చౌసతి యోగిని దేవాలయం
చౌసతి యోగిని దేవాలయం | |
---|---|
పేరు | |
ఇతర పేర్లు: | యోగిని మందిరం |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | ఖుర్దా |
స్థానికం: | హీరాపూర్ |
ఎత్తు: | 17 మీ. (56 అ.) |
అక్షాంశ రేఖాంశాలు: | 20°13′35.454″N 85°52′32.141″E / 20.22651500°N 85.87559472°E |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | Hypaethral |
చౌసతి యోగిని దేవాలయం (64 యోగినుల మందిరం) (ఒరియా: ଚଉଷଠି ଯୋଗିନୀ ମନ୍ଦିର, ହୀରାପୁର) ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉంది.[1][2]
విశేషాలు
[మార్చు]ఈ మందిరాన్ని 9వ శతాబ్దంలో రాణీ హీరాదేవి నిర్మించినట్లు భావిస్తున్నారు.[3]
ఈ దేవాలయం వృత్తాకారంలో పూర్తిగా ఇసుకరాయితో కట్టబడింది. లోపలి వైపు గోడకు గూళ్లు ఉన్నాయి. ప్రతి గూటిలోను ఒక దేవత బొమ్మ చొప్పున 56 దేవతా ప్రతిమలున్నాయి. ఇవి నల్లని రాతితో చెక్కబడి గోడకు ఇమడ్చబడి ఉన్నాయి. ఈ గుడి మధ్యలో మూల విగ్రహం కాళి రాక్షసుడి తలపై కాలుపెట్టి నిలబడిన భంగిమతో కనిపిస్తుంది. ఈ గుడి మధ్యభాగంలో చండీ మండపం ఉంది. దానిలో మిగిలిన 8 దేవతా విగ్రహాలు నాలుగు వైపులా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ చండీ మంటపంలో మహాభైరవుని పూజించినట్లు ఊహిస్తున్నారు.[3]
ఇది పైకప్పు లేని ఒక తాంత్రిక దేవాలయం.[4] ఇక్కడ పంచభూతాలను ఆరాధిస్తూ క్షుద్రపూజలను నిర్వహిస్తారు.
ఇక్కడి పూజారుల స్థల పురాణం ప్రకారం దుర్గాదేవి రాక్షస సంహారం కొరకు 64 గ్రామదేవతల రూపాలలో వెలసింది. ఈ 64 మంది యోగినులు యుద్ధం అనంతరం దుర్గాదేవిని తమ ఉనికిని చాటడానికి ఒక దేవాలయాన్ని సృష్టించాల్సిందిగా కోరారు.[2]
ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో ఉన్నాయి. ఈ ప్రతిమలలో క్రోధము, దుఃఖము, సంతోషము, ఆహ్లాదము, లాలస మొదలైన అన్ని భావాలు వ్యక్తమౌతున్నాయి.[2]
ఇటువంటి మందిరమే ఒడిషా రాష్ట్రం బలంగిర్ జిల్లాలోని రాణిపూర్- ఝరియల్ ప్రాంతంలోను, భారతదేశంలో మరో ఏడుచోట్ల నెలకొని ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారము 64 సంఖ్య చతుష్షష్ఠి కళలను సూచిస్తున్నది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఒరిస్సా రివ్యూ, గవర్నమెంట్ గెజిట్". ఒరిస్సా రివ్యూ. 43. ఒరిస్సా ప్రభుత్వం, హోమ్ శాఖ: 30. 1986.
- ↑ 2.0 2.1 2.2 "చౌసతి యోగిని టెంపుల్ - ఎ ప్లేస్ ఆఫ్ వండరస్ అక్కల్ట్ - శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్". శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్ (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-06-15. Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-06.
- ↑ 3.0 3.1 శరవణన్, వి.హరి (2014). గాడ్స్, హీరోస్ అండ్ దేర్ స్టోరీ టెల్లర్స్: ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా. నోషన్ ప్రెస్. ISBN 9384391492.
- ↑ "యోగిని టెంపుల్ ఆఫ్ హీరాపూర్". ది హిందూ. 17 Oct 2003.
గ్యాలరీ
[మార్చు]-
యోగినుల మూర్తులు
-
వృత్తాకారంగా కొలువై ఉన్న యోగినులు