తూర్పుకాపులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పుకాపు, గాజులకాపు ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకాపులకు మాత్రమే బిసి కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పుకాపులను బిసిల జాబితాల్లో చేర్చుతు ఉత్తర్వులు ఇచ్చారు. పాలకొల్లు తదితర ప్రాంతాల్లోకూడా వీరి జనాభా అధికంగా ఉంది. బలిజ , తెలగ , ఒంటరి, రెడ్లు కూడా తమ కులం కాపు గానే పేర్కొంటారు కానీ ఒకరినొకరు పెళ్ళి చేసుకోరు. కాపులు తూర్పుకాపులు మున్నూరుకాపులు క్రమంగా వియ్యమందుతూ కలిసిపోతున్నారు. కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణ మున్నూరుకాపులు అని వ్యవహరిస్తారు. సినీ నటులు చలం, రామకృష్ణ తూర్పుకాపులే.