Jump to content

బన్నీ వాసు

వికీపీడియా నుండి
బన్నీ వాసు
జననం (1981-06-11) 1981 జూన్ 11 (వయసు 43)
వృత్తిసినిమా నిర్మాత,
ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్

బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా (2021) సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తులలో ఒకరు. ఆయన అల్లు అర్జున్కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. ఆయన ఎం.ఐ.టి (మాస్టర్ ఇన్ ఐ.టి) కోర్సు నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3D ఆనిమేషన్ నేర్చుకున్నారు. జానీ చిత్రం యొక్క లోగో ఏనిమేషన్ కొరకు అల్లూ బాబీ (అల్లు అర్జున్ యొక్క అన్నయ్య) వద్ద చేరారు. ఆయన బన్నీ వాస్ పనిని యిష్టపడ్డాడు. బన్నీ వాసు పాలకొల్లు వాసి. ఆయన గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు. ఆయన వంశీ (యు.వి.క్రియేషన్స్) తో కలసి 57 చిత్రాలను గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాఅల్లో పంపిణీ చేసారు. వాటిలో మంచి సినిమాలైన పోకిరి, ఆర్య, మగధీర మొదలైనవి ఉన్నాయి. చివరిగా గబ్బర్‌సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసారు. ఆయన బన్నీ అన్ని చిత్రాల నిర్మాణంలో, సృజనాత్మక అంశాలలోనూ పాల్గొన్నారు. [2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Notes
2011 100% లవ్ నిర్మాత
2014 కొత్త జంట నిర్మాత
2014 పిల్లా నువ్వు లేని జీవితం నిర్మాత
2015 భలే భలే మొగాడివోయ్ నిర్మాత
2016 సరైనోడు సహా నిర్మాత
2017 నెక్స్ట్ నువ్వే నిర్మాత
2018 నా పేరు సూర్య Co-నిర్మాత
2018 గీత గోవిందం నిర్మాత
2019 ప్రతి రోజు పండగే నిర్మాత
2021 చావు కబురు చల్లగా నిర్మాత
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్మాత
2022 పక్కా కమర్షియల్ నిర్మాత
2022 18 పేజెస్ నిర్మాత

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]