వికీపీడియా చర్చ:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష
సంఘ సభ్యుల ఎంపిక
[మార్చు]సమీక్షా సంఘంలో పని చేసే సభ్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టాలి. అందుకు గాను సభ్యులు తమకు తోచిన సభ్యుల పేర్లను ఇక్కడ చేర్చవచ్చు. ఏ వికీపీడియాల్లోనైనా 5,000 పైచిలుకు దిద్దుబాట్లు చేసి ఉండాలి. తెలుగులో గత మూడేళ్లలో 50 కి మించి దిద్దుబాట్లు చేసి ఉండకూడదు అనేవి నిబంధనలు. వాడుకరుల పరిశీలన కోసం ఒక పట్టికను కింద ఇస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు. కేవలం ఇంగ్లీషు వికీపీడియాలో చేసిన దిద్దుబాట్లనే తీసుకుని చేసిన పట్టిక ఇది. ఇతర భారతీయ భాషా వికీపీడియాల్లో ఉన్న తెలుగు వారిని ఇంకా పరిశీలించలేదు. __చదువరి (చర్చ • రచనలు) 08:39, 30 సెప్టెంబరు 2020 (UTC)
వాడుకరిపేరు | ఎన్వికీ దిద్దుబాట్లు | తెవికీ దిద్దుబాట్లు | ఎన్వికీ + తెవికీ
(కనీసం 5000 ఉండాలి) |
తెలుగు నైపుణ్యం | గత 36 నెలల్లో
తెవికీలో చేసిన దిద్దుబాట్లు (50 కంటే తక్కువ ఉండాలి) |
ప్రస్తుత స్థితి |
---|---|---|---|---|---|---|
Strike Eagle | 16022 | 142 | 16164 | మాతృభాష | 1 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Masti 84 | 12500 | 3 | 12503 | మాతృభాష | 0 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Gurubrahma | 11625 | 356 | 11981 | మాతృభాష | 7 | ఎన్వికీ, తెవికీ రెండు చోట్లా చురుగ్గా లేరు |
Ab207 | 9192 | 7 | 9199 | మాతృభాష | 7 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Sagavaj | 8781 | 0 | 8781 | మాతృభాష | 0 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Bsskchaitanya | 6742 | 63 | 6805 | మాతృభాష | 54 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Adityamadhav83 | 5966 | 1711 | 7677 | మాతృభాష | 254 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
Mspraveen | 9813 | 7 | 9820 | మూడవ స్థాయి (User te-3) | 0 | ఎన్వికీ, తెవికీ రెండు చోట్లా చురుగ్గా లేరు |
Omer123hussain | 7359 | 0 | 7359 | రెండవ స్థాయి (User te-2) | 0 | ఎన్వికీలో చురుగ్గ్గా ఉన్నారు |
- నా అభిప్రాయంలో Strike Eagle, Gurubrahma, Sagavaj, Ab207 గార్లను మనం ఆహ్వానించవచ్చు. వీరు ముగ్గురికీ మంచి వ్యాస రచనా అనుభవమూ, చర్చా అనుభవమూ కూడా ఉన్నాయి. గురుబ్రహ్మ గారు ఇటీవలనే కొంత యాక్టివ్ అయ్యారు.
- ఇక, Masti 84 గారు ఎంతో పనిచేసివున్నా ఆ పని దాదాపుగా మొదటి పేరుబరికే పరిమితం. Mspraveen గారు వికీపీడియాలో ఏదైనా రాసి కూడా దశాబ్దం దాటుతోంది. Bsskchaitanya గారూ మొదటి పేజీ తప్ప రాసింది తక్కువే, పైగా పాలసీ వయొలేషన్లు ఉన్నట్టు ఆయన చర్చ పేజీ చెప్తోంది. వీరు ముగ్గురిని పరిగణించనక్కరలేదని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 10:23, 11 అక్టోబరు 2020 (UTC)
- మంచి రచనా అనుభవం, చర్చా అనుభవం ఉన్న Strike Eagle, Gurubrahma, Sagavaj, Ab207 గార్లను ఆహ్వానించవచ్చు. – K.Venkataramana – ☎ 15:08, 11 అక్టోబరు 2020 (UTC)
ఇంగ్లీష్ వికీ తోపాటుగా , ఇతర భారతీయ భాషల వికీలో చురుకుగా పనిచేసిన వారు ప్రస్తుతం , లేదా పూర్వము నిర్వాహక హోదాలో పనిచేసిన వారు ఒకరైనా సమీక్షా సంఘంలో ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం , ఇక్కడ భారతీయ భాషలో ఉన్న నిర్వాహకుల జాబితా చేర్చాను, వీటిలో తెలుగు తెలిసిన వాళ్లు ఎవరో చూడాలి : Kasyap (చర్చ) 17:08, 11 అక్టోబరు 2020 (UTC)
- Kasyap గారూ, మీరు ఇచ్చిన లింకు లోని పేర్ల లోంచి మన అవసరాలకు సరిపోయే అర్హతలున్న వారి పేర్లను తీసి సముదాయం పరిశీలన కోసం ఇక్కడ పెట్టండి. మొత్తం అన్ని పేర్లను అందరూ పరిశీలించాలంటే కుదరదు కదా. మరొక సంగతి.., మనం కేవలం నిర్వాహకుల పేర్లనే పరిశీలించడం లేదు. నిర్వాహకులు కానివారు కూడా మన సమీక్షా సంఘంలో ఉండవచ్చు. ఇంకో సంగతి.., మీ జాబితాను ఇతరులు చూసేందుకు అనుమతుల్లేవు, పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:29, 12 అక్టోబరు 2020 (UTC)
- సమీక్ష సంఘం ఏర్పాటు చేయడం చాలా సంతోషం, బాగుంది. సభ్యుల ఎన్నిక కూడా పూర్తి చేయగలరు, తొందరగా ఓ పని అయిపోతుంది. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 08:20, 12 అక్టోబరు 2020 (UTC)
సభ్యులుగా చేరమని అభ్యర్ధన
[మార్చు]నమస్కారం. నేను తెలుగు వికీపీడియా తరపున రాస్తున్నాను.
తెవికీలో నిర్వాహకులు వాడుకరులపై విధించిన నిరోధాలను సమీక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమీక్షా సంఘంలో తెలుగు బాగా తెలిసిన, వికీపీడియా విధివిధానాల పట్ల అవగాహన ఉన్న, తెలుగు వికీపీడియాలో చురుగ్గా లేని వాడుకరులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. సమీక్షా సంఘం గురించిన సమాచారం కోసం వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష పేజీని చూడగలరు. ఈ సంఘంలో సభ్యులుగా ఉండేందుకు మిమ్మల్ని కోరాలని సముదాయం నిర్ణయించింది. ఈ విషయమై మీ నిర్ణయాన్ని వారం రోజులలో ఇక్కడ తెలుపవలసినదిగా అభ్యర్ధిస్తున్నాం.
ఈ అభ్యర్ధనను కింది ముగ్గురికి వారి చర్చా పేజీలో పెట్టాను. __చదువరి (చర్చ • రచనలు) 10:45, 3 నవంబర్ 2020 (UTC)
ఈ ముగ్గురికీ వారి వికీ పేజీ నుండి ఈమెయిలు కూడా పంపించాను. __చదువరి (చర్చ • రచనలు) 10:55, 3 నవంబర్ 2020 (UTC)
Gurubrahma గారు నవంబరు 17 వరకు స్పందించలేదు. అభ్యర్ధించిన నాటి నుండి వికీలో ఏమీ రాయలేదు కూడా. అందుచేత, వారు ఇందుకు సుముఖంగా లేరని భావించి వారి స్థానంలో మరొకరిని అభ్యర్ధించడమైనది. Sagavaj గారు కూడా నవంబరు 17 వరకు స్పందించలేదు. ఎన్వికీలో చురుగ్గానే రాస్తున్నందున, అభ్యర్ధన గురించి నవంబరు 17 న గుర్తు చేసాను. గురుబ్రహ్మ గారికి చేసిన అభ్యర్ధన స్థానంలో Ab207 గారికి నవంబరు 17 న వారి ఎన్వికీ వాడుకరి చర్చ పేజీ ద్వారా అభ్యర్ధన పంపాను. __చదువరి (చర్చ • రచనలు) 01:58, 17 నవంబరు 2020 (UTC)
- Sagavaj గారు సంఘంలో చేరలేనని తెలియజేసారు. అంచేత మరొకరికిని ఆహ్వానించాల్సి ఉంది. సభ్యులు ఇంకెవరినైనా సూచించాల్సినదిగా వినతి. కశ్యప్ గారూ ఇందుకు అర్హత గలవారు ఎవరైనా మీకు కనిపించారా?__చదువరి (చర్చ • రచనలు) 01:22, 21 నవంబరు 2020 (UTC)
ఇద్దరిని అడిగాను సానుకూల స్పందన రాలేదు 05:46, 26 నవంబరు 2020 (UTC)
వారి స్పందన
[మార్చు]- Strike Eagle: నా పేరు ప్రస్తావించినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. ఈ సమీక్షా సంఘం లో పాల్గొనడానికి నేను సుముఖంగా ఉన్నాను. ధన్యవాదాలు, Strike Eagle (చర్చ) 01:37, 7 నవంబర్ 2020 (UTC)
- @Strike Eagle, ఈ బాధ్యతను స్వీకరించినందుకు ధన్యవాదాలండి. చదువరి (చర్చ • రచనలు) 01:49, 7 నవంబర్ 2020 (UTC)
- Gurubrahma - నేను ఇంత కాలమూ వికీపీడియాలో చురుగ్గా లేను. రానున్న ఒక సంవత్సరంలో కూడా ఉండబోను. నా పేరు ప్రస్తావించినందుకు చదువరి గారికి ధన్యవాదములు. క్షంతవ్యుడను. --Gurubrahma (చర్చ) 05:59, 1 జూన్ 2021 (UTC)
- Sagavaj -
- Ab207 - నాకు ఈ అవకాశం అందించినందుకు చదువరి గారికి, సముదాయానికి ధన్యవాదాలు. ఈ సమీక్షా సంఘంలో పాల్గొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. -- Ab207 (చర్చ) 17:27, 20 నవంబరు 2020 (UTC)
- @Ab207, మీరీ బాధ్యతను స్వీకరించినందుకు ధన్యవాదాలు. చదువరి (చర్చ • రచనలు) 01:05, 21 నవంబరు 2020 (UTC)
- @Strike Eagle, @Ab207, మీరీ ఈ బాధ్యతను స్వీకరించటానికి ముందుకువచ్చి, బాధ్యతను స్వీకరించినందుకు తెలుగువికీపీడియా తరుపున ధన్యవాదాలండి. యర్రా రామారావు (చర్చ) 03:38, 21 నవంబరు 2020 (UTC)
- @Ab207, మీరీ బాధ్యతను స్వీకరించినందుకు ధన్యవాదాలు. చదువరి (చర్చ • రచనలు) 01:05, 21 నవంబరు 2020 (UTC)
- @Strike Eagle, @Ab207, మీరీ ఈ బాధ్యతను స్వీకరించటానికి ముందుకువచ్చి, బాధ్యతను స్వీకరించినందుకు తెలుగువికీపీడియా తరుపున ధన్యవాదాలండి.సత్వరం స్పందించడానికి మీ ఇ మెయిలుకు లింకు ఇవ్వండి. వెయ్యిల మందిలో మీరిద్దరు ఎన్నికవడం సంతోషం మరోసారి శుభాకాంక్షలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:32, 21 నవంబరు 2020 (UTC)
- @Strike Eagle గారు, @Ab207 గారు, వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష సంఘంలో పాల్గొని, సమీక్ష బాధ్యతను స్వీకరించినందుకు ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:27, 21 నవంబరు 2020 (UTC)
- @Strike Eagle, @Ab207, మీరీ ఈ బాధ్యతను స్వీకరించటానికి ముందుకువచ్చి, బాధ్యతను స్వీకరించినందుకు తెలుగువికీపీడియా తరుపున ధన్యవాదాలండి.సత్వరం స్పందించడానికి మీ ఇ మెయిలుకు లింకు ఇవ్వండి. వెయ్యిల మందిలో మీరిద్దరు ఎన్నికవడం సంతోషం మరోసారి శుభాకాంక్షలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:32, 21 నవంబరు 2020 (UTC)
సంఘ సభ్యులకు
[మార్చు]Strike Eagle గారూ, Ab207 గారూ, సంఘం ఏర్పడినట్లే. ఇప్పటికి సంఘంలో ఉన్న సభ్యులు:
వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష పేజీలో నిర్దేశించుకున్న ప్రకారం సమీక్షా సంఘంలో ముగ్గురు సభ్యులుండాలి. ప్రస్తుతం ఇద్దరున్నారు, మూడవ సభ్యుని కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయి. అయితే, సంఘ పరిశీలన కోసం ఏదైనా కేసు వచ్చినపుడు సభ్యుల్లో ఎవరైనా, ఎందరైనా కేసును విచారించవచ్చు. కాబట్టి మూడవ సభ్యుడు (సభ్యురాలు) చేరేలోపు మీ దృష్టికి కేసులేమైనా వస్తే మీరు స్వీకరించవచ్చు, విచారించవచ్చు.
సంఘ విధివిధానాలు, పద్ధతులకు సంబంధించి ఈ ప్రాజెక్టు పేజీతో పాటు కింది రెండు పేజీలను కూడా పరిశీలించగలరు:
- వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/సమీక్షా పద్ధతి
- వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/నమూనా కేసు
కొన్ని సూచనలు, అభ్యర్ధనలు
[మార్చు]- ఈ సంఘ ప్రతిపాదనను తెచ్చినపుడు గతంలో ఇలాంటివి మరెక్కడైనా ఉన్నాయేమోనని పరిశీలించాం గానీ ఎక్కడా కనిపించలేదు -ఎన్వికీలో ఉన్న ఆర్బిట్రేషను సంఘం తప్ప. అంచేత, దీని విధివిధానాల్లో మార్పుచేర్పులు చెయ్యాల్సిన అవసరం ఉండే అవకాశం లేకపోలేదు. సంఘ నిర్మాణంలో గానీ, విధివిధానాల్లో గానీ ఏమైనా మార్పుచేర్పులు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తే (ఇప్పుడైనా తరువాతైనా).. ఈ చర్చా పేజీలో రాయండి. రాసి, ఆ విషయాన్ని రచ్చబండలో చెప్పాల్సినదిగా విజ్ఞప్తి. అలా చేస్తే వాడుకరులు దాన్ని మిస్సయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
- కేసును మీకు నివేదించడం దగ్గర్నుండి మీరు విచారణ పూర్తి చేసి రికమెండేషను ప్రకటించేంత వరకూ.. "సమీక్షా పద్ధతి" పేజీలో సూచించిన పద్ధతిలో (కేసును నివేదించే వాడుకరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అనే విషయంతో సహా) ఏదైనా మార్పుచేర్పులు చెయ్యాలని మీరు భావిస్తే, అక్కడి చర్చాపేజీలో సూచించండి.
పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:25, 21 నవంబరు 2020 (UTC)