సంగీత వాయిద్యం
స్వరూపం
(వాయిద్యాలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సంగీత వాయిద్యం, (Musical Instrument) భారతీయ సంగీతంలో గాయకునికి సహాయకారిగా ఉపయోగించే పరికరం.
సంగీత వాయిద్యాల వివిధ రకాలు
[మార్చు]వాయిద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు
- తంత్రీ వాయిద్యాలు : తంత్రులు లేదా తీగ (String) లతో వాయించేవి (ఉదా: వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి, కడ్డీవాయిద్యం మొదలైనవి)
- సుషిర వాయిద్యాలు : గాలితో (Wind) పనిచేసే వాయిద్యాలు లేదా గాలిని ఊది వాయించేవి (ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి)
- అవనద్ధ వాయిద్యాలు : చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెల, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాయిద్యం మొదలైనవి)
- ఘన వాయిద్యాలు : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి తాళం ననుసరించు వాయిద్యాలు (ఉదా: తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చురుతలు, మోర్సింగ్, మంజిర మొదలైనవి)
చిత్రమాలిక
[మార్చు]-
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో కొమ్ము వాయిద్య కళాకారుడు
-
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డోలు కళాకారులు
-
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వివిధ వాయిద్యాలతో కొమ్ముకోయ కళాకారులు
-
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వివిధ వాయిద్యాలతో కొమ్ముకోయ కళాకారులు
-
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ట్రంపెట్ (బాకా) కళాకారులు
-
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చిరుతల భజన ప్రదర్శన
-
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో డప్పు కళాకారుల ప్రదర్శన
-
2019 జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో కడ్డీతంత్రి కళాకారుల ప్రదర్శన
-
2019 జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో 12 మెట్ల కిన్నెర కళాకారుల ప్రదర్శన