తాండ్ర పాపారాయుడు (సినిమా)
(తాండ్ర పాపారాయుడు(సినిమా) నుండి దారిమార్పు చెందింది)
తాండ్ర పాపారాయుడు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | యు.సూర్యనారాయణ రాజు |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , జయసుధ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | గోపీకృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
తాండ్ర పాపారాయుడు 1986 లో వచ్చిన తెలుగు జీవిత చరిత్ర చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. 18 వ శతాబ్దపు యోధుడు తాండ్ర పాపారాయుడు జీవితం ఆధారంగా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై యు.సూర్యనారాయణ రాజు నిర్మించాడు.[1] ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, సుమలత, ప్రాణ్, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని 11 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.[2][3][4]
నట వర్గం
[మార్చు]- కృష్ణంరాజు - తాండ్ర పాపారాయుడు
- జ్యోతిర్మయిగా జయప్రద
- మల్లమ్మగా జయసుధ
- చిన్నమ్మగా సుమలత
- ప్రాణ్, జనరల్ బుస్సీగా
- విజయ రామరాజుగా మోహన్ బాబు
- రామకృష్ణ - రంగా రాయుడు
- గౌరవ నృత్యతారగా హేమా చౌదరి
- కాంతారావు
- ఎం. బాలయ్య
- జెవి సోమయజులు
- కోట శ్రీనివాసరావు
- సుధాకర్
- ప్రభ
- అంజలి దేవి
- గుమ్మడి
- సూర్యకాంతం
- నిర్మలమ్మ
- విజయలలిత
ఇతర విశేషాలు
[మార్చు]- వివిధ కాలాల్లో పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన ఆరుగురు - కృష్ణరాజు, జయప్రద, దాసరి నారాయణరావు, సి. నారాయణ రెడ్డి, మోహన్ బాబు, సుమలతలు ఈ సినిమాలో పనిచేసారు.
- 1964 లో వచ్చిన బొబ్బిలి యుద్ధం సినిమా కథతో చాలావరకూ ఈ సినిమా కథ కలుస్తుంది.
పాటలు
[మార్చు]- అభినందన మందార మాల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం. కె జె జేసుదాస్, పి సుశీల
- లలిత పులకాంత , రచన: సి నారాయణ రెడ్డి, గానం. కె జె జేసుదాస్, పి సుశీల
- రాజంటే నీవెలే , రచన: సి నారాయణ రెడ్డి,గానం.కె జె జేసుదాస్, పి సుశీల
- మల్లెకన్న తెల్లన , రచన: సి నారాయణ రెడ్డి,గానం.
- చలి చలి రేయి , గానం.పులపాక సుశీల, వాణి జయరాం
- అతి బాల్యంనుండి గుండెపై (పద్యం) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- కాళ్ళ పారాణి మంగళసూత్రమున(పద్యం ), గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రచన:
- సర్వప్రజారక్షణ రక్షితార్డ వామార్డబాగ (సుప్రభాతం ), గానం . పి సుశీల, రచన:
- అరివీర భయద గండర గండ,(పద్యం ), గానం. వి .రామకృష్ణ, రచన:
- దేవునిఅవతారం నీవే, రచన:
- అతి ప్రగల్భ వీరభద్ర సింహనాద (పద్యం), గానం. కె. జె. ఏసు దాస్
- నీ వాచాలత కట్టిపెట్టు ప్రళయాగ్ని జ్వాలామాలిక(పద్యం), గానం.వి.రామకృష్ణ
- గర్వాఖర్వ విరోధి వర్గ కృతమో ఖడ్ల ప్రహారాలు(పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- యేవేల్పులు విడదీయరనుచు ఎంతే ధైర్యంబు, (పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ Tandra Paparayudu (1986) - Synopsis
- ↑ "iffi.nic.in/Dff2011/Frm11IIFAAward.aspx?" (PDF). Archived from the original (PDF) on 2013-01-30. Retrieved 2020-08-04.
- ↑ "Tandra Paparayudu". Archived from the original on 2020-01-16. Retrieved 2020-08-04.
- ↑ Tandra Paparayudu Songs
5.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.