యూరేషియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూరేషియా
వైశాల్యం54,759,000 km2
జనాభా4,620,000,000 (2010)
జనసాంద్రత84/km2
నివసించేవారుయూరేషియన్
దేశాలు93 (list)
ఆధారపడేవారు9
Non-UN states8
యూరేషియా

యూరేషియా భూమ్మీది అతిపెద్ద భూఖండం. ఐరోపా, ఆసియాలు మొత్తం కూడుకుని ఉన్న ప్రాంతం ఇది. [1] ప్రధానంగా ఉత్తరార్థగోళం, తూర్పు అర్ధగోళాలలో విస్తరించి ఉన్న ప్రాంతం ఇది. పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన ఆఫ్రికా, మధ్యధరా సముద్రం, హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఐరోపా, ఆసియాల మధ్య స్పష్టమైన భౌతిక విభజన లేదు. అదొక చారిత్రక, సామాజిక విభజన. అందువల్ల, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో యూరేషియాను భూమిపై ఉన్న ఆరు, ఐదు, లేదా నాలుగు ఖండాలలో అతిపెద్దదిగా గుర్తిస్తారు. [1] భూగర్భ శాస్త్రంలో, యూరేషియాను ఒకే కఠినమైన మెగాబ్లాక్‌గా పరిగణిస్తారు. అయితే, పాలియోమాగ్నెటిక్ డేటా ఆధారంగా యూరేషియా దృఢత్వం పట్ల చర్చ జరుగుతోంది. [2] [3]

యూరేషియా 5.5 కోట్ల చ.కి.మీ. వైశాల్యంలో ఉంది. ఇది భూమి మొత్తం భూభాగంలో 36.2%. ఈ ప్రాంతంలో 500 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. ఇది మొత్తం మానవ జనాభాలో సుమారు 70%కి సమానం. యూరేషియాలో మానవులు మొదట 60,000 - 125,000 సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. గ్రేట్ బ్రిటన్, ఐస్లాండ్, ఐర్లాండ్, శ్రీలంకతో సహా కొన్ని ప్రధాన ద్వీపాలు, అలాగే జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు యూరేషియా నిర్వచనం క్రిందకు చేరుతాయి.

భూగర్భ శాస్త్రం

[మార్చు]
13[permanent dead link] వ శతాబ్దం యొక్క సరిహద్దు మంగోల్ సామ్రాజ్యం నేటి స్థానాన్ని మంగోల్ ఆధునిక మంగోలియా, రష్యా, చైనా లో.

37.5 - 32.5 కోట్ల సంవత్సరాల క్రితం సైబీరియా, కజాఖ్స్తానియా, బాల్టికా ల విలీనంతో యూరేషియా ఏర్పడింది. ఇది లారెన్షియాలో (ఇప్పటి ఉత్తర అమెరికా) కలిసి యురేమెరికా ఏర్పడింది. చైనా క్రేటాన్లు సైబీరియా దక్షిణ తీరంతో ఢీకొన్నాయి.

చరిత్ర

[మార్చు]

యూరేషియా అనేక పురాతన నాగరికతలకు నెలవు. వీటిలో మెసొపొటేమియా, సింధు లోయ, చైనాలు ఉన్నాయి . యాక్సియల్ యుగంలో (మొదటి మిలీనియం BC మధ్య కాలం), అట్లాంటిక్ నుండి పసిఫిక్ వరకు యూరేషియా ఉపఉష్ణమండల జోన్ గుండా నాగరికతలు విలసిల్లాయి. ఈ బెల్ట్ రెండు సహస్రాబ్దాలుగా ప్రపంచ చరిత్రలో ప్రధాన స్రవంతిగా మారింది.

ప్రాంతీయ రాజకీయాలు (జియోపాలిటిక్స్)

[మార్చు]

వాస్తవానికి, “యూరేషియా” అనేది భౌగోళిక భావన: ఈ కోణంలో, ఇది కేవలం అతిపెద్ద ఖండం; ఐరోపా. ఆసియాల మొత్తం భూభాగం. అయితే, భౌగోళిక రాజకీయంగా, ఈ పదానికి అనేక విభిన్న అర్ధాలు ఉన్నాయి. ఇది నిర్దుష్ట భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది. [4] "యూరేషియా" చాలా ముఖ్యమైన భౌగోళిక రాజకీయ భావనలలో ఒకటి. యూరేషియా గురించి జ్బిగ్నూ బ్రెజెన్స్కీ ఇలా అన్నాడు:

“... అమెరికా యూరేషియాతో ఎలా వ్యవహరిస్తుందనేది కీలకం. యూరేషియాను నియంత్రించే శక్తి, ప్రపంచం లోని మూడు అత్యాధునిక, ఆర్థికంగా అత్యంత ఉత్పాదక ప్రాంతాల్లో రెండింటిని నియంత్రించినట్లే. యూరేషియాపై నియంత్రణ ఉంటే, ఆటోమాటిగ్గా ఆఫ్రికా అదుపులో ఉన్నట్లేనని, మ్యాపును ఓసారి చూస్తే తెలిసిపోతుంది. దీంతో పశ్చిమార్థగోళం, ఓషియానియాలు జియోపొలిటికల్‌గా మధ్య ఖండం చుట్టూ ఉన్నట్టు అవుతుంది. ప్రపంచ జనాభాలో 75 శాతం మంది యూరేషియాలో నివసిస్తున్నారు. ప్రాపంచిక సంపదలో చాలావరకూ అక్కడే, అక్కడి సంస్థల్లోను, దాని భూగర్భం లోనూ, ఉంది. ప్రపంచం లోను శక్తి వనరుల్లో నాలుగింట మూడు వంతులు యూరేషియా లోనే ఉన్నాయి.”[5]

1914 ప్రాంతంలో రష్యను భావనలో "యూరేషియా" అంటే తూర్పు ఐరోపాలోని కొన్ని భాగాలను కూడా కలిపిన ఇంపీరియల్ రష్యా సామ్రాజ్యమే. [6] రష్యా "యూరేషియా"లో భాగంగా భావించే ఆ దేశాలతో మరింత సన్నిహితంగా ఉండడమే దాని ప్రధాన భౌగోళిక రాజకీయ ప్రయోజనాలలో ఒకటిగా ఉండేది.

జార్జ్ ఆర్వెల్ నవల 1984 లో మూడు సూపర్‌స్టేట్స్‌లో ప్కటిగా పేర్కొన్నపుడు యూరేషియా పదం ఖ్యాతి గాంచింది. [7]  

ప్రాంతీయ సంస్థలు, సహకారాలు

[మార్చు]

యూరేషియా అంతటా, యురేషియన్ ఎకనామిక్ స్పేస్, యూరోపియన్ సింగిల్ మార్కెట్, ఆసియాన్ ఎకనామిక్ కమ్యూనిటీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సహా అనేక సింగిల్ మార్కెట్లు ఉద్భవించాయి. యూరేషియా అంతటా సమైక్యతను ప్రోత్సహించడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు, కార్యక్రమాలు ఉన్నాయి. అవి:

[permanent dead link]ASEM భాగస్వాములు

ఆసియా-యూరప్ సమావేశం

[మార్చు]

1996 నుండి ప్రతి రెండు సంవత్సరాలకు చాలా ఆసియా యూరోపియన్ దేశాలు ఆసియా-యూరప్ సమావేశం (ASEM) పేరుతో సమావేశమౌతూంటాయి.

కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్

[మార్చు]
  • కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్) అనేది సోవియట్ యూనియన్ రద్దు తరువాత ఏర్పడిన యూరేషియాలోని 10 సోవియట్ అనంతర రిపబ్లిక్ల రాజకీయ, ఆర్థిక సంఘం. దీని జనాభా 23,97,96,010. CIS ఆర్థిక, రాజకీయ, సైనిక వ్యవహారాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. వాణిజ్యం, ఆర్థిక, చట్టసభ, భద్రతను సమన్వయం చేయడానికి దీనికి కొన్ని అధికారాలున్నాయి. అదనంగా, CIS లోని ఆరుగురు సభ్యులు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరారు, ఇది 1992 లో స్థాపించబడిన ఒక అంతర-ప్రభుత్వ సైనిక కూటమి.
  Member States of the Eurasian Economic Union

యురేషియన్ యూనియన్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NatlGeo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Pavlov, V.E. (2012). "Siberian Paleomagnetic Data and the Problem of Rigidity of the Northern Eurasian Continent in the Post Paleozoic". Izvestiya, Physics of the Solid Earth. 48 (9–10): 721–737. Bibcode:2012IzPSE..48..721P. doi:10.1134/S1069351312080022.
  3. Li, Yong-Xiang; Shu, Liangshu; Wen, Bin; Yang, Zhenyu; Ali, Jason R. (1 September 2013). "Magnetic inclination shallowing problem and the issue of Eurasia's rigidity: insights following a palaeomagnetic study of upper Cretaceous basalts and redbeds from SE China". Geophysical Journal International (in ఇంగ్లీష్). 194 (3): 1374–1389. Bibcode:2013GeoJI.194.1374L. doi:10.1093/gji/ggt181. ISSN 0956-540X.
  4. "The Concept of Eurasia". Comment and Outlook. 2014-04-15. Retrieved 6 June 2014.
  5. Brzezinski, Zbigniew (1997). The grand chessboard : American primacy and its geostrategic imperatives ([Repr.] ed.). New York, NY: Basic Books. p. 31. ISBN 978-0465027262.
  6. Nartov, N. A. (2004). Geopolitika : [učebnik] (3rd ed.). Moskva: Edinstvo. Part 2.4, p. 50. ISBN 978-5238006826.
  7. Tovy, Tal (2015). The changing nature of geostrategy, 1900-2000: the evolution of a new paradigm (PDF). Maxwell Air Force Base, Alabama: Air University Press. Air Force Research Institute. p. 19. ISBN 978-1-58566-253-1. Archived from the original (PDF) on 7 August 2019. Retrieved 8 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=యూరేషియా&oldid=3850500" నుండి వెలికితీశారు