Jump to content

సకలనీతిసమ్మతము

వికీపీడియా నుండి
(సకల నీతి సమ్మతము నుండి దారిమార్పు చెందింది)
సకలనీతిసమ్మతము
కృతికర్త: మడికి సింగన
సంపాదకులు: నిడుదవోలు వెంకటరావు,
పోణంగి శ్రీరామ అప్పారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నీతిశాస్త్రం
ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్
విడుదల: 1979
పేజీలు: 256


సకలనీతిసమ్మతము ఒక విశిష్టమైన తెలుగు రచన. ఇది మడికి సింగన చే రచించబడింది. ఈ కవి వివిధ నీతి శాస్త్రాలనుండి పద్యాలను సేకరించి ఒక పద్యకావ్యంగా మలిచెను.

ఇది ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి (సా.శ.1 వ శతాబ్దం) తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు.

దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1979 లో ముద్రించారు. ఈ పుస్తకానికి నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావులు సంపాదకత్వం వహించారు.

విశేషాలు

[మార్చు]

ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది ఒక ప్రాచీన నీతి మంజరి. భవ్యకవితా పారిజాతం, ఇది 6 మంది అజ్ఞాత కవుల రచనల సంకలనం. “అల్లకల్లోలమైన పాల సముద్రాన్ని చిలికి దేవామృతాన్ని వెలికి తీసిన విధంగా, గంధకారుడు ముందు గల వస్తువులను అందంగా కూర్చి సుగంధం జత చేసినట్లు, అడివి పువ్వుల తేనె తుమ్మెద జున్ను పట్టు విధముగా; ముత్యాలను పరిమాణం వారీగా గుచ్చి హారం చేసినట్లుగా ఈ గ్రంథం చేసాను “ అని సింగన సంకలనానికి ముందుమాటలో రాసుకున్నాడు. అతను ఏఏ గ్రంథాల నుండి తీసుకున్నాడో వరుసగా- అ) అజ్ఞాతము, ఆ) కామందకము, ఇ) కుమార సంభవము (నన్నె చోడుడు), ఈ) కేయూరబాహు చరిత్ర (మంచెన), ఉ) చాటువు, ఊ) చారుచర్య (అప్పనమంత్రి), ఎ) ధృతరాష్ట్ర నీతి (తిక్కన), ఏ) ధౌమ్యనీతి (తిక్కన), ఐ) నీతి తారావళి (కందనామాత్యుడు) ఒ) నీతిభూషణం (ఆంధ్ర భోజుడు), ఓ) నీతిసారం (రుద్రదేవుడు), ఔ) పంచ తంత్రి, అం) పద్మ పురాణము (మడికి సింగన), అః) పురుశార్థ సారము (శివదేవయ్య), క) బద్దన నీతి (బద్దెన), ఖ) భీష్మ పర్వం (తిక్కన), గ) మదీయము (మడికి సింగన), ఘ) మార్కండేయము (మారన), జ్ఞ) మిత్రనీతులు, చ) ముద్రమాత్యము (క్షేమేంద్ర లక్కా భట్టు), ఛ) విదురనీతి (తిక్కన), జ) శాంతి పర్వము (తిక్కన), ఝ) శాలి హోత్రము, ఇ) శ్రీగిరి శతకము (శ్రీగిరి), ట) శ్రీ రామాయణము, ట) సభాపర్వం, (నన్నయ), డ) సౌప్తిక పర్వము (తిక్కన).