డి.కె.బారువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి. కె. బారువా
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
In office
1975–1977
అంతకు ముందు వారుశంకర్ దయాల్ శర్మ
తరువాత వారుఇందిరా గాంధీ
వ్యక్తిగత వివరాలు
జననం(1914-02-22)1914 ఫిబ్రవరి 22
మరణం1996 జనవరి 28(1996-01-28) (వయసు 81)
జాతీయతభారతీయ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

దేవ్ కాంత్ బారూవా, (1914 ఫిబ్రవరి 22- 1996 జనవరి 28) అస్సాంకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. భారతదేశ అత్యవసర స్థితి సమయంలో (1975-77) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను అస్సాం నుండి జాతీయ కాంగ్రెసుకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి.

ప్రారంభ జీవితం

[మార్చు]

బారువా 1914 ఫిబ్రవరి 22న అస్సాం ప్రావిన్స్ (ప్రస్తుత అస్సాం) లోని డిబ్రూగర్లో నీల్కాంత బారువాకు జన్మించాడు.అతను నౌగాంగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బారువా భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరిన తర్వాత అతను 1930, 1941, 1942 లలో ఖైదు చేయబడ్డాడు.[1].బారువా రాజకీయ జీవితం రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా (1949-1951) ప్రారంభమైంది.[2] అతను అప్పుటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని గురించి "భారతదేశం ఇందిరా - ఇందిరా భారతదేశం." అని తన సి.1974లో ప్రకటన చేసాడు.[3] ఏదేమైనా అతను తరువాత ఆమె నుండి విడిపోయాడు. కాంగ్రెస్ (యు) లో చేరాడు. తరువాత అది భారత (సోషలిస్ట్) గా పేరు మారింది. అతను 1971 ఫిబ్రవరి 1 నుండి 1973 ఫిబ్రవరి 4 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసాడు.అస్సాం రాష్ట్ర శాసనసభ సభ్యుడుగా, (1957-62, 1962-67 1967-72) మూడు పర్యాయాలు పనిచేసాడు. కొంతకాలం అస్సాం ప్రభుత్వంలో విద్య, సహకార మంత్రిగా పనిచేసాడు. లోక్‌సభ సభ్యుడుగా (1952-57) పనిచేసాడు. ఆ కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా పనిచేసాడు. రాజ్యసభ సభ్యుడుగా (1973-74, 1974—77) పనిచేసాడు. కేంద్ర పెట్రోలియం, రసాయనాల మంత్రి (1973-74) చేసాడు.1954, 1955  1974 లలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు బృందం సభ్యుడుగా, న్యూజిలాండ్ కామన్వెల్త్ సమావేశానికి ప్రతినిధిగా వ్యవహరించాడు.[4]

కవిగా

[మార్చు]

బారువా ఒక ప్రముఖ కవి. అతని అస్సామీ కవితా సంకలనం, సాగర్ దేఖిసా (সাগৰ দেখিছা ) ఇప్పటికీ చాలా ప్రజాదరణలో ఉంది.అతను ప్రముఖ అస్సామీ కవి నబకాంత బారువాకు అన్నయ్య అవుతాడు.

మరణం

[మార్చు]

అతను న్యూఢిల్లీలో 1996 జనవరి 28న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "D.K. Borooah". Lok Sabha. Retrieved 15 March 2019.
  2. "D.K. Baruah in Indian National Congress". Archived from the original on 2021-01-02. Retrieved 2021-09-21.
  3. Ram Guha, India After Gandhi, p. 467
  4. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-09-21.

బాహ్య లింకులు

[మార్చు]