రేణిమడుగు
రేణిమడుగు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°07′01″N 79°25′01″E / 15.117°N 79.417°ECoordinates: 15°07′01″N 79°25′01″E / 15.117°N 79.417°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పామూరు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 929 హె. (2,296 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Target string is empty |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523110 ![]() |
రేణిమడుగు, ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన గ్రామం.[1]
పేరువెనుక చరిత్ర[మార్చు]
పూర్వ కాలంలో ధీనిని రాజులు పాలించెవారు.ఈ ఊరి నుంచి 1కి.మి దూరంలో భయరప్ప తిప్పా ఉంధి.ఆ కొండ మిధ భయరప్ప అయన భార్య రాణిధెవి నివసిస్తూ వుండెవారు.రాణిధేవి ఆ ఊరి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపిస్తూ ఊరి ప్రజలకు యెలాంటి ఇబ్బంది రాకుండా చుసేధి. ఐతే ఆ కొండ క్రింద పెద్ద మడుగు వుండేది. ఐతే పక్క రాజులు దండెత్తి భయరప్పను హతమార్చారు.రాణిధేవి భర్త పొయిన తరువాత ఈ జీవితం నాకు అవసరం లేదని ఆమె కూడా మడుగులో ధూకి చనిపోయింధి.ఆ తరువాత ఆమె పేరు మీధ ఆ ఊరికి రాణిమడుగు పేరు వచ్చింధి ఆధి క్రమేణ రేణిమడుగు ఐయింధి. ఇప్పుడు అధి రెండుఊరులుగా విడిపొయింధి అంధులో మొధటిధి పాత రేణిమడుగు, రెండోధి కొత్త రేణిమడుగు.......
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]
రేణిమడుగుకు 15కిమి దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి (మాల కొండ) ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రకాశం జిల్లాలో చెప్పుకొదగిన వాటిల్లో ఇది ఒకటి. ఇక్కడ మార్కండేయుడు అరాధించిన శివలింగం ఉంది. అసలు ఈ క్షేత్రానికి మాల కొండ అని పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం మార్కండేయుడు పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ ఈ క్షేత్రానికి వచ్చాడు. అప్పటి అక్కడ చెట్లు, జంతువులు తప్ప జన జీవనం లేదు. అందుకని ఆయన ఆ ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంబించాడు. అతను గొప్ప తపస్సంపన్నుడే కాక శిలలు చ్చెక్కడంలో మంచి నైపుణ్యం కలవాడు. ఖాళీ సమయంలో అతను ఆ పక్కనే ఉన్న గుహలో ఉన్న రాయిని మలిచే వాడు. కాల క్రమంలో అతని పేరు మీదుగా మాల కొండగా మారినది. ఇప్పుడు ఆ క్షేత్రంలో ఆరాధిస్తున్న విగ్రహం కూడా మార్కండేయుడు చెక్కినదే.
ప్రతి శనివారం మాత్రమే ఈ క్షేత్రం భక్తులకు స్వామి దర్శనం ఇస్తాడు. ఇక్కడ అగస్త్య ముని, దత్తాత్రేయ స్వామి తపస్సు చేసారు. దత్తాత్రేయ స్వామి ఇక్కడ 12 సంవత్సరాలు కొండ మద్యలో ఉన్న పార్వతి దేవికి తపస్సు చేసి ప్రసన్నం పొంది మొగలి చెర్ల అను గ్రామంలో సమాధి అయ్యారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయము , పాలు అమ్మాడము, గొర్రెల పెంపకం తదితర కూలి పనులు చేస్తున్నారు.
గణాంకాలు[మార్చు]
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 354. ఇందులో పురుషుల సంఖ్య 210, మహిళల సంఖ్య 144, గ్రామంలో నివాస గృహాలు 60 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 150 హెక్టారులు.
సమీప గ్రామాలు[మార్చు]
తూర్పునా కొత్త రేణిమడుగు 1.0 కి.మీ, లింగసముద్రం 15.1 కి.మీ, పశ్చిమనా కంబలి దిన్నె, ఉత్తర-తూర్పునా బోడ వాడ, , ఉత్తరనా చుండి 8.4 కి.మీ, దక్షిణనా పొట్టిపల్లి సరి హద్దులుగా ఉన్నాయి.
సమీప పట్టణాలు[మార్చు]
లింగసముద్రం 7 కి.మీ, వోలేటివారిపాలెం 15.6 కి.మీ, పామూరు 25 కి.మీ.