"బాల సాహిత్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[మహా భారతము|మహాభారతం]], [[రామాయణము|రామాయణం]], [[బసవపురాణం]], కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం [[కాశీమజిలీ కథలు|కాశీ మజిలీ]] కథలు, [[పంచతంత్రం|పంచతంత్ర]] కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. [[పాట|గేయ]], [[పద్య కవిత|పద్య]], గద్య, రూపాలలో [[బాల సాహిత్యం]] కన్పిస్తున్నది. చిన్నయ సూరి [[నీతిచంద్రిక]]<nowiki/>లో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
 
[[గురజాడ అప్పారావు]], [[గిడుగు వెంకట సీతాపతి]], [[చింతా దీక్షితులు]], [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]], [[వేముగంటి నరసింహాచార్యులు]] మొదలైనవారు బాల సాహిత్యాన్ని సృజించినవారే. [[వెలగా వెంకటప్పయ్య]], షేక్ అబ్దుల్ హకీం జాని, [[ఉత్పల సత్యనారాయణాచార్య]], [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[కె.రామలక్ష్మి]] పాయల సత్యనారాయణ,పెండెం జగదీశ్వర్ [[మలయశ్రీ]], బెహరా ఉమామహేశ్వరరావు, [[ఐతా చంద్రయ్య]], ఎన్నవెళ్లి రాజమౌళి, శివ్వాల ప్రభాకర్, బెలగాం భీమేశ్వరరావు, పెందోట వెంకటేశ్వర్లు, ఉండ్రాళ్ల రాజేశం, అమ్మన చంద్రారెడ్డి, వేజేండ్ల సాంబశివరావు, [[అలపర్తి వెంకటసుబ్బారావు]], బీవీ నర్సింహారావు, పెమ్మరాజు సావిత్రి, అవధాని రమేశ్, నీలకంఠ పాండురంగం, [[నార్ల చిరంజీవి]], [[మిరియాల రామకృష్ణ]], నాసరయ్య, సుధానిది, మహీదర నళినీమోహన్, [[కె.సభా]], [[న్యాయపతి రాఘవరావు]], [[రెడ్డి రాఘవయ్య]], దాసరి వెంకటరమణ, [[ఎం. హరికిషన్]], చొక్కపు వెంకటరమణ, [[నారంశెట్టి ఉమామహేశ్వరరావు]], [[పైడిమర్రి రామకృష్ణ]], వేదాంత సూరి, మాకినీడి సూర్య భాస్కర్, భూపాల్, వాసాల నర్సయ్య, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి మొదలైన వారు గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని రచించారు. దాదాపు అన్ని పత్రికలలు బాలలకోసం ప్రత్యేకమైన శీర్షికలను నడుపుతున్నాయి. [[బాల]], [[బాలమిత్ర]], [[చందమామ]], జాబిల్లి, బుజ్జాయి, [[బాలభారతి]] మొదలైన పత్రికలు ప్రత్యేకంగా పిల్లలకోసం వెలువడ్డాయి.
'''''వాలు పాఠ్యం'''''
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2766069" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ