Jump to content

నానల్ నగర్

అక్షాంశ రేఖాంశాలు: 17°23′41″N 78°25′38″E / 17.394611°N 78.427167°E / 17.394611; 78.427167
వికీపీడియా నుండి
నానల్ నగర్
సమీపప్రాంతం
నానల్ నగర్ is located in Telangana
నానల్ నగర్
నానల్ నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°23′41″N 78°25′38″E / 17.394611°N 78.427167°E / 17.394611; 78.427167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జనాభా
 • Total1,50,000
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 028
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకార్వాన్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

నానల్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నెంబరు 69లో ఉంది. ఇక్కడ బృందావన్ కాలనీ, ఖాదర్ బాగ్, సాలార్ జంగ్ కాలనీ, దిల్షాద్ నగర్ కాలనీ, డ్రీం స్టేట్ అనే ఉప ప్రాంతాలు ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]
  1. ఉత్తరం వైపు బంజారా హిల్స్, అహ్మద్ నగర్
  2. తూర్పు వైపు షేక్ పేట, టోలీచౌకీ
  3. దక్షిణం వైపు లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్
  4. పశ్చిమం వైపు మెహదీపట్నం, విజయనగర్ కాలనీ

ప్రార్థనా స్థలాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో శ్రీ సాయిబాబా దేవాలయం, కనకదుర్గ దేవాలయం, మస్జిద్-ఇ-సల్మా, మదీనా మసీదు మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నానల్ నగర్ మీదుగా సికింద్రాబాదు, లక్డికాపూల్, టోలీచౌకీ, బాపు ఘాట్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని నాంపల్లి రైల్వే స్టేషను, లక్డికపూల్ రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]

నానల్‌ నగర్ రోడ్డు నుండి (కాంగ్రెస్ హ్యాండ్ విగ్రహం[3]) నుండి లంగర్ హౌజ్, గుడిమల్కాపూర్ వైపు వెళ్ళే త్రి-జంక్షన్ వరకు అనేక దుకాణాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Nanal Nagar, Mehdipatnam Locality". www.onefivenine.com. Retrieved 2021-02-03.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Sonia Gandhi unveils pylon in memory of freedom fighters". The Hindu. 2006-01-22. ISSN 0971-751X. Retrieved 2021-02-03.