంధ్రా, తెలంగాణా ఎం.సెట్.పరీక్షలలోనూ 45వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి శ్రీ విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇతని తల్లి శ్రీమతి సుజాత. [6]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 12వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2013, డిసెంబరు-17; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-2; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-13; 11వపేజీ.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[2]