దొంగల బండి
దొంగల బండి | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
రచన | సతీష్ వేగేశ్న (కథ, చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | జి. ఎస్. కె. నాయుడు |
తారాగణం | అల్లరి నరేష్, తాన్య |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | వల్లూరి రాజశేఖర్ |
నిర్మాణ సంస్థ | జి. ఎస్. కె. నెట్వర్క్ |
విడుదల తేదీ | డిసెంబరు 12, 2008 |
భాష | తెలుగు |
దొంగలబండి 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.[1]
కథ
[మార్చు]నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క బంధువులు మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.
తారాగణం
[మార్చు]- అల్లరి నరేష్
- కొండవలస లక్ష్మణరావు
- ఆలీ
- వేణుమాధవ్
- వేణు
- రావు రమేష్
- కృష్ణ భగవాన్
- కోవై సరళ
- జీవా
- గుండు సుదర్శన్
- ఎమ్మెస్ నారాయణ
- జయప్రకాష్ రెడ్డి
- గీతా సింగ్
- చిత్రం శీను
- షకీలా
- సుమన్ శెట్టి
- బ్రహ్మానందం (అతిథి పాత్ర)
- వేణు
- ఫిష్ వెంకట్
- మాస్టర్ భరత్
- అశోక్ కుమార్
పాటల జాబితా
[మార్చు]1: అమ్మ చెప్పింది , గానం.రంజిత్
2:నేలకు జారేనే , గానం.రాజశేఖర్
3: చేత వీణ, గానం. రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్
4: ఓరోరి మావయ్య, గానం. రాజశేఖర్, ప్రియా
5: సన్నజాజి పక్క, గానం. మాణిక్య వినాయగాం, భార్గవి పిళ్ళై
6: పక పక నవ్వు, గానం.శ్రీనాథ్, సాయి సరిత , మధుప్రియ, సాహితీ , శ్రావ్య .
మూలాలు
[మార్చు]- ↑ జీవి. "దొంగలబండి సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 5 October 2016.