Jump to content

ఆర్మూర్

అక్షాంశ రేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
వికీపీడియా నుండి
(నవనాతపురం నుండి దారిమార్పు చెందింది)
  ?ఆర్మూర్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 45.08 కి.మీ² (17 చ.మై)[1]
జిల్లా (లు) నిజామాబాద్ జిల్లా
జనాభా
జనసాంద్రత
1,52,903[2] (2021 నాటికి)
• 3,392/కి.మీ² (8,785/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం ఆర్మూర్ పురపాలక సంఘము


ఆర్మూర్, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి చెందిన పట్టణం[3]2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. జిల్లా లో నిజామాబాద్ తర్వాత పెద్ద నగరం ఆర్మూర్. [4]భౌగోళీకంగా ఆర్మూరు నిజామాబాదు జిల్లా ఉత్తరాన ఆదిలాబాదు సరిహద్దున ఉంది. జాతీయ రహదారి నెం.7 నుంచి సుమారు ఒక కి. మీ. లోపలికి ఉంది. ఈ పట్టణం నిజామాబాదు నుంచి 32 కిలో మీటర్లు, హైదరాబాదు నుంచి 175 కిలో మీటర్ల దూరంలో ఉంది.

పట్టణ చరిత్ర

[మార్చు]

దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం ఆర్మూర్ ని నవనాతపురం అని పిలిచేవారు. ప్రధాన రహదారి మీదనున్న ఆర్మూరు వచ్చేపోయే వాహనాలకు సహజమైన స్టాపు. శిలామయమైన ఇక్కడి కొండలు లక్షల సంవత్సరాల సహజసిద్ధమైన రాపిడి వలన ఏర్పడ్దాయి. దక్షిణ దిశయందు ఉన్న కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయం ఉంది.[5] స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతంలోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడికి సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న ఒక నీటిబుగ్గలోని నీటికి రోగాలు, వైకల్యాల నివారించే శక్తి ఉన్నదని భావిస్తారు.సందర్శకులు నిత్యం వస్తుంటారు. గుట్టపైన అందాలు ఆరబోసినట్లు పచ్చని ప్రకృతి, అందమైన గుహలు, గుహలో వెలసిన నవనాథ సిధ్దేశ్వర దేవాలయం, గుట్ట మధ్యన విశాలమైన స్థలంలో నిర్మితమైన రామాలయం చూడముచ్చటైనది. గుట్టకు దక్షిణం వైపు రహదారి మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా వాహనాలు గుట్ట పైకి వెళ్ళవచ్చు. ఉత్తరం వైపు పట్టణం విస్తరించి ఉంది. ఉత్తరం వైపు గతంలో నిర్మించిన మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల గుండ గుట్టపైకి వెళ్ళెటప్పుడు పొందే అనుభూతి మధురం. గుట్టపైన కొండల మధ్య చిన్నపాటీ చెరువు ఉంది. మెట్ల మార్గంలో అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం వలస వచ్చిన ఓ సన్యాసి (ప్రస్తుత పూజారి) పరిరక్షిస్తున్నారు.అతను అమ్మ వారి కొలువును వదిలి ఇప్పటి వరకు గుట్ట దిగిరాలేదు. అక్కడి నుండి గుట్టపైకి ఎక్కే మార్గంలో హనుమాన్ మందిరం ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఆర్మూర్ పట్టణం 18°47′24″N 78°17′24″E / 18.790°N 78.290°E / 18.790; 78.290 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. నిజామాబాద్ జిల్లాలో రెన్డడో వ పెద్ద పట్టణమిది. 2016 సెప్టెంబరు 24న శనివారంరోజున ఆర్మూర్ లో 39.5 సెం.మీ వర్షపాతం నమోదై శతాబ్దపు రికార్డును దాటింది. తెలంగాణ రాష్ట్రంలో 100 ఏళ్ళలో అత్యధికంగా అర్మూర్ లో 39.5 సిఎం వర్షపాతం నమోదైంది.

ప్రభుత్వం , రాజకీయాలు

[మార్చు]

పౌర పరిపాలన

ఆర్మూరు పురపాలక సంఘం 2006 లో స్థాపించబడింది. దీనిని మూడవ గ్రేడ్ గా విభజించారు. ఈ పట్టణంలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. దీని అధికార పరిధి 26.07 కి.మీ2 (10.07 చ. మై.).[1]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,21,987 - పురుషులు 59,814 - స్త్రీలు 62,173

రవాణా

[మార్చు]

ఆర్మూర్ 44వ జాతీయ రహదారి(7) (ఆసియా హైవే 43), 16వ జాతీయ రహదారుల ద్వారా అనుసంధానించబడి ఉంది. పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌లోని ఆర్మూర్ రైల్వే స్టేషన్ ఉంది. 200 కిమీ దూరంలో ఉన్న హైదరాబాద్ నగరంలో సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడినుండి ప్రతి 30 నిమిషాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

విద్యారంగం

[మార్చు]

నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఆర్మూర్ పట్టణం కూడా ఒకటి. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల (క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్), 10కంటే ఎక్కువ డిగ్రీ కళాశాలలు, 12కంటే ఎక్కువ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. పొరుగు జిల్లాలైన నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తుంటారు. అలాగే, విద్యా వ్యవస్థను పెంపొందించడానికి, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యను అందించడానికి 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2 మోడల్ పాఠశాలలను కూడా స్థాపించింది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-30.
  4. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  5. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 35
  6. "Read about on emescobooks.com". emescobooks.com. Archived from the original on 2021-08-17. Retrieved 2021-08-17.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్మూర్&oldid=4325916" నుండి వెలికితీశారు