"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్==
పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు [[అతివృష్టి]] వలన, వరదముంపుకు[[వరద]]ముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు
 
'''నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః '''
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
 
అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు. ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న [[చిరంజీవి]] కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్టను మరింతగా అభివృద్ధి పరచి, ధృడంగా చేయబడి కట్టబడింది.
 
==కాటన్‍మ్యూజియం==
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2046894" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ