దేవరకొండ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవరకొండ రెవెన్యూ డివిజను
దేవరకొండ కోట నుండి గ్రామ దృశ్యం
దేవరకొండ కోట నుండి గ్రామ దృశ్యం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానల్గొండ

దేవరకొండ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నల్గొండ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం దేవరకొండ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవరకొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.

పరిపాలన[మార్చు]

దేవరకొండ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం దేవరకొండ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 చందంపేట మండలం 15 రెవెన్యూ గ్రామాలు
2 చింతపల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు
3 దేవరకొండ మండలం 15 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
4 గుండ్లపల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
5 గుర్రంపోడ్ మండలం 27 రెవెన్యూ గ్రామాలు
6 కొండమల్లేపల్లి మండలం 14 రెవెన్యూ గ్రామాలు
7 పెద్ద అడిశర్ల పల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
8 నేరడుగొమ్ము మండలం 9 రెవెన్యూ గ్రామాలు

గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 10 మండలాలు ఉండేవి. వాటిలోని మర్రిగూడ మండలం, నాంపల్లి మండలం ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన చండూరు రెవెన్యూ డివిజనులో విలీనమయ్యాయి.[5]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Yadadri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 2017-02-15. Retrieved 2022-08-24.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-24.
  4. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-24. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  5. "TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి". EENADU. Retrieved 2023-12-31.