బమ్మెర పోతన
బమ్మెర పోతన (1450–1510) గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
జననము[మార్చు]
వీరు నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.[1]. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
భాగవత రచన[మార్చు]
ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.
ఇతర రచనలు[మార్చు]
యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.
పోతన - శ్రీనాధుడు[మార్చు]
పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారములో ఉన్నాయి.
కవిత్వము-విశ్లేషణ[మార్చు]
పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన. డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.
పోతన ఇతర కృతులు[మార్చు]
- వీరభద్ర విజయము, భోగినీ దండకము, శ్రీమదాంధ్రభాగవతం 8 స్కందములు, నారాయణ శతకము
బామ్మేరా పోతన
బయటి లింకులు[మార్చు]
- తెలుగు భాగవతం
- పోతన భాగవతం రాసింది ఒంటిమిట్టలోనే! - విద్వాన్ కట్టా నరసింహులు గారి వ్యాసం[permanent dead link]
- డా. సి. నారాయణ రెడ్డి గారి వ్యాసము
- "కారే రాజులు? రాజ్యముల్ కలుగవే?" పద్యం మీద కె.వి.ఎస్. రామారావు గారి వ్యాసం
- ↑ "బమ్మెర పోతన". TeluguOne Devotional (in Tamil). 11 February 2020.CS1 maint: unrecognized language (link)
- All articles with dead external links
- Articles with dead external links from మే 2020
- Articles with permanently dead external links
- శ్రీనాధ యుగం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- టాంకు బండ పై విగ్రహాలు
- తెలుగు కవులు
- ప్రాచీన తెలుగు కవులు
- భాగవతము
- హిందూ మతము
- తెలంగాణ చారిత్రిక వ్యక్తులు
- CS1 maint: unrecognized language