రామాయపట్నం
రామాయపట్నం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°02′N 80°03′E / 15.03°N 80.05°ECoordinates: 15°02′N 80°03′E / 15.03°N 80.05°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఉలవపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 722 హె. (1,784 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,236 |
• సాంద్రత | 310/కి.మీ2 (800/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523281 ![]() |
రామయపట్నం, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన గ్రామం.[1] ఈ ఊరు మొదట్లో రామపట్నం, తర్వాతి కాలంలో మయపట్నంగా పిలువబడి, ప్రస్తుతం రామయపట్నంగా పిలువబడుతోంది.
గ్రామ భౌగోళికం[మార్చు]
ఇది సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు
సమీప గ్రామాలు[మార్చు]
రావూరు 3 కి.మీ; చాకిచెర్ల 5.7 కి.మీ; మోచెర్ల 6 కి.మీ; చేవూరు 6.6 కి.మీ; వీరేపల్లి 7.3 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
ఉలవపాడు 12.8 కి.మీ; గుడ్లూరు 15 కి.మీ; కందుకూరు 21.9 కి.మీ; సింగరాయకొండ 22.3 కి.మీ.
నౌకాశ్రయం[మార్చు]
సుమారు 1800వ సంవత్సరం నుంచి రామాయపట్నం రేవు ప్రాంతంగా పలు వ్యాపారాలకు నిలయమైంది. ఈ రేవు నుంచే ఆంగ్లేయుల కాలంలో బర్మా నుంచి టేకు మొద్దులు దిగుమతి అవుతుండేవి.[2]
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో భారీ ఓడరేవుని నిర్మించ తలపెట్టినపుడు, రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపిన మూడు ప్రతిపాదిత స్థలాలలో ఒకటి రామాయపట్నం కాగా, తక్కినవి విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం.
- తొలుత, రామాయపట్నంలోనే భారీ ఓడరేవు ఏర్పాటవుతుందని అందరూ ఊహించారు. ఇందుకోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను కూడా ఏర్పరచారు. ఈ ప్రాజెక్టులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 11% ఈక్విటీ వాటా ఉండబోతోంది.[3][4] జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (NMDC) ప్రధాన వాటాదారుగా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, IFFCO లు ఇతర ముఖ్య వాటాదారులుగా ఈ పోర్టు ఏర్పడాల్సింది.[5][6]
- ప్రాజెక్టు ప్రారంభ పెట్టుబడి 8000 కోట్ల రూపాయలు. భారీ ఓడరేవుతో పాటు, భారీ నౌకా నిర్మాణ కేంద్రం, చేపల రేవు, తత్సంబంధిత ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు.[7].
- ఈ ప్రాజెక్టుకై నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంని ఎంపిక చేసారు. ఈ ఎంపికపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. రామయపట్నం పోర్టు సాధన సమితి నేతృత్వంలో దుగ్గరాజపట్నం ఎంపికకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమౌతున్నారు.[8].
- అయితే, కొందరు నాయకులు దుగ్గరాజపట్నంతో పాటు, రామయపట్నం వద్ద కూడా ఓడరేవు నిర్మించాలని డిమాండు చేస్తున్నారు.
- కానీ దుగరాజపట్నంలో నౌకాశ్రయం ఏర్పాటు చేయడానికి, పలు సాంకేతిక సమస్యలు, అడ్డంకులు ఎదురవుచున్న నేపథ్యంలో, మళ్ళీ తిరిగి రామాయపట్నంలోనే ఏర్పాటుచేయడానికై, ఇక్కడ ఏర్పాటు చేయడానికిగల అవకాశాలను పరిశీలించడానికై, కేంద్ర ప్రభుత్వం, 2015, ఆగష్టు-19,20 తేదీలలో, ఒక బృందాన్ని పంపించుచున్నది. [10]
- రామాయపట్నంలో నొకాశ్రయం ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం పచ్చజండా ఊపిందని రాష్ట్ర రవాణా, రహదారులు భవనా శాఖ మంత్రి శ్రీ శిద్ధా రాఘవరావు, ఒంగోలులో, 2015, ఆగష్టు-21వ తేదీన ఒంగోలులో వెల్లడించారు. [11]
పరిశ్రమలు[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు, మెదక్ జిల్లాలోని ప్రాంతాలతో పాటు రామయపట్నాన్ని కూడా "జాతీయ మానుఫాక్చరింగ్ పెట్టుబడుల సీమ" ( National Manfacturing and Investment Zone - NMIZ) గా ప్రతిపాదించింది. ఈ NMIZ మొత్తం 5000 ఎకరాలలో విస్తరించి ఉంది.[9]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,236 - పురుషుల సంఖ్య 1,150 - స్త్రీల సంఖ్య 1,086 - గృహాల సంఖ్య 591
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,517.[10] ఇందులో పురుషుల సంఖ్య 1,294, మహిళల సంఖ్య 1,223, గ్రామంలో నివాస గృహాలు 561 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 722 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ "రామాయపట్నం తీరప్రాంత విశేషాలు". Eenadu. Sep 15, 2012. Archived from the original on 31 జనవరి 2014. Retrieved 09 May 2014. Check date values in:
|accessdate=
and|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Ramayapatnam picked for new major port". HT MInt. Sep 15, 2012. Retrieved 22 November 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Second major port at Ramayapatnam". The Hindu. October 12, 2012. Retrieved 22 November 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Ramayapatnam port to come up with 11 p.c. equity". The Hindu. September 22, 2012. Retrieved 22 November 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ "NMDC to pick up majority stake in Andhra Pradesh's new port". The Economic Times. November 2, 2012. Retrieved 22 November 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Ramayapatnam likely to be 2nd big port in state". CNN IBN. September 5, 2012. Retrieved 22 November 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Green tribunal to be moved against port at Dugarajapatnam". The Hindu. December 4, 2014. Retrieved 09 May 2014. Check date values in:
|accessdate=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Three manufacturing zones proposed in Andhra Pradesh". November 30, 2012. Retrieved 17 December 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామగణాంకాల కొరకు ఇక్కడ చూడండి.[1]