వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 7
This is an archive of past discussions with User:Pavan santhosh.s. Do not edit the contents of this page. If you wish to start a new discussion or revive an old one, please do so on the current talk page. |
పాత చర్చ 7 |
All Pages: | ... (up to 100) |
WAM Reminder
Hi WAM organizers!
Thanks again for organizing Wikipedia Asian Month. There are only 4 days before it starts. If you haven't yet signed your language in WAM 2017, You can sign-up here. Below we have provided some notices and guidelines for organizing.
- Page Setup
- Our Sample page is ready to be translated. There are only a few adjustments if you had this page for 2016 already.
- Article Requirement is 4
- Article criteria are 3k bytes and 300 words. NO 2k bytes for smaller Wikipedia.
- According to the tool's limit, IP users can not participate. Please encourage them to register an account.
- Localization
- Please localize this template and used on sign up page. I will update the template once the tool is ready to be used.
- You may localize this page, but you can also just put a link towards the meta page. m:Wikipedia Asian Month/QA
- Strategy
- You may have to invite some of your Wikipedia friends or active Wikipedians from your home WIKI to help you organize.
- You may have to send some invitation to last year participants, active Wikipedians, and Wikipedians who has a special interest.
- Central Notice will be used. You may use the Site Notice if you don't see the CN is deployed.
- Reward
- We will keep sending postcards (new design) this year, and as an organizer, you will receive an additional postcard as well.
- We will have many special prizes provided by Wikimedia Affiliates and others. Take a look at here. Let me know if your organization also would like to offer a similar thing.
- We will send the Ambassador a regular paper copy of the certificate through the basic mail.
- Question
Please feel free to contact me or the WAM team meta talk page, send me an email by Email this User or chat with me on facebook.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 13:38, 27 అక్టోబరు 2017 (UTC)
Wikipedia Asian Month 2017: engage with audience
Dear WAM organizer,
I’m Erick, the coordinator of WAM 2017. Thanks for your effort and help at m:Wikipedia Asian Month 2017! Here are some more information about organizational matter of the event at a national level.
You are receiving this message because you have signed up as a organizer or in the list.
- Timeline
The event has started and will end in the November 30th 23:59 (UTC). However, we are late for some matter. So we need your help:
- Invite previous participants and your community members to join. We have a template you can use.
- Translate Central Notice for your community (more instruction below) as well as sending a notice in village pump. Go public!
- Become the jury member in a campaign on Fountain which is an amazing tool for you to supervise participants’ articles. If you don’t have the campaign set up, please contact us! And put a link to your community’s campaign page for participants’ navigation.
- Organize a off-site editathon event. A coffee bar, internet and laptops. Though it’s optional. If you want to do that, please contact me.
In the following days, you should answer the questions from your community and supervise the submissions. Hope you have fun!
- Prepare Central Notice
Central Notice shows a banner on the top of pages in your wiki project along the event timeframe. We will use this to engage with audience. Steps:
- Translate, change logo and link to event page. Find your project's Central Notice here. For example, we can change the banner for Chinese Wikipedia here.
- When you mark the 4 items (translation) as done. I'll enable the central notice in your language for this month.
- Interesting articles
Have some interesting articles in your mind or from community? Drop us a line so that we can post that here to exchange the information to other communities.
- Special Prize
You can find some special prizes in Event Partner page. They can be claimed by:
- Write an article about Indigenous people in Taiwan at Wikipedia Asian Month (supported by Wikimedia Taiwan).
- Write articles on monuments of Bhubaneswar (supported by Bhubaneswar Heritage Edit-a-thon).
The participants who joins for the special prize need to also report their conribution in the speical page. The link is shown in the Event Partner page.
- Looking for help
At all times, please reply me back or send me an email at erick@asianmonth.wiki.--Fantasticfears (talk) 12:12, 5 నవంబర్ 2017 (UTC)
CIS-A2K Newsletter August September 2017
Hello,
CIS-A2K has published their newsletter for the months of August and September 2017. Please find below details of our August and September newsletters:
August was a busy month with events across our Marathi and Kannada Focus Language Areas.
- Workshop on Wikimedia Projects at Ismailsaheb Mulla Law College, Satara
- Marathi Wikipedia Edit-a-thon at Dalit Mahila Vikas Mandal
- Marathi Wikipedia Workshop at MGM Trust's College of Journalism and Mass Communication, Aurangabad
- Orientation Program at Kannada University, Hampi
Please read our Meta newsletter here.
September consisted of Marathi language workshop as well as an online policy discussion on Telugu Wikipedia.
- Marathi Wikipedia Workshop at Solapur University
- Discussion on Creation of Social Media Guidelines & Strategy for Telugu Wikimedia
Please read our Meta newsletter here: here
If you want to subscribe/unsubscribe this newsletter, click here.
Sent using --MediaWiki message delivery (చర్చ) 04:23, 6 నవంబర్ 2017 (UTC)
గ్రామ వ్యాసాలకు విజువల్ ఎడిటర్ కావాలి?
గ్రామ వ్యాసాలను విజువల్ ఎడిటర్ లో ఎక్కించమని చదువరి గారు చెప్పారు. కనుక విజువల్ ఎడిటర్ నా కంపూటర్ లో స్థాపించుకొనుటకు దాని లింకును పంపగలరు. Bhaskaranaidu (చర్చ) 06:18, 12 నవంబర్ 2017 (UTC)
- భాస్కరనాయుడు గారూ దీనికోసం మీరు నా అభిరుచులులోకి వెళ్ళి, అక్కడ దిద్దుబాట్లు అన్న ట్యాబులోకి వెళ్ళి, Editing mode: అన్నదగ్గర Always give me visual editor if possible అని కానీ, Give me both editor tabs అని కానీ మీ అవసరాన్ని అనుసరించి ఎంచుకోండి. (రెంటిలో ఏది ఎంచుకున్నా విజువల్ ఎడిటర్ వస్తుంది, ఐతే రెండోది ఎంచుకోవడం వల్ల విజువల్ ఎడిటర్ మరియు సోర్సు ఎడిటర్ రెండూ వస్తాయి). ఆపైన కింద భద్రపరుచు బటన్ నొక్కితే మీ ఎంపికలు భద్రమవుతాయి. దాంతో మీరు విజువల్ ఎడిటర్ సచేతనం చేసినట్టు అవుతుంది. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:41, 13 నవంబర్ 2017 (UTC)
గ్రామ వ్యాసాలు
అనంతపుర జిల్లా గ్రామ వ్యాసాలు నాకు అందలేదన్నాను. నిజానికి అవి నాకు అక్టోబరులోనే అందినవి. ఏత్తి వ్రాయడము కూడ అయిపోయినది. నేనే మర్చి పోయాను. కాని అప్పటి నా నిర్ణయం ప్రకారము వ్యాసములోని ఖాళీల ను పూరించలేదు. ఎందుకంటే.... అవి యంత్రంతో వాటంతట అవే తొలిగి పోతాయనే బ్రమలో వున్నాను. ఇప్పుడు ఆ ఖాళీలను కొంతవరకు పూరిస్తున్నాను. Bhaskaranaidu (చర్చ) 13:34, 28 డిసెంబరు 2017 (UTC)
- భాస్కరనాయుడు గారూ, సరేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 12:24, 29 డిసెంబరు 2017 (UTC)
CIS-A2K Newsletter October 2017
Hello,
CIS-A2K has published their newsletter for the months of October 2017. The edition includes details about these topics:
- Marathi Wikipedia - Vishwakosh Workshop for Science writers in IUCAA, Pune
- Bhubaneswar Heritage Edit-a-thon
- Odia Wikisource anniversary
- CIS-A2K signs MoU with Telangana Government
- Indian Women Bureaucrats: Wikipedia Edit-a-thon
- Interview with Asaf Bartov
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here.
Sent using --MediaWiki message delivery (చర్చ) 05:44, 4 డిసెంబరు 2017 (UTC)
What's Next (WAM)
Congratulations! The Wikipedia Asian Month is has ended and you've done amazing work of organizing. What we've got and what's next?
- Here are some number I would like to share with you
- Total submitted: 7429 articles; 694 users
- Here are what will come after the end of WAM
- Make sure you judge all articles before December 12th, and participants who can improve their contribution (not submit) before December 10th.
- Once you finish the judging, please update this page after December 12th
- There will be three round of address collection scheduled: December 15th, December 20th, and December 25th.
- Please report the local Wikipedia Asian Ambassador (who has most accepted articles) on this page, if the 2nd participants have more than 30 accepted articles, you will have two ambassadors.
- There will be a progress page for the postcards.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 17:37, 5 డిసెంబరు 2017 (UTC)
What's Next (WAM)
Congratulations! The Wikipedia Asian Month is has ended and you've done amazing work of organizing. What we've got and what's next?
- Here are some number I would like to share with you
- Total submitted: 7429 articles; 694 users
- Here are what will come after the end of WAM
- Make sure you judge all articles before December 12th, and participants who can improve their contribution (not submit) before December 10th.
- Once you finish the judging, please update this page after December 12th
- There will be three round of address collection scheduled: December 15th, December 20th, and December 25th.
- Please report the local Wikipedia Asian Ambassador (who has most accepted articles) on this page, if the 2nd participants have more than 30 accepted articles, you will have two ambassadors.
- There will be a progress page for the postcards.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 17:37, 5 డిసెంబరు 2017 (UTC)
గ్రామవ్యాసాలు కావాలి
పవన్ గారు మరికొన్ని గ్రామ వ్యాసాలను చదువరి గారి నుండి పంపగోరుతున్నాను. చదువరి గారి వాడుకరి నామము కనిపించలేదు. కనుక మీకు వ్రాస్తున్నాను. ఇంతవరకు ఎవరికి కేటాయించని జిల్లాల నుండి ఆ వ్యాసాలను పంపగలరని మనవి. కర్నూలు జిల్లా వ్యాసాలను ఎవరికి కేటాయించ కుంటేవాటిని పంపగలరు. Bhaskaranaidu (చర్చ) 14:43, 3 జనవరి 2018 (UTC)
- Bhaskaranaidu గారూ, అనంతపురం జిల్లా గ్రామాల ఫైళ్ళు అందలేదని ఐదార్రోజుల కిందట మీరు నా చర్చ పేజీలో రాసారు. "ఇదివరకే పంపించాను, మరోసారి చూడండ"ని రాసాను. ఉన్నాయో మళ్ళీ పంపించాలో మీరు చెప్పక పోవడాన, అవి కనబడి ఉంటాయని అనుకున్నాను. ఆ జిల్లా ఫైళ్ళను మళ్ళీ పంపించమంటారా? __చదువరి (చర్చ • రచనలు) 15:58, 3 జనవరి 2018 (UTC)
- చదువరి గారూ భాస్కరనాయుడు గారికి ఆ ఫైల్స్ కనపడడంతోపాటుగా తాను ఇప్పటికే ఆ ఫైళ్ళలోని సమాచారాన్ని అనంతపురం జిల్లా గ్రామ వ్యాసాల్లో చేర్చేసినట్టు గుర్తువచ్చింది. ఐతే వ్యాసాల్లోని ఖాళీలను సవరించాలని ప్రయత్నం చేసి, ఈ కొద్దిరోజుల్లో పూర్తిచేసినట్టు ఉన్నారు. అందుకే మరో జిల్లా కోరుతున్నారని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:36, 4 జనవరి 2018 (UTC)
- కర్నూలు జిల్లా ఎక్సెల్ ఫైలును తెలుగు చేసే పని మీరు చేసారు కదా.. ఆ ఫైలు నాకు పంఫండి. టెక్స్టు ఫైళ్ళు తయారు చేసి పంపిస్తాను.__చదువరి (చర్చ • రచనలు) 14:41, 4 జనవరి 2018 (UTC)
- చదువరి గారూ భాస్కరనాయుడు గారికి ఆ ఫైల్స్ కనపడడంతోపాటుగా తాను ఇప్పటికే ఆ ఫైళ్ళలోని సమాచారాన్ని అనంతపురం జిల్లా గ్రామ వ్యాసాల్లో చేర్చేసినట్టు గుర్తువచ్చింది. ఐతే వ్యాసాల్లోని ఖాళీలను సవరించాలని ప్రయత్నం చేసి, ఈ కొద్దిరోజుల్లో పూర్తిచేసినట్టు ఉన్నారు. అందుకే మరో జిల్లా కోరుతున్నారని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:36, 4 జనవరి 2018 (UTC)
నమస్తే పవన్ గారు
నేను వికిపీడియాకు కొత్త నాకు నిబంధనలు పుర్తిగా తెలియవు Jiksaw1 (చర్చ) 05:45, 10 జనవరి 2018 (UTC)
కమ్మ విషయంలో నేను నాసొంత అభిప్రాయాలు ఎక్కడ వాడలేదు కేవలం చరిత్రకారుల పుస్తకాలు ఆధారంగానే ఎడిట్లు చేశాను Jiksaw1 (చర్చ) 05:47, 10 జనవరి 2018 (UTC)
ఖమ్మఖిల్లా మొదటి పేరు కమ్మమెట్టు ఈ విషయం అనేక పుస్తకాల్లో ఉంది స్థానికంగా ఇప్పటికి కూడా ఈ పేరే ఎక్కువగా వాడుకలో ఉంది.కమ్మవారు క్షత్రియ వర్ణం అని కే బి చౌదరి మరియు సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు పుస్తకాల్లో రాశారు Jiksaw1 (చర్చ) 05:50, 10 జనవరి 2018 (UTC)
- Jiksaw1 గారూ స్పందించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ విషయంపై నేను మీకు కొంత సాయపడగలననే అనుకుంటున్నాను, ఇందుకు ఒకే ఒక్క కారణం ఇప్పటికే నేను కొంత వికీపీడియా మీద, వికీపీడియా పాలసీల మీద పనిచేసివుండడం తప్ప మరేమీ కాదు. నేను పాలసీల గురించి నా అవగాహన రాస్తాను, చదివి మీ ఉద్దేశాలు చెప్పండి:
- చరిత్రకారులు, ఇతర శాస్త్రకారుల్లానే చాలా విషయాలపై భిన్నాభిప్రాయాలు కలిగివుంటారు. వాటిని వేర్వేరు సాక్ష్యాలు, ఋజువుల ఆధారంగా సిద్ధాంతాలుగా రూపొందించుకుంటూంటారు. మనం ఒక విషయంపై రాయాల్సి వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మనకి ఏ సిద్ధాంతంపై నమ్మకం ఉన్నా దేనివైపుకీ వెళ్ళకుండా అన్నిటిని ప్రతిబింబించాలి. ఉదాహరణకు కృష్ణదేవరాయలు తెలుగువాడనీ, కాదనీ పలు భిన్నాభిప్రాయాలు చరిత్రకారులు వ్యక్తం చేశారు కదా. మనం రాయాల్సివచ్చినప్పుడు మనం తెలుగు వారు అయిన కారణంగా ఏదోక పక్షాన్ని సమర్థించకూడదు. నేపథ్యంలో రాసేప్పుడు కృష్ణదేవరాయల తల్లి తెలుగు నేపథ్యం గురించి, స్వయంగా కూతుళ్ళకు తెలుగువారిని ఇచ్చి పెళ్ళి చేయడం గురించీ చరిత్రకారులు వెలిబుచ్చిన ఆధారాలు క్లుప్తంగా ప్రస్తావిస్తూ, ఆయన తండ్రి తుళువ నేపథ్యం గురించి, దానిపైన కూడా కొందరు చరిత్రకారులు తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళాడన్న అభిప్రాయం గురించి చెప్తూ, కన్నడిగుడు/తుళు ప్రాంతం వాడని ఎవరు అన్నారో, తెలుగువాడని ఎవరు రాశారో ప్రస్తావిస్తూ తటస్థంగా రాయాలి. ఇదే మీరు రాసినవాటిలో చాలావాటికి వర్తిస్తుంది. ఇది వికీపీడియా మూలస్తంభాల్లో ఒకటైన తటస్థ దృక్కోణం అన్న సూత్రానికి సంబంధించిన విషయం.
- క్షత్రియ అన్న పదం వర్ణ వ్యవస్థలో ఒక విభాగానికి సంబంధించింది కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారు ఫలానా ఫలానా పనులు చేస్తారని వర్ణ వ్యవస్థ సిద్ధాంతంలో చెప్పడమే కానీ చారిత్రకంగా ఆ వ్యవస్థని పక్కనపెట్టి తమ తమ వృత్తులు, సంప్రదాయాలు ఎన్నుకున్న వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పీష్వాల పరిపాలన గురించి మీకు తెలిసేవుంటుంది, వారు చిత్పవన్ బ్రాహ్మణులు. అలానే కమ్మవారు, రెడ్లు, వెలమలు - వర్ణ వ్యవస్థతో సంబంధం లేకుండా పరిపాలన చేశారు. నిజానికి క్షత్రియ వర్ణం వారి పరిపాలనలో ఆంధ్ర దేశం ఉన్నది చాలా తక్కువ భాగం, తక్కువ సమయం. కాబట్టి పరిపాలించే ప్రతి ఒక్కరూ వర్ణ వ్యవస్థను బట్టి పరిపాలించరు. అసలు భారతదేశం మొత్తం మీద చూసుకున్న రాజ్య విస్తరణ, ఆయుధ సంపత్తి ఉన్నవారు పరిపాలించారు కానీ వర్ణం ఆధారంగా పరిపాలన ఎక్కడ జరిగింది? ఈ విషయంలో కమ్మవారు చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో పలు రాజ్యాల్లోనూ, సంస్థానాల్లోనూ రాజులుగా, జమీందార్లుగా పరిపాలన చేశారు. అంతేకాక పలు సామ్రాజ్యాల్లో సేనానులుగా, రాజ్యపరిపాలనా ఉద్యోగులుగా, సామంతులుగానూ కీలక బాధ్యతలు నెరవేర్చారు. అని కదా రాయాలి. ఒకవేళ చారిత్రకంగా వేయేళ్ళ క్రితమో మరొహప్పుడో వీరు క్షత్రియ వర్ణం వారిగా గుర్తింపు పొందారని ఎవరైనా చరిత్రకారులు అంటే - ఫలానా సూర్యదేవర రాఘవయ్య చౌదరి, కేబి చౌదరి వంటి రచయితలు కమ్మవారు మౌలికంగా క్షత్రియ వర్ణానికి చెందినవారని రాశారు అని (వికీపీడియా వ్యాసం అభిప్రాయం వ్యక్తపరచకూడదు, వేరేవారి అభిప్రాయం చెప్పేప్పుడు వారి పేరు రాయాలి) రాయాలి. అంతేతప్ప ప్రస్తుత కాలంలోనూ వారు క్షత్రియ వర్ణస్తులుగానే వ్యవహరింపబడుతున్నారనో, చారిత్రకంగా శతాబ్దాల పాటు అలా వ్యవహరింపబడ్డారనో అభిప్రాయం కలిగేలా రాయకూడదు కదా. గమనించండి, రెంటికీ చాలా తేడా ఉంది. చారిత్రక వాస్తవాలను, సిద్ధాంతాలను విడిగానే వ్యక్తం చేయాలి.
దయచేసి మీరు ఈ విషయంపై నిరుత్సాహం చెందకండి. వికీపీడియా అన్నది విజ్ఞాన సర్వస్వం. మీకు తెలిసిన సమాచారాన్ని చేరుద్దురు గానీ, కానీ దీన్ని పలు పాలసీలు గవర్న్ చేస్తున్నాయని గమనించాలి. అలానే వివాదాలను చర్చల ద్వారా, పాలసీల ఆధారంగా పరిష్కరించుకోవాల్సి వస్తుంది. మరోమారు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:21, 10 జనవరి 2018 (UTC)
గ్రామ వ్యాసాలు
- చదువరి గారూ.... పవన్ గారూ
మీరు పంపిన కడప జిల్లా గ్రామ వ్యాసాలు పూర్తయినవి. కర్నూలు జిల్లాగ్రామ వ్యాసాలు పంపగలరా...... Bhaskaranaidu (చర్చ) 05:27, 13 జనవరి 2018 (UTC)
- నాకు పంపడానికి గ్రామ వ్యాసాలు సిద్ధంగా లేనట్టున్నది. నేనే తొందరపడుతున్నట్టున్నాను. గుర్తు చేయడం నా బాద్యత కదా......Bhaskaranaidu (చర్చ) 06:05, 16 జనవరి 2018 (UTC)
- భాస్కరనాయుడు గారూ సంక్రాంతి శుభాకాంక్షలు. పేర్లను తెలుగులోకి మార్చే పని నేను చేస్తూన్నాను, సరిగ్గా ఇవాళే అయింది. మిగతా పని చదువరి గారు పూర్తిచేసేస్తారు. మీరు అతిత్వరలోనే అందుకోవచ్చు. మీ ఆసక్తికి చాలా చాలా ధన్యవాదాలు, మీవంటివారి ఉత్సాహమే ఇంధనంగా పనికివస్తోంది కాబట్టి మీరేం తొందరపడట్లేదు. సాధ్యమైనంత త్వరలో మనం పూర్తిచేసేసుకోవాలంటే మీలా అందరం ఉత్సాహంగా ముందుకు సాగాల్సిందే. --పవన్ సంతోష్ (చర్చ) 06:43, 16 జనవరి 2018 (UTC)
- నాకు పంపడానికి గ్రామ వ్యాసాలు సిద్ధంగా లేనట్టున్నది. నేనే తొందరపడుతున్నట్టున్నాను. గుర్తు చేయడం నా బాద్యత కదా......Bhaskaranaidu (చర్చ) 06:05, 16 జనవరి 2018 (UTC)
- చదువరి గారు....../ పవన్ గారూ.......
ఇంతవరకు ఎవ్వరికి కేటాయించని జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని మనవి. Bhaskaranaidu (చర్చ) 17:05, 24 జనవరి 2018 (UTC)
- చదువరి గారు......
ఇంతవరకు ఎవ్వరికి కేటాయించని జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని మనవి. Bhaskaranaidu (చర్చ) 17:03, 24 జనవరి 2018 (UTC)
Bhaskaranaidu గారూ, కర్నూలు జిల్లా గ్రామాల ఫైళ్ళను పంపి వారమైంది సార్.__చదువరి (చర్చ • రచనలు) 17:52, 24 జనవరి 2018 (UTC)
- చదువరి గారు పైన చెప్పినట్లు కర్నూలు జిల్లా గ్రామ వ్యాసాలు నాకు పంపి ఒక్క వారము మాత్రమే అయినది. అవి పూర్తి అయినందున మరొక్క జిల్లా గ్రామ వ్యాసాలను పంపమని అభ్యర్దించాను. పై సమాదానములో "ఒక జిల్లా గ్రామ వ్యాసాలన్నిటిని సుమారు వెయ్యి వ్యాసాలను పంపి ఒక్క వారం కూడ కాలేదు.... ఇంతలో మల్లీ మరొక్క జిల్లా వ్యాసలను కావాలని అడగటమా??????" అనే అర్థం ద్వనిస్తున్నది. అడిగినన్ని వ్యాసాలను పంపితే దుర్వినియేగము చేస్తారనే భయమే మరేదైనా కారణమో ???? దీనిని బట్టి నాకు అర్థమైనదేమంటే.... "ఒక్కొక్క వాడుకరికి ఒక్క వారానికో లేదా ఒక్క నెలకో ఇన్ని వ్యాసాలు మాత్రమే పంపబడును" అని కోటా కేటాయించు కున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని నాకు ముందుగా తెలియ జేసి వుంటే నా కోటా ప్రకారమే పని పూర్తి చేసి నాకు కేటాయించిన సమయము తర్వాత మాత్రమే వ్యాసాలకొరకు అభ్యర్దన పెట్టే వాడిని. కోటా పద్దతి వున్నట్లు నాకు తెలియక పోవడమే ఈ గందరగోళానికి కారణము.
పైగా ఒక వాడుకరికి కేటాయించిన వ్యాసాలన్నీ పూర్తి చేసారా లేదా అన్న విషయము చదువరి గారు పరిశీలించిన తర్వాత మాత్రమే వ్యాసాలను పంపుతారని అనుకున్నాను. అదియును గాక వాడుకరి ఇచ్చిన వ్యాసాలను పూర్తిచేశాడా లేదా? అన్న విషయములో గోప్యత లేదు. అంతా బహిరంగమే. పైగా చదువరి గారు వికిపీడియాలో అధికారి కూడాను. కొత్తగా వ్యాసాలను కేటాయించు నప్పుడు ఇదివరకు ఇచ్చిన వ్యాసాలను పూర్తి చేశాడా? లేదా? అన్న విషయాన్ని పరి శీలించిన తర్వాత నే కొత్త వ్యాసాలను కేటాయిస్తారు.
చదువరి గారూ......... ఇప్పుడు మించి పోయినది ఏమి లేదు... మీరు నిర్ణయించు కున్న కోటా ప్రకారమే ఆ సమయానికే నాకు మరి కొన్ని గ్రామ వ్యాసాలను పంపగలరు. తొందర లేదు. ఒక వేళ మీరు పంపక పోయినా పర్వాలేదు. నాకు ఇబ్బంది ఏమి లేదు. Bhaskaranaidu (చర్చ) 06:57, 25 జనవరి 2018 (UTC)
- పవన్ గారూ..........
మాహబూబ్ నగర్ జిల్లా గ్రామ వ్యాసాలు పంపామన్నారు. ఆ పైలు అటాచ్ మెంటు నాకు కనబడలేదు. మరొక్క సారి ఆ ఫైలు పంపగలరా.....Bhaskaranaidu (చర్చ) 11:40, 28 జనవరి 2018 (UTC)
- భాస్కరనాయుడు గారూ! మీరు అడిగినట్టే వేరే మెయిల్లో చదువరి గారు పంపిన ఫైలు పంపానండీ, పరిశీలించండి. అలానే మహబూబ్ నగర్ ఇప్పుడు వేరే జిల్లాలుగా మారినందున, ఆ మారిన సమాచారాన్ని కూడా అప్డేట్ చేస్తూ చదువరి గారు వ్యాసాలు రూపొందించారు. కనుక కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లోని గ్రామ వ్యాసాల్లో మాత్రం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం ఫలానా జిల్లా, ఫలానా మండలంలో ఈ గ్రామం ఉందన్న వివరం మొదటి పేరా చివర చేర్చమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:13, 30 జనవరి 2018 (UTC)
కమ్మ
పవన్ సంతోష్ గారు, కమ్మ వ్యాసములోని నిరాధారమగు మార్పులు, చేర్పులు చేయకుండా వ్యాసమును రక్షించుటకు నిర్వాహకులకు తెలియచేయ ప్రార్ధన. చర్య తీసుకొని తీరవలిసిందే.Kumarrao (చర్చ) 17:15, 15 ఫిబ్రవరి 2018 (UTC)
ప్రఖ్యాత చరిత్రకారుడు సూర్యదేవర రఘవయ్య చౌదరిగారు కమ్మవారు క్షత్రియులు అని ఋజువు చేసి "ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర" అనే పుస్తకం కూడా రాసారు. అది విశేష ఆదరణ చుడగొంది 1930 - 1940 ప్రాంతల్లో......ఆయన రాసిన దానినే నేను ఇక్కడ ఆధారాలతో ఎడిట్లు చేశాను. ఎక్కడా సొంత అభిప్రాయాలు రాయలేదు Jiksaw1 (చర్చ) 03:39, 16 ఫిబ్రవరి 2018 (UTC)
ఎప్పుడైనా నా ఎడిట్లు తటస్థ సమాచారినికి విరుధంగా ఉంటే దయచేసి తెలియపరచండి నేను నా ఎడిట్లు సవరించుకుంటాను Jiksaw1 (చర్చ) 03:51, 16 ఫిబ్రవరి 2018 (UTC)
- Jiksaw1 గారూ, సమకాలీన సమాజంలో కమ్మవారు క్షత్రియ వర్ణస్తులుగా చెప్పుకోవట్లేదన్నది, క్షత్రియ వర్ణస్థులు సాధారణంగా అనుసరించే ఉపనయనాది పద్ధతులు అనుసరించరన్నది సామాన్య అవగాహన. కొందరు పరిశోధకులు ఇది సరికాదు, వారు పూర్వం క్షత్రియులు ఏవో కొన్ని సాక్ష్యాధారాల పరిశోధనల ద్వారా నిరూపించి వుంటే ఏం చేయాలి? "మొదట్లోనూ, పలు శతాబ్దాల పాటు కమ్మవారు క్షత్రియులని ఫలానా చరిత్రకారుడు పలు సాక్ష్యాధారాలతో పేర్కొన్నారు" అని ఓ ముక్క ఉండడం తటస్థ దృక్పథం. ఆ చరిత్రకారుడి సిద్ధాంతం వ్యక్తులుగా మీరు నమ్మవచ్చు, నేనూ నమ్మితే నమ్మవచ్చు, వికీపీడియా వ్యాసం దానిని ప్రతిబింబించకూడదు, ఒకానొక సిద్ధాంతంగా ప్రస్తావించి ఊరుకోవాలి. అలా కాకుండా అదే విషయాన్ని నిర్ధారిస్తూ (కమ్మ క్షత్రియ అంటే భావయ్య గారి సిద్ధాంతాన్ని వ్యాసం ఒప్పుకున్నట్టు అవుతుంది) రాస్తే తటస్థ దృక్పథానికి భంగకరం. మీరు మరో విషయం గ్రహించాలి, ఒక కులాన్ని గురించిన వ్యాసంలో ఎంతసేపూ క్షత్రియులా కాదా అన్న విషయాన్ని తిప్పితిప్పి రాసుకుంటూ కూర్చుంటే, వ్యవసాయ రంగంలో, సినీ రంగంలో, వ్యాపార రంగంలో, వైద్యరంగంలో, మరెన్నో రంగాల్లో ఈ కులస్తులు సాధించిన విషయాల మాట ఏం చేద్దాం. మనం ఒక అంశం (అది ఇక్కడ కులం) మీద విజ్ఞాన సర్వస్వ వ్యాసం రాస్తూ ఉన్నాం కదా, దానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా ప్రతిబింబించాలా, వద్దా? కాబట్టి మీరు విషయాన్ని అన్ని వైపుల నుంచీ చూస్తే, తెవికీ వ్యాసాన్ని తటస్థంగా రూపకల్పన చేసేందుకు సాయం చేసేవారు అవుతారు. ఇది వికీపీడియా సంగతి. ఇక వికీపీడియా వ్యాసాల సంగతి వదిలేసి చారిత్రక అవగాహన ప్రకారం చూసుకున్నాపూర్వం కమ్మ కులస్తులు పలు రాజ్యాలు, సామంత రాజ్యాలు పరిపాలించినవారిలోనూ, సైన్యాధ్యక్షులుగా, మండలాధీశులుగా వ్యవహరించినవారిలోనూ ఉన్నారు అన్న ఏకాభిప్రాయం ఉన్న ముక్క రాస్తే వచ్చిన లోటేమిటో నాకు అర్థం కావట్లేదు. అంతేకాక నేను పలుమార్లు మొత్తుకుంటున్న విషయం క్షత్రియ వర్ణస్థులే ఈ దేశాన్ని పరిపాలించారన్న అవగాహన సరికాదు. రాజ్యం కలిగినవాడు రాజయ్యాడు, అంతే కానీ ఫలానా వర్ణస్తులు పరిపాలించాలని అని ఎక్కడో రాసుంది కదాని బంగారు పళ్ళెంలో ఒప్పగించరు, ఒప్పగించలేదు. కాబట్టి క్షత్రియ వర్ణస్తులా కాదా అన్నది అప్రస్తుతం. ఏతావతా నేను చెప్పవచ్చేది ఏమంటే - కమ్మవారు క్షత్రియులా కాదా అన్న చర్చ వికీపీడియాలాంటి మూడోస్థాయి మూలం (ఇది పరిశోధనలు, పరిశీలనలను కేవలం సంకలనం చేసి ఊరుకుంటుంది)లో పనికిరాదు. సింపుల్ గా ఫలానా రాఘవయ్య చౌదరి అనే చరిత్రకారుని పరిశోధనలో కమ్మవారు పూర్వం క్షత్రియ వర్ణస్తులని రాసేసి ఊరుకుని, మిగతా అంశాల మీద పనిచేయాలి. నమస్కారం. --పవన్ సంతోష్ (చర్చ) 10:41, 16 ఫిబ్రవరి 2018 (UTC)
మీ సూచనని తప్పక పాటిస్తాను పవన్ గారు. నేను వికిపీడియాకు కొత్త నాకు నిబంధనలు తెలియవు. నేను వాటిని నేర్చుకొని అనుసరిస్తాను Jiksaw1 (చర్చ) 06:29, 17 ఫిబ్రవరి 2018 (UTC)
- పవన్ సంతోష్ గారు, నేను తెలుగు మరియు ఆంగ్ల వికీలలో 2005 ప్రాంతములో కమ్మ మొదలగు పలు వ్యాసములు కూర్చిన ఆద్యులలో ఒకడిని. 2010నుండి ఉద్యోగ మునకు సంబంధిచిన పని ఒత్తిడి వలన వికీలో చాలా తక్కువగా చేర్పులు చేశాను. 2017 నవంబర్ లో పదవీ విరమణ చేసిన నేను పలు పాత వ్యాసములు పరిష్కరించదలచుకున్నాను. అందు కమ్మ ఒకటి. నాకు మార్పులు చేర్పులు చేయ అవకాశము కల్పించ్చండి.Kumarrao (చర్చ) 14:13, 25 ఫిబ్రవరి 2018 (UTC)
- Kumarrao గారూ! మీరు వ్యాస చర్చ పేజీలో చేసిన విజ్ఞప్తిని, వ్యాసంలో జరుగుతున్న నిర్మాణాత్మకం కాని మార్పుల యుద్ధాన్ని గమనించి అప్పటిదాకా కేవలం ఐపీ అడ్రసుల మీద ఉన్న నిషేధాన్ని నెలరోజుల పరిమిత కాలానికి స్థాయి పెంచుతూ నిర్వాహకులు తప్ప మరెవరూ ఈ కాలావధిలో నేరుగా మార్చలేని విధంగా చేశాను. కానీ నిర్వాహకులు కానివారికి మార్పులు చేసే అవకాశం ప్రత్యేకించి సృష్టించి ఇవ్వడం సాధ్యం కాదని గమనించి, మీ విజ్ఞప్తి మేరకు మళ్ళీ గతంలో ఉన్నట్టుగా ఐపీ అడ్రసులు మార్చడం వరకే నిషేధాన్ని తగ్గించాను. దయచేసి మీరు మీ కృషి కొనసాగించండి. వివాదాల వేడి పదిరోజుల్లో తగ్గివుంటుందని, మళ్ళీ ఆ తరహా ధోరణులు వెంటనే తల ఎత్తవని ఆశిస్తూ, ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 18:24, 27 ఫిబ్రవరి 2018 (UTC)
- పవన్ సంతోష్ గారు, నేను తెలుగు మరియు ఆంగ్ల వికీలలో 2005 ప్రాంతములో కమ్మ మొదలగు పలు వ్యాసములు కూర్చిన ఆద్యులలో ఒకడిని. 2010నుండి ఉద్యోగ మునకు సంబంధిచిన పని ఒత్తిడి వలన వికీలో చాలా తక్కువగా చేర్పులు చేశాను. 2017 నవంబర్ లో పదవీ విరమణ చేసిన నేను పలు పాత వ్యాసములు పరిష్కరించదలచుకున్నాను. అందు కమ్మ ఒకటి. నాకు మార్పులు చేర్పులు చేయ అవకాశము కల్పించ్చండి.Kumarrao (చర్చ) 14:13, 25 ఫిబ్రవరి 2018 (UTC)
ఈ లింక్‌లో ఉన్న విషయాన్ని తర్జుమా చేసి అందించగలరా...
https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Sample_Portal - ఇది మనమూ చేయాలనుకుంటా...--... Viswanadh.BK (నాచర్చాపేజీ) 07:14, 16 ఫిబ్రవరి 2018 (UTC)
- తప్పకుండానండీ, రానున్న సోమవారానికి చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:13, 16 ఫిబ్రవరి 2018 (UTC)
టైగర్ ప్రాజెక్ట్ వ్యాసములు
పవన్ సంతోష్ గారు, టైగర్ ప్రాజెక్ట్ వ్యాసములు జాబితాలో విష్ణువు అనే వ్యాసం ఈ రోజు చూసాను. నేను కొద్దిగా సమాచారం చేర్చాను. ఒకసారి చూసి వ్యాసానికి సంబంధించి అభిప్రాయం చెప్పగలరు. టైగర్ ప్రాజెక్ట్ వ్యాసములు గురించి నేను చేయగల మీ సమాచారంతో సలహా, సూచనలు తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 13:47, 29 మార్చి 2018 (UTC)
- మీరు అభివృద్ధి చేసిన వ్యాసం చూశాను. ఈ పోటీ నియమాల ప్రకారం ఇప్పటికే ఉన్న వ్యాసం అయితే మార్చి 2018 తర్వాత వ్యాసాన్ని అభివృద్ధి చేసేవారు కనీసం 9 వేల బైట్లతో 300 పదాల నాణ్యమైన సమాచారాన్ని చేర్చాలి. ఈ నెలలోనే మీరు ఈ వ్యాసాన్ని 9 వేల బైట్ల పైచిలుకు అభివృద్ధి చేసినట్టు గమనించాను. కాబట్టి ఇక్కడ ప్రతిపాదించవచ్చు. ఐతే ప్రతిపాదిత వ్యాసం ఆమోదం పొందాలంటే పోటీ నియమాల ప్రకారం సమాచారంతో పాటు, నాణ్యత కూడా పరిశీలించాల్సివుంటుంది. ఈ నియమాలన్నీ మీ వ్యాసానికి సంబంధించి కాదు, సామాన్యంగా పోటీకి వర్తించేలా చెప్తున్నాను, మీరు వ్యాసాన్ని ఇచ్చారు కాబట్టి అవసరాన్ని బట్టి వ్యాసంలో ఉదాహరణలు ఇస్తూ వివరిస్తున్నాను. వ్యాసానికి తగిన మూలాలు ఉండడమే కాక, ఏవైనా అవునా! అనిపించే విషయాలు ఉంటే మూలాలు పేర్కొనాల్సివుంటుంది (ఉదాహరణకు మహావిష్ణువు అవయవాలు ఉపవిభాగంలోని సమాచారాన్ని ఏయే మూలాల నుంచి తీసుకుని రాశామో, రిఫరెన్సు పద్ధతిలో అందించడం మేలు), అచ్చుతప్పులు సరిజూసుకోవాలి, వేరెక్కడి నుంచో తెచ్చి రాసిన సమాచారాన్ని అచ్చానికి అచ్చం అలానే ప్రచురించడం చేయకూడదు, కాపీహక్కుల అంశం గుర్తించుకోవాలి, యాంత్రికానువాదం అయివుండకూడదు, మనుషులు ఆద్యంతమూ సరిదిద్దివుండాలి. వీటన్నిటితోపాటు వ్యాసం జాబితాలో ఉండాలి. మీరు అడిగిన నియమాలు ఇవీ, పోటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 17:37, 29 మార్చి 2018 (UTC)
- ముందుగా మీకు ధన్యవాదములు. నేను మీరు సూచించిన వాటికి మూలాలు ఇస్తాను మరియు సమాచారము యథాతథంగా మాత్రం వ్రాయలేదు. నేను వ్రాసిన సమాచారం మాత్రం హిందూ మతమునకు చెందినది, కనుక సమాచారం మాత్రం ఎక్కడైనా ఒకేవిధంగా ఉంటుంది, కనుక కాపీరైట్ అనేది మాత్రం దీనికి వర్తించదు అని అనుకుంటాను. అచ్చుతప్పులు అనేవి నేను వ్రాసిన సమాచారం నకు చెందినవి కాకుండా మరియు మొత్తం వ్యాసం కూడా సరి చూడాలా అనేది చెప్పగలరు. మీరు సూచించిన లింకు నాకు ఓపెన్ కావడం లేదు. నేను ఒక వ్యాసాన్ని అభివృద్ధి చేయాలంటే నా పేరున ఎక్కడైనా ముందుగా వ్రాయవలసిన అవసరం ఏమైనా ఉన్నదా ? వ్రాసిన లేదా వ్రాస్తూ ఉన్న సమాచారం ఏదైనా, ఎప్పుడైనా వికీపీడియా లేదా ఇతర ప్రాజెక్టులందు నిర్దేశించిన నియమ నిబంధనలు అతిక్రమణను చేస్తున్నట్లుగా మీరు లేదా ఇతర వాడుకరులు గమనించినా వెంటనే నా చర్చా పేజీలో సలహాలు, సూచనలు తెలియజేస్తే నా పంథా సరిచేసుకుంటాను. JVRKPRASAD (చర్చ) 01:50, 30 మార్చి 2018 (UTC)
- మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేయడమే నియమం అండీ. ఈ పోటీ లక్ష్యం పాఠకులకు ఆసక్తికరమైన వ్యాసాలు, ఉన్నతమైన నాణ్యతతో అభివృద్ధి చేయడం కాబట్టి ఈ నియమం. మీరు మూడు వ్యాసాలను నివేదించారు కదా. నివేదించేందుకు ఆ లంకెనే వాడండి. జాబితాలో ఉన్న వ్యాసాన్ని మీరు అభివృద్ధి చేస్తున్నారని ఇతరులకు తెలియడానికి ఇప్పటివరకూ మనవాళ్ళు మూస:In use మూస ఉపయోగించారు. ఐతే మార్పులు చేయదలుచుకున్న వాటన్నిటిలోనూ పెట్టకండి, అది అసమమైన పోటీ అవుతుంది. మీరు ప్రస్తుతం మార్పులు చేస్తున్న వ్యాసంలోనే పెట్టండి, అప్పుడు వేరేవారికి దీనిలో మీరు మార్పులు చేస్తున్న సంగతీ అర్థమవుతుంది. ఇక మీరు చేయదలిచిన మార్పుల్లో ఎక్కువ శాతం అంటే 9000 బైట్లు చేర్పు చేయాలి కదా, కనీసం ఓ 7000 బైట్ల మార్పులు చేయకుండా నివేదించకండి, నిజానికి 9 వేల బైట్లూ పూర్తిగా చేసి, శుద్ధి చేశాకా మీకు సంతృప్తికరంగా ఉన్నప్పుడే నివేదించడం వల్ల జడ్జిలకు వెలుసుబాటు దొరుకుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 06:08, 30 మార్చి 2018 (UTC)
- మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేయడమే నియమం కాబట్టి అటువంటి వ్యాసాలను నాలాంటి వారు అంటు మరియు ముట్టు కోక పోవడం ఉత్తమమైనది. అనుమతించ బడని వ్యాసాలలో నాలంటి వారు వ్రాసిననూ ప్రయోజనం ఏముంటుంది ? కనీసం సమాచారం చేర్చినట్లు కూడా ఉండదు కదా. మీరు సూచించిన జాబితాలో హిందూమతము, రైల్వేలు గురించిన వర్గాలలో పాతవి నాణ్యతవి, మీరు ఆమోదించదలచుకున్నవి, అలాగే కొత్తగా వ్రాయవలసినవి ఒక జాబితా నాకు సూచించగలిగితే, నావంతు కృషి చేయగలను, ఎందుకంటే నాకు అంత పెద్దజాబితాలో నాకు వెతుక్కోవటము ప్రస్తుతం కష్టంగా ఉంది. కొత్తవి వెంటనే ఆమోదం కూడా లభించ వచ్చును. నేను ఎటువంటి మూసలు పెట్టను, అలాగే నేను వ్రాయదలచుకున్న వ్యాసాలు ఒకటి లేదా రెండు మాత్రమే సూచించినవి వ్రాస్తాను. నాకు పాత వ్యాసాలు ఏవి ఆమోదం పొందుతాయో నాకు ఎలా తెలుస్తుంది ? మీరు సూచించినట్లు 9 వేల బైట్లూ పూర్తిగా చేసి, శుద్ధి చేశాకా, సంతృప్తికరంగా ఉన్నప్పుడే నివేదించడం అనేది జరగని పని. నా వరకు 7 లేదా 9 వేల బైట్లు వ్యాసంలో పూర్తి చేయడం లేదా కొత్తవి ఏమన్నా సూచిస్తే వ్రాయడం వరకే నావంతు కృషి ఉంటుంది. నేను వ్రాయకపోయినా వికీకి తరిగేది లేదు, కేవలం నేను వ్రాసేది ఇతర వాడుకరులను ప్రొత్సహించడమే నా ఆలోచనాభిప్రాయం. మీకు ధన్యవాదములు. 08:49, 30 మార్చి 2018 (UTC)
- ఇతర వాడుకరులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేస్తున్న మీ కృషికి అభినందనలు ప్రసాద్ గారూ. మీరు సూచించినట్లు 9 వేల బైట్లూ పూర్తిగా చేసి, శుద్ధి చేశాకా, సంతృప్తికరంగా ఉన్నప్పుడే నివేదించడం అనేది జరగని పని. అన్నారు. ఈ అంశంపై దయచేసి ప్రాజెక్టు చర్చ పేజీలో రాయండి. ఎందుకంటే ఈ నిర్ణయం నా వ్యక్తిగతమైనది కాదు. "వ్యాసంతో ఏ ప్రధానమైన సమస్యలూ ఉండకూడదు (కాపీహక్కుల సమస్యలు, విషయప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు, వంటివి)" అన్న పోటీ నియమం, మొత్తం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన "అత్యున్నత నాణ్యత కలిగిన సమాచారాన్ని భారతీయ భాషల్లో సృష్టించడం" ముడివేసి పోటీ తెలుగు జ్యూరీ సభ్యులమైన నేనూ, వాడుకరి:Chaduvari ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. అలానే నాకు పాత వ్యాసాలు ఏవి ఆమోదం పొందుతాయో నాకు ఎలా తెలుస్తుంది ? అన్నారు. నేను ఆమోదించదలుచుకున్నవంటూ ఏమీ లేవండీ, కేవలం పోటీ నియమాలు, వికీపీడియా విధానాల ప్రకారం ముందుకుపోవడమే జ్యూరర్‌గా మేం చేస్తున్నది. నియమాల ప్రకారం ఈ అంశాల జాబితాలో ఉన్నవీ, ఇక్కడ ఇప్పటికే నివేదించనివీ ఏవైనా మీ ఆసక్తి ప్రకారం స్వీకరించండి. ఇకపై ఈ చర్చ వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ వద్ద చేద్దామండీ, ఎలానూ ఈ అంశాలు ఇతరులకు కూడా ఉపయోగిస్తాయి కాబట్టి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:49, 30 మార్చి 2018 (UTC)
- మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేయడమే నియమం కాబట్టి అటువంటి వ్యాసాలను నాలాంటి వారు అంటు మరియు ముట్టు కోక పోవడం ఉత్తమమైనది. అనుమతించ బడని వ్యాసాలలో నాలంటి వారు వ్రాసిననూ ప్రయోజనం ఏముంటుంది ? కనీసం సమాచారం చేర్చినట్లు కూడా ఉండదు కదా. మీరు సూచించిన జాబితాలో హిందూమతము, రైల్వేలు గురించిన వర్గాలలో పాతవి నాణ్యతవి, మీరు ఆమోదించదలచుకున్నవి, అలాగే కొత్తగా వ్రాయవలసినవి ఒక జాబితా నాకు సూచించగలిగితే, నావంతు కృషి చేయగలను, ఎందుకంటే నాకు అంత పెద్దజాబితాలో నాకు వెతుక్కోవటము ప్రస్తుతం కష్టంగా ఉంది. కొత్తవి వెంటనే ఆమోదం కూడా లభించ వచ్చును. నేను ఎటువంటి మూసలు పెట్టను, అలాగే నేను వ్రాయదలచుకున్న వ్యాసాలు ఒకటి లేదా రెండు మాత్రమే సూచించినవి వ్రాస్తాను. నాకు పాత వ్యాసాలు ఏవి ఆమోదం పొందుతాయో నాకు ఎలా తెలుస్తుంది ? మీరు సూచించినట్లు 9 వేల బైట్లూ పూర్తిగా చేసి, శుద్ధి చేశాకా, సంతృప్తికరంగా ఉన్నప్పుడే నివేదించడం అనేది జరగని పని. నా వరకు 7 లేదా 9 వేల బైట్లు వ్యాసంలో పూర్తి చేయడం లేదా కొత్తవి ఏమన్నా సూచిస్తే వ్రాయడం వరకే నావంతు కృషి ఉంటుంది. నేను వ్రాయకపోయినా వికీకి తరిగేది లేదు, కేవలం నేను వ్రాసేది ఇతర వాడుకరులను ప్రొత్సహించడమే నా ఆలోచనాభిప్రాయం. మీకు ధన్యవాదములు. 08:49, 30 మార్చి 2018 (UTC)
రాజాపేట సంస్థానం:
రాజాపేట సంస్థానం: ఆలేరుకు 20 కి.మీ.ల దూరంలో వున్న మండలకేంద్రం రాజపేట. యాదాద్రి-భువనగరి, సిద్ధిపేట,మెదక్ జిల్లాల సరిహద్దులో వుంది రాజపేట. రాజపేట గ్రామం కోటలోపలనే వుంది.52 ఎకరాలలో మొత్తం కోట,ఊరు విస్తరించివున్నాయి. ఇట్లాంటి గడికోట తెలంగాణాలో మరెక్కడా కనిపించదు. కొత్తగా గ్రామం కోట బయటకూడా విస్తరించింది. మొత్తం 2000లకు పైగా ఇండ్లున్నాయి. ఈ కోట 12మీ.ల ఎత్తు, 3మీ.ల వెడల్పులు కలిగివుంది. కోట చుట్టూ లోతైన కందకం తవ్వి వుంది.కోట బయటవున్న గోపాలచెరువు నీళ్ళు ఈకందకంలోనికి పారేటట్లు కాలువతీసి వుంది.కోట ద్వారాలకు రెండువైపుల బురుజులు కట్టబడివున్నాయి. కోటలోపల పడమటివైపు రాజభవనం నిర్మించబడివుంది. దీన్ని అద్దాలమేడ అని పిలుస్తారు. అంతఃపురం అవసరాలకు తవ్వించిన పెద్దబావి వుంది. దాన్ని ‘ఏనుగుల భావి’ అని పిలుస్తారు. భవనంలోపల ఒకవైపు శివాలయం వుంది. రాజభవనానికివున్న 5బురుజులు కూలి, శిథిలమైపోతున్నాయి. రాజభవనం ముందరున్న ఫౌంటెన్ శిథిలజ్ఞాపకంగా మిగిలిపోయివుంది. రాయన్న అనేరాజు కోట నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి ఆలేరు వాగుకు తూర్పున వున్న గుండ్లగూడెంలో కొంతమేరకు కోటనిర్మాణం చేసాడు. కోటనడుమ శివాలయాన్ని కట్టించాడు. కాని, ఎందుకో అక్కణ్ణించి రాజపేట ప్రాంతానికి వచ్చి విజ్ఞుల సలహాతో ఇక్కడే కోట నిర్మాణం చేసాడంటారు.
ఈ కోటను వెదిరె వంశం వారు నిర్మించారు. నిజాం పాలనాకాలంలో(క్రీ.శ. 1724-1948) నిజాంరాజులు తమకిష్టమైన ప్రభుభక్తిపరులకు జాగీర్లు, సంస్థానాలు, పాయెగాలు ఇచ్చేవారు.నిజాం రాష్ట్రంలో 14 సంస్థానాలుండేవి. వాటిలో రాజపేట ఒకటి. మంచి ఆదాయంవున్న సంస్థానాలకు స్వయంపాలనాధికారాలుండేవి. అటువంటి హక్కులులేని సంస్థానం రాజపేట. ఈ సంస్థానం పరిధిలో 9గ్రామాలుః రాజపేట, కుర్రారం, నమిలె, మాసాయిపేట, కోరుకొండ, పెద్దపాడు, సాధువెల్లి, చల్లూరు, వెంకిర్యాల వుండేవి. సంస్థానాధీశులు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. నిజాం రాజుకు పంపే నజరానాకు కావలసినవన్నింటిని వెట్టివాండ్లైన హరిజనులు మోసుకుంటు కాలినడకన పోయి హైదరాబాదులో ఇచ్చి వచ్చేవారట. అట్లాంటి సేవలు చేసే వారికి నిజాం ‘బలోతా ఇనాం’(పన్ను కట్టనవసరంలేనిది) యిచ్చేవాడట.
క్రీ.శ.1775లో ‘రాజా రాయన్న’ రాజాపేట గ్రామాన్ని దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. రాజపేట పూర్వనామం రాయన్నపేట. రాయన్నతర్వాత అతని కుమారుడు రాజా వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు రాజ్యాధికారం చేపట్టాడు.కావడానికి వీరు రెడ్డిదొరలే అయినా వీళ్ళకు నిజాం యిచ్చిన బిరుదు ‘రావు బహద్దూరు’వల్ల తమ పేరు తర్వాత రావు అని పెట్టుకునేవారు. ఈ నారాయణరావే తనపేరుతో నారాయణపురం సంస్థానాన్ని నిర్మించాడని తెలుస్తున్నది. తనకు సంతానంలేని కారణం చేత రాజపేట తనసోదరుని కుమారుడైన రామేశ్వర చందర్ ని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణరావుకు కొడుకు పుట్టాడు. అతని రాజా రాయన్న.నారాయణరావు చనిపోగానే అధికారం, ఆస్తుల కోసం తగాదాలు కలిగాయి. నిజాంరాజు రాజారాయన్న చిన్నవాడైన కారణంగా గోపమ్మఅనే స్త్రీకి పాలనాధికారం యిచ్చాడు. రామేశ్వరచందర్ కు అధికారం రాదని తెలిసిన వెంటనే విలువైన ఆస్తుల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. నారాయణపురానికే అయివుంటుంది. అప్పట్నుంచి సంబంధాలు మారిపోయాయి. నిజాం రాజు రాజా రాయన్నను చదివించడానికి హైదరాబాదుకు తీసుకుని వెళ్ళాడు. మీర్ లాయక్ అలీ, సర్ సాలార్ జంగ్ లతో కలిసి చదువుకున్న రాజారాయన్న ఇస్లాం మతం తీసుకున్నాడు. ఎందరినో పెండ్లి చేసుకున్నాడు. వారిలో చింతపల్లి జమీందార్ బిడ్డ సీతమ్మ, రాజమ్మ, గార్లపల్లి నర్సయ్య కుమార్తె రంగమ్మ, షేక్ మహమ్మద్ కూతురు రసూల్ బీ, జైనబ్ బేగం. హుసేనిబేగంలున్నారు. సంస్థానాధీశుడైన రాజా వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు సంస్థానంలోని వేంకటేశ్వర మఠానికి పూజాదికాల నిర్వహణకు మఠాధిపతి షాకరుదాసు బైరాయికి సన్ 1192(క్రీ.శ.1782) శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు వ్రాయించి ఇచ్చాడు.గంగరాజు రాముడు కులకర్ణి రాయన్నపేట(రాజాపేట) దానపత్రము రాసాడు. సంస్థానం రాజాపేట రాజా వెంకటనారాయణరావు బహద్దూరు ఇచ్చిన భూదాన పత్రికః భూదాన శాసనపాఠం: శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు షాకరుదాసు బైరాగికి రాజా వెదిరె వెంకటనారాయణారావు బహద్దురు సరుదేశముఖు సర్ దేశపాండ్య వసర నాడెగవుడు స.బోనగీరు వషహనగరు వరాజు కొండ యింద్రి వెల వగైరా గ్రామ వ్రాయించి యిచ్చిన భూదానపత్రిక శ్రీ.... స్వామికి నిత్యనైవేద్య దీపారాధన నడ్పవలసినాందుకు భుదానం కావలెనని మందలిస్తిరి కన్క మనస్కరించి రాయంన్నపేటలోను వుత్తరంపు వెర్గుచద్ది శివ్వారెడి చేశ్ని కవులు జాగా నీంమ్మంధం గుండ్లబావి కింద యిస్తువా చెల్క కుండెడు (జొ)న్నలు పెట్టుబడిది నిష్కష్ర చేసి శలవు యిచ్చినాం. యింద్కు హద్దులు తూర్పుకు ఉండె మర్రిచెల్క పడుమర్కు మఠ ఉత్తరానకు చెరు(?) దక్షణం చదుమస్తులు యీలోన నినర్ణం చేసి వ్రాయించి శ్రీ స్వామికి ప్రీతిగాను మీరూంన్ను మీశిష్యలూంన్ను ప్రతి సంవత్సరం జాగా ఫలపరచుకుని తత్ఫలం నిత్యనైవేద్యదీపారాధన గడుపుకుంటు మాకు ఆశీర్వచనం చేస్తూ సుఖాన వుండుకునేది. యిది హర్షోక్తిన వ్రాయించి యిచ్ని భూదానపత్రిక. చం.7 రజ్జబు స్వదత్తాం ద్విగుణం పుణ్యం పరదత్తాను పరతద్తు పహరణ స్వదత్తా సత్ఫలం భవేతు గంగరాజ రాముడు కులకర్ణి, రాయన్నపేట – వేంకటేశ్వర మఠం
ఆధారగ్రంథాలుః 1. తెలంగాణ గడీలు- కెవి నరేందర్, సంగెవేని రవీంద్ర 2. విరువంటి గోపాలకృష్ణ సేకరించిన శాసనపత్రం.