వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమావేశం 16[మార్చు]

తేది
నవంబరు 29, 2015, ఆదివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం
 • సీఐఎస్-ఏ2కే వారి కొత్త ప్రోగ్రాం అసోసియేట్ కార్యప్రణాళికకు సంబంధించి నిర్వహించే విధులు, తదితర అంశాలపై సముదాయం సలహాలు, సూచనలు, వాటిపై చర్చ .

<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>

ముందస్తు నమోదు[మార్చు]

తప్పక పాల్గొనదలిచిన వారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చపేజీలో రాయండి, ముందస్తుగా నమోదు చేసుకోకున్నా చేరవచ్చు)
 1. --అర్జున (చర్చ) 04:49, 24 నవంబర్ 2015 (UTC) , చర్చాపేజీలో నా స్పందన తెలియచేశాను.--అర్జున (చర్చ) 13:01, 29 నవంబర్ 2015 (UTC)
 2. --Rajasekhar1961 (చర్చ) 05:16, 24 నవంబర్ 2015 (UTC)
 3. --Viswanadh (చర్చ) 05:45, 24 నవంబర్ 2015 (UTC)
 4. --పవన్ సంతోష్ (చర్చ) 09:01, 24 నవంబర్ 2015 (UTC)
 5. --Pranayraj1985 (చర్చ) 09:09, 24 నవంబర్ 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనేందుకు ప్రయత్నించేవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చపేజీలో రాయండి, ముందస్తుగా నమోదు చేసుకోకున్నా చేరవచ్చు)
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి, ఇక్కడ సంతకం చేసినా వీలుంటే అప్పటికప్పుడు చేరవచ్చు)

పాల్గొన్నవారు[మార్చు]

ట్విట్టర్ తరహా నివేదిక[మార్చు]

 • విశ్వనాథ్, అర్జునరావు, పవన్ సంతోష్, రహ్మానుద్దీన్, సుజాత, ప్రణయ్ ఆ వరుస క్రమంలో చాట్లోకి ప్రవేశించి చర్చించారు. జెవిఆర్కే ప్రసాద్ పరిశీలనకు పరిమితమయ్యారు.
 • విశ్వనాథ్ ప్రోగ్రాం అసోసియేట్ ఉద్యోగానికి పవన్ ఎంపికైనట్టు ప్రకటించారా అని ప్రశ్నించగా రహ్మానుద్దీన్ చేసిన ప్రకటన లంకె పవన్ సంతోష్ ఇచ్చారు.
 • అర్జునరావు, విశ్వనాథ్, సుజాత, తదితరులు పవన్ ను ఈ సందర్భంగా అభినందించారు.
 • ఐఆర్సీ కన్నా స్కైప్ అయివుంటే బావుండేదని, మాట్లాడుతూ అవసరమైన విషయాలు నమోదుచేసుకోవచ్చని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు.
 • సమావేశం చర్చ పేజీలో మూడు అంశాలు రాసి అర్జునరావు వాటిపై చర్చించమని కోరారు.
 • సర్వే గురించి ఆయన అడిగిన ప్రశ్నకు రహ్మానుద్దీన్ రీడర్స్ సర్వేకి ముసాయిదా రూపొందించివున్నా నిర్వహించే బాధ్యత పి.ఎ.కు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిపారు, ఈ సర్వే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉండే అవకాశం ఉందన్నారు.
 • వికీసోర్స్ పాఠ్యీకరణకు తెలుగు గూగుల్ ఓసీఆర్ వాడుకని సులభతరం చేయడానికి సీఐఎస్ ఏమైనా కృషిచేస్తోందా అని అర్జున అడిగిన ప్రశ్నకు పవన్ చేస్తుందని సమాధానమిచ్చారు.
 • వికీసోర్స్ లో చేర్చిన పుస్తకాలలో దోషాల తొలగింపు గురించి వివరించమని అర్జున అడిగారు. దీనికి సంబంధించిన చర్చ:
  • నశీర్ అహ్మద్ పుస్తకాల విషయంలో సాంకేతికంగా దోషాలు ఉన్న పేజీలు సరిజేయడమో, తొలగించడమో చేయాలని అర్జున పేర్కొన్నారు. నశీర్ అహ్మద్ పుస్తకాల మెరుగైన ప్రతి తెస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు.
  • ఇక్కడ మెరుగుపరిచిన యూనీకోడ్ కన్వర్టర్ ఉందని, అలానే నశీర్ అహ్మద్ గారిచ్చిన పుస్తకాలను బ్రిస్ తో కోసి అప్లోడ్ చేస్తే సమస్య తీరిపోతుందని రహ్మాన్ సమాధానమిచ్చారు.
  • అలా సరిజేసిన పేజీలకు రహ్మాన్ లంకె ఇవ్వగా, పరిశీలించి అర్జున అలా చేసిన పేజీలు బావున్నాయన్నారు.
 • మండలి బుద్ధప్రసాద్ గారి పుస్తకాల మెయిల్ ఒకటి ఓటీఆరెస్ టీం వద్ద పెండింగ్ లో ఉందని, తనను కూడా సిసి చేశారని రహ్మాన్ పేర్కొంటూ రహ్మాన్ ఈ అంశమై అర్జునరావుకి విన్నపం చేశారు.
  • అయితే ఓటీఆరెస్ టీంలో క్రియాశీలకంగా లేనందుకు తనను తొలగించారని అర్జున బదులిచ్చారు.
  • బుద్ధప్రసాద్ పుస్తకాల స్థితిపై ఓటీఆరెస్ టీంకి మెయిల్ రాయమని సూచించారు.
 • అమ్మనుడి లేదా నడుస్తున్న చరిత్రపై సరియైన ఓటీఆరెస్ సమాధానం వచ్చేవరకూ నిలుపుదల చేయాల్సివస్తోందని రహ్మాన్ తెలిపారు.
 • అన్నమాచార్య ప్రాజెక్టు యాంత్రికంగా, దోషరహితంగా వికీసోర్సులో చేర్చేందుకు అవకాశం లేదా అంటూ అర్జున ప్రశ్నించారు.
  • చేర్చవచ్చును కానీ సముదాయం చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సివుంటుందని రహ్మాన్ సమాధానమిచ్చారు.
 • ప్రణయ్, రహ్మాన్ తెలంగాణా ప్రభుత్వం నుంచి కొణతం దిలీప్ వికీపీడియాపై కృషి గురించి ముందుకువచ్చిన సంగతి వివరించారు.
  • ఈ అంశంలో ప్రణయ్ కు తాను సహకరిస్తానని పవన్ సంతోష్ తెలిపారు.
  • తెలంగాణా ప్రభుత్వం రూపొందించిన కాల్పనికేతర సాహిత్యం స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయిద్దామా అంటూ రహ్మాన్ ప్రతిపాదించారు. వారు అందుకు సిద్ధంగా ఉంటే సరేనని పవన్ అన్నారు.
 • తెవికీ పుట్టిన రోజు (డిసెంబర్ 9), తెవికీ పుష్కర వార్షికోత్సవాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి అని ప్రణయ్ అన్నారు.
  • తెవికీ ప్రగతిపై ప్రెస్ నోట్ పత్రికలకు పంపడం, వ్యాసాలు రాయడం, తెవికీ ప్రగతి గురించి వీడియో తయారుచేయడం వంటి ప్రతిపాదనలు పవన్, రహ్మాన్ ముందుకుతెచ్చారు.
  • ఏదైనా కార్యక్రమం చేద్దామని ప్రణయ్ ప్రతిపాదించారు.
 • గతంలో కన్నడ వీడియో పాఠాలు రూపొందించినవి ఏమేరకు ఆదరణ పొందాయి? అక్కడనుంచి నేర్చిన విషయాలు తెలుగు వీడియోల తయారీలో వాడుకుందామని అర్జున ప్రతిపాదించారు.
  • ప్రస్తుతం తెలుగు వీడియో పాఠాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని, అనువాదం సాగుతోందని పవన్ వివరించారు.

సంభాషణల చిట్టా[మార్చు]

 • సంభాషణల చిట్టా కోసం ఇక్కడ చూడండి.