జోలేపాళెం సిద్ధప్పనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోలేపాళెం సిద్ధప్పనాయుడు
జననండిసెంబరు 7, 1923
బండమీద కమ్మ పల్లి, మదనపల్లె పట్టణం, చిత్తూరు జిల్లా
మరణంఅక్టోబర్ 8, 2017
బండమీద కమ్మ పల్లి, మదనపల్లె పట్టణం, చిత్తూరు జిల్లా
వృత్తిసచివాలయంలో సహాయ కార్యదర్శి
ప్రసిద్ధిరంగస్థల, సినిమా నటుడు
తండ్రిసుబ్బయ్యనాయుడు
తల్లిలక్ష్మమ్మ

జోలేపాళెం సిద్ధప్పనాయుడు (డిసెంబరు 7, 1923 - అక్టోబర్ 8, 2017) ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు. నాటక కృషీవలుడు, నట ప్రసిద్ధ బిరుదాంకితుడు. అనేక నాటకాలు, 22 చిత్రాల్లో నటించాడు.[1]

జననం[మార్చు]

సిద్ధప్పనాయుడు 1923, డిసెంబరు 7న జోలేపాళెం సుబ్బయ్యనాయుడు, లక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం బండమీద కమ్మ పల్లిలో జన్మించాడు.

చదువు - ఉద్యోగం[మార్చు]

బి.ఏ. చదివిన సిద్ధప్పనాయుడు 1945లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రెవెన్యూశాఖ, ఆహారశాఖల్లో గుమాస్తాగా, 1978 సంవత్సరంలో సచివాలయంలో సహాయ కార్యదర్శిగా పనిచేశాడు.

కళారంగ జీవితం[మార్చు]

1942 సంవత్సరంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో పాల్గొనడమేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డితో కలసి సత్యాగ్రహం చేశాడు.

1944వ సంవత్సరంనుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించిన సిద్ధప్పనాయుడు పాఠశాల విద్యార్థులతో కలసి నాటకాలు ప్రదర్శించేవాడు. 1953 నుంచి పూర్తిస్థాయి నాటకరంగంలోకి ప్రవేశించి తన 66 సంవత్సరాల నాటకరంగ జీవితంలో నటుడిగా, దర్శకుడుగా సుమారు 50 నాటకాలతో వందల ప్రదర్శనలు ఇచ్చాడు.

నటించిన నాటకాలు:

నటించిన చిత్రాలు:

పురస్కారాలు - బహుమానాలు[మార్చు]

  1. నాటక కృషీవలుడు (బిరుదు) - కాకతీయ నాటక కళాపరిషత్‌, నాగభైరువారి పాలెం
  2. నట ప్రసిద్ధ (బిరుదు) - నవరస నట బృందం
  3. నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం - నంది నాటక పరిషత్తు - 2000లో నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా
  4. ఉత్తమ నటుడు (పురస్కారం) - తెలుగు విశ్వవిద్యాలయం
  5. ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం - ఆంధ్ర నాటక కళాసమితి, విజయవాడ రజితోత్సవం (1994)
  6. రంగస్థల నటుడు (పురస్కారం) - సత్య కళానికేతన్‌ (2001)
  7. వై.ఎస్‌.ఆర్‌. కళాపరిషత్‌ పురస్కారం 2010 సంవత్సరంలో వై.యస్. రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా

మరణం[మార్చు]

వృద్ధాప్యంలో ఉన్న సిద్ధప్పనాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2017, అక్టోబర్ 8 ఆదివారం సాయంత్రం మదనపల్లెలోని తన నివాసంలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. డైలీహంట్. "సినీ నటుడు సిద్ధప్పనాయుడు కన్నుమూత". dailyhunt.in. Retrieved 10 October 2017.

ఇతర లంకెలు[మార్చు]

  1. టివి1 జీవన్నాటక కార్యక్రమంలో సిద్ధప్పనాయుడు ఇంటర్వ్యూ 1వభాగం
  2. టివి1 జీవన్నాటక కార్యక్రమంలో సిద్ధప్పనాయుడు ఇంటర్వ్యూ 2వభాగం