వాడుకరి చర్చ:Abhich98

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Abhich98 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Abhich98 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:41, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదాలు Abhich98 (చర్చ) 11:31, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సిమ్లా పేజీ గురించి

[మార్చు]

Abhich98 గారూ, సిమ్లా పేజీలో కొత్త సమాచారాన్ని చేర్చి మెరుగుపరచినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించి చేర్చారు. అందుకు కూడా ధన్యవాదాలు. ఐతే ఈ రెండో విషయం గురించి ఈ సూచనను పరిశీలించండి - వాసంలో సమాచారం చాలా పరిమితంగా ఉంది. చరిత్ర, పర్యాటక ప్రదేశాలు, ఆర్థిక వ్యవస్థ, రవాణా సౌకర్యాలు, జనాభా గణాంకాలు వంటి అంశాలు ఉంటే పేజీకి కొంత "బరువు" చేకూరుతుంది. లేదంటే మొదటిపేజీ నుండి ఈ వ్యాసానికి వచ్చి చూసే పాఠకులకు ఆశాభంగం కలుగుతుంది. అంచేత ప్రస్తుతం ఈ వ్యాసాన్ని ఈవావ్యా జాబితా నుండి తొలగించి వ్యాసాన్ని విస్తరించుకున్నాక, అప్పుడు చేరుద్దాం. __ చదువరి (చర్చరచనలు) 04:26, 28 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకరిస్తున్నాను. ప్రస్తుతానికి తొలిగిద్దాం. నేను రాబోయే రోజుల్లో ఇంకా మెరుగు పరుద్దామనే అనుకున్నాను. మీరు చెప్పినవి జోడించాక మళ్లీ చేర్చుతాను.--Abhich98 (చర్చ) 12:00, 28 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీ అనువాదాలు

[మార్చు]

ఇప్పటికే వున్న వ్యాసాలను అనువాదం ద్వారా విస్తరిస్తున్నందులకు ధన్యవాదాలు. (ఉదాహరణ) మీ అనువాదానికి ఏ పరికరం, అనువాదం నాణ్యతగా వున్నదనటానికి ఏ ప్రక్రియ వాడుతున్నారు? అనువాద మూలం శాశ్వత లింకు వివరాలు మీ సవరణ సారాంశంలో పొందుపరచితే, ఇతరులు వ్యాసాన్ని సరిచూడడానికి, అభివృద్ధికి సూచనలు చేయడానికి వీలవుతుంది. Special:ContentTranslation వాడి అనువాదాన్ని మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా భద్రపరచి, తరువాత ప్రధానపేరుబరిలోని వ్యాసంలో విలీనం చేయటం కూడా పరిశీలించండి. మరింత సమాచారానికి వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం చూడండి. అర్జున (చర్చ) 22:59, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు, మీరు వివరించిన ఈ అనువాద ప్రక్రియ మీద నాకు పూర్తి అవగాహన లేదు. మామూలుగా నేను ఒక పేజీని ఎంచుకొని దానిపై వికీపీడియా అనువాదంలో (Special:ContentTranslation) గూగుల్ అనువాదంతో పనిచేస్తాను, తర్వాత ఆ అనువాదంలో తప్పులు సరిచేయడం లేక తిరిగి రాయడం చేస్తుంటాను. అయితే చాలా పేజీలలో పూర్తి సమాచారం తెవికీ కి అవసరముండదు. అనుచితమైన విషయాన్నే అనువదిస్తాను. చాలా సార్లు ఒక పేజీలో ఉన్న విషయంలో 60% కంటే తక్కువే అనువదిస్తుంటాను, అప్పుడు ఆ ఉపకరణం నా అనువాదన్ని ప్రచురించనివ్వదు. అలా అనువదించిన విషయాన్ని కాపీ చేసి దాని పేజీలో సవరణ కింది ప్రచురిస్తుంటాను. నా వివరణ మీకు అర్థమవ్తుందని ఆశిస్తున్నాను.
ఇకపై అనువదించినప్పుడు, మీ సలహాలను పాటిస్తాను. Abhich98 (చర్చ) 23:34, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక చిన్న వివరణండీ.. అనువాద పరికరం, మూల వ్యాసం లోని ఎంత శాతాన్ని అనువదించినా ప్రచురిస్తుంది, అభ్యంతర పెట్టదు. కానీ ఆ అనువాదంలో యాంత్రికానువాదం 70% కి మించి ఉండకూడదనే నియమాన్ని పాటిస్తుంది. యాంత్రికానువాదం మరీ కృతకంగా ఉంటుంది, దాన్ని సవరించి ప్రచురించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది యాంత్రికానువాదాన్ని ఉన్నదున్నట్టుగా ప్రచురిస్తూ నాణ్యత లేని వ్యాసాలను చేరుస్తూ ఉండడంతో, మానవికంగా చేసే అనువాదం కనీసం 30% ఉండాలనే నిబంధనను చేర్చారు. అలా కృతక అనువాదాలున్న వ్యాసాలు దాదాపు 2 వేలను తొలగించాల్సి వచ్చింది. అలాగే ప్రచురించే పాఠ్యంలో "మరియు" ఉంటే అనుమతించదు. __ చదువరి (చర్చరచనలు) 05:56, 12 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]