వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
నామెయిలు ఐడి. ahmadnisarsayeedi@yahoo.co.in. - నా మొబైల్ నెం. 09325811912 / 09175562265. మెయిలుద్వారా గానీ మొబైల్ ద్వారా గానీ సంప్రదించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:26, 27 సెప్టెంబరు 2014 (UTC)
స్పందనలు
[మార్చు]అహ్మద్ నిసార్ గారికి,
- చక్కని ప్రాజెక్టు ప్రారంభించినందుకు ధన్యవాదాలు.
- దీనికి చాలా సమయం పడుతుంది. అత్యంత శ్రమతో కూడినది. అన్నింటికన్నా ముఖ్యమైన సమస్య వనరులు తక్కువగా లభించడం. అందుమూలంగా మీరు సూచించినట్లుగా వనరులను సమీకరించుకోడానికే 1-2 నెలలు పడుతుంది. తర్వాత పునాదుల్ని ముందుగా వేసి తరువాత వాటిని గురించిన వ్యాసాల్ని ప్రారంభించి, అభివృద్ధి చేయాల్సి వుంటుంది.
- మీరు చేయబోయే పని అంతా కూడా తెలుగులోనే ఉంటుందని భావిస్తున్నాను.
- నానుండి ఏదైనా సహాయం అవసరమైతే తెలియజేయండి.
- మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:22, 25 సెప్టెంబరు 2014 (UTC)
శుభారంభం
[మార్చు]ప్రాజెక్టు ప్రారంభించినందులకు శుభాభినందనలు అహ్మద్ నిసార్ గారు. ఈ ప్రాజెక్టుకు నానుండి సంపూర్ణ సహకారం ఉంటుందని చిత్తగించవలసినదిగా కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:53, 25 సెప్టెంబరు 2014 (UTC)
- సమయం పట్టినప్పటికీ మంచి ప్రాజెక్టు అవుతుంది. వనరుల సమీకరణలో మొదటి దశలో మాత్రమే ఎక్కువ ప్రయాస ఉంటుంది. తరువాత వ్యాస విస్తరణ, మూలాలను జతచేయడం సులభం అవుతుంది..విశ్వనాధ్ (చర్చ) 04:37, 27 సెప్టెంబరు 2014 (UTC)
- మంచి ప్రాజెక్టు ప్రారంభించినందులకు అభినందనలు. ఈ ప్రాజెక్టుకు నా నుండి ఏదైనా సహకారం కావలిస్తే సంపూర్ణ సహకారాన్నందిస్తానని తెలియజేస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 07:41, 27 సెప్టెంబరు 2014 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]రాజశేఖరుల వారికి, సుల్తాన్ ఖాదర్ గారికి, మీ సుహ్రుద్భావానికి ధన్యవాదాలు. అలాగే తప్పకుండా, తెవికీ సోదరుల సహాయ సహకాలుంటాయనే భావనతోటే ఈ ప్రాజెక్టుకు ముందుకొచ్చాను. మరీ మరీ ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:12, 25 సెప్టెంబరు 2014 (UTC)
శుభం
[మార్చు]అహ్మద్ నిసార్ గారికి నమస్కారాలు. మీరు చేపట్టిన ప్రాజెక్టుకు నా వంతు తోడ్పాటునందిస్తాను, ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతపు 13 జిల్లాలకు చెందినదా లేదా పూర్వపు 23 జిల్లాలతో కూడిన విశాలాంధ్రనా తెలుపగలరు. Naidugari Jayanna (చర్చ) 08:08, 27 సెప్టెంబరు 2014 (UTC)
- జయన్న గారూ, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీరు వేసిన మంచి ప్రశ్న ఏమంటే, ఇది విశాలాంధ్ర కా లేక ప్రస్తుతపు ఆ.ప్ర. కు చెందినదా అని. ప్రస్తుతం విభజన తరువాతి ఆం.ప్ర. కు చెందినది. అందులోనూ ప్రధానంగా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలునూ, పాక్షికంగా మిగతా జిల్లాలు. దీన్కి కారణం జనాభా డిస్ట్రిబ్యూషన్ ఆధారం. మరీ మరీ ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 14:40, 28 సెప్టెంబరు 2014 (UTC)
ప్రాజెక్టుకు గ్రాంటీగా చేర్చిన విషయం గురించి
[మార్చు]నేను చేపట్టిన తెలుగు సమాచారం అందుబాటులోకి నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాను. మరో గ్రాంటులో గ్రాంటీగా చేయడం ప్రస్తుతం నాకైతే సాధ్యపడదు. ఇక వాలంటీరుగా పనిచేయడానికైనా నేను పూర్తిగా న్యాయం చేయలేకపోవచ్చు. కనుక నన్ను గ్రాంటీగానో, లేదా వాలంటీర్‌గానో చేర్చవద్దని మనవి. ఇక ప్రాజెక్టు విషయంలో మీ ముందడుగు శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నాను. వాలంటీరుగా పేరు లేకున్నా నాకు వీలున్నంత వరకూ ఈ ప్రాజెక్ట్ సఫలీకృతమయ్యేందుకు కృషిచేస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 18:09, 27 సెప్టెంబరు 2014 (UTC)
సహకారం అందించగలను
[మార్చు](పైజాసత్యగారి చర్చాపేజీలో ప్రస్తావించబడిన విషయాన్ని ఇక్కడ అతికించాను)
- అహ్మద్ నిసార్ గారూ, చక్కని ప్రయత్నం. పైగా నాకు చరిత్ర బాగా నచ్చిన విషయం. అలాగే తప్పకుండా నాకు వీలైన సలహాలు, సహకారం అందించగలను --వైజాసత్య (చర్చ) 01:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
- అహ్మద్ నిసార్ గారు ఈ ప్రాజెక్టు చక్కగా నిర్వహించగలరని విశ్వసిస్తున్నాను. నాకు వీలైనంత సహకారం అందించగలను. --t.sujatha (చర్చ) 09:24, 26 అక్టోబరు 2015 (UTC)
ఆంధ్రప్రదేశ్
[మార్చు]ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్న పదప్రయోగం యావత్తు ఆంధ్ర దేశానికి వర్తించడం లేదు కాబట్టి, ఆంధ్ర దేశంలో ఇస్లాం అని ప్రాజెక్టు పేరు మార్చాలేమో పరిగణించండి. --వైజాసత్య (చర్చ) 01:06, 29 సెప్టెంబరు 2014 (UTC)
వాలంటీరుగా సహాయం
[మార్చు](కశ్యప్ గారు వ్రాసిన విషయాన్ని ఇక్కడ అతికించాను) వాలంటీర్ నెం. 4: కశ్యప్ నాకు ఈ ప్రాజెక్టు నచ్చినది . వాలంటీర్ గా సహాయపడగలను --కశ్యప్ 04:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
కశ్యప్ గారూ మీ అభిమానానికి ఉత్సుకతకు ధన్యవాదాలు. అలాగే లో ఇస్లాం ప్రాజెక్టు పేజీ లో ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టడం జరిగినది. ఇపుడు మార్పు చేయవచ్చునో లేదో తెలియదు. గమనించగలరు. కొంచెం చూసి చెప్పగలరు. మార్పులు సంభవం అని తెలిస్తే, మీరే చొరవ తీసుకుని మార్పులు చేసేది. మరీ ముఖ్యమైన విషయం "బడ్జెట్" శీర్షికలో వాలంటీర్స్ గివ్ అవే కాలమ్ కొంచెం గమనించగలరు. వాటిని ప్రస్తుతం మార్పులు చేర్పులు చేయవచ్చో లేదో తెలియదు. ఈవిషయాన్ని మన్నించి గమనించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 08:53, 29 సెప్టెంబరు 2014 (UTC)
- ప్రాజెక్టులో ఇప్పుడు మార్పు చేయవచ్చు. ఫర్వాలేదు. ప్రస్తుతానికి కనీసం గ్రాంట్ ప్రపోజల్ పీరియడ్ కూడా ముగియలేదు కదా. నిజానికి కొంతకాలం డిస్కషన్స్ జరిగినప్పుడు వికీమీడియన్లు దానిపై జరిపిన ఫలప్రదమైన చర్చల ఫలితంగా మరికొన్ని మార్పులు కూడా చేయాల్సిరావచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 15:16, 29 సెప్టెంబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ మీరు చెప్పిన విధంగానే ఎడిట్ లోకి వెళ్లి, కశ్యప్ గారి పేరును volunteer4= Kasyap అని ఎంటర్ చేసి, బడ్జెట్ లోనూ మార్పులు చేసాను. బడ్జెట్ లో మార్పులు కనిపిస్తున్నాయి కాని, వాలంటీర్4 "బాక్స్" లో కనబడ్డం లేదు.కారణం? అహ్మద్ నిసార్ (చర్చ) 19:30, 29 సెప్టెంబరు 2014 (UTC)
- నలుగురు వాలంటీర్లకు అవకాశం ఉందా? అక్కడ ఓసారి ప్రాప్ బాక్స్‌లో చేసిన సూచనలు చూడండి.(ఎందరైనా వాలంటీర్ చేయవచ్చు. ఐతే అక్కడ అందరిపేర్లూ రాసే అవకాశం ఉండదనుకుంటా. నాకు ఈనాడు రాజశేఖర్ గారు, గాయత్రి, స్వరలాసిక రెగ్యులర్‌గా, టెక్నికల్ విషయాల్లో వెంకటరమణ గారూ, అప్పుడప్పుడూ లక్ష్మీదేవి గారూ వాలంటీర్ చేస్తున్నారు. నేను అప్పట్లో ఎవరిపేర్లూ రాయలేదు మరి. వారిని ప్రస్తావించడానికి మంత్లీ రిపోర్టులు వేదికగా ఎంచుకున్నాను ఇప్పుడు.) --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 30 సెప్టెంబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ మీరు చెప్పిన విధంగానే ఎడిట్ లోకి వెళ్లి, కశ్యప్ గారి పేరును volunteer4= Kasyap అని ఎంటర్ చేసి, బడ్జెట్ లోనూ మార్పులు చేసాను. బడ్జెట్ లో మార్పులు కనిపిస్తున్నాయి కాని, వాలంటీర్4 "బాక్స్" లో కనబడ్డం లేదు.కారణం? అహ్మద్ నిసార్ (చర్చ) 19:30, 29 సెప్టెంబరు 2014 (UTC)
కొన్ని వివరణలు
[మార్చు]పైన వాడుకరి:వైజాసత్య గారు మరియు నాయుడుగారి జయన్న గారు వెలుబుచ్చిన సందేహాలు సమంజసమైనవి. వాటికి వివరణ ఇలా ఇవ్వదలచాను,
- "ఆంధ్ర" అనే పేరు వైదికకాలం నుండి ఉపయోగంలో వున్నది. ఆంధ్రదేశం లోని వివిధ ప్రాంతాలు వివిధ రాజ్యాల క్రింద వివిధ కాలములలో ఉండేవి. పూర్వమధ్యయుగపు ఆంధ్ర చరిత్రలో తూర్పు చాళుక్యుల కాలం 624-1076. ఆ తరువాత కాకతీయులు. ఆతరువాత ఉత్తర మధ్యయుగపు చరిత్ర (1320-1565), అందులో ముసునూరి నాయకుల కాలం, ఆతరువాత బహమనీ రాజ్యం, ఆతరువాత విజయనగరసామ్రాజం. ఆతరువాత ఆధునిక యుగము 1540 – 1956. ఆతరువాత నేటి కాలం.
- ఈ కాలాలలో ముస్లిముల చరిత్రను ఆంగ్లవికీలో వెతికితే స్థూలంగా దొరుకుతుంది కాని సూక్ష్మంగా దొరకదు.
- నేను తెవికీలో భారతదేశంలో ఇస్లాం వ్యాసము మరియు డానికి సంబంధించిన ఇతర వ్యాసాలు వ్రాసేటపుడు, ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర దేశం)లో ఇస్లాం అనే సబ్జెక్ట్ పై వ్రాయడానికి రెఫరెన్సులు వెతకడానికి ప్రయత్నించాను, అయినా అరకొరగా దొరికాయి. వాటిలో బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, మైసూరు రాజ్యం, మొదలగు వాటికి లభించాయి.
- ఆధునిక యుగంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలపు కొన్ని విషయాలకు మాత్రమే మూలాలు దొరికాయి.
- హైదరాబాదు మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాల ముస్లింల చరిత్రే "ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల చరిత్ర" అని ఆలోచించే ప్రమాదం ఏర్పడింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల చరిత్ర (అదీ రాజకీయ చరిత్ర మాత్రమే) కానవస్తుంది కాని మద్రాసు రాష్ట్రంలోని ముస్లింల చరిత్ర స్థితిగతులు వారి చరిత్ర కానరాదు.
- రాజశేఖర్ గారు సూచించినట్లు, వనరులు తక్కువ, వాటిని క్రోడీకరించడానికి, సమకూర్చుకోవడానికే అధిక సమయం పడుతుంది, సరిగ్గా మన ప్రాజెక్టు ఇదే "వనరుల సమీకరణ", ఆతరువాత ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలు వ్రాయడం.
- సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వ్రాసిన పుస్తకాలు, ఆల్బం, ఈప్రాజెక్టులోని ఒక అంశాన్ని వ్రాయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి మాత్రము ఉపకరిస్తాయి.
- ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం హైదరాబాదు మరియు కొన్ని (మాత్రమే) ఇతర చిన్న ప్రాంతాల చరిత్ర మాత్రమే కాదు, ఇంకా మిగతా ప్రాంతాలు ప్రధానంగా నేటి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాముఖ్యతను కలిగివున్నవేనని చూపడం ప్రధాన వస్తువు.
- వైజాసత్యగారు సరిగ్గా నాడిపట్టారు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర దేశంలో ఇస్లాం సరైన పేరని.
- దీనికి నావివరణ, ఆంధ్ర దేశంలో ఇస్లాం -> ఆంధ్రప్రదేశ్ (నేటి) లో ఇస్లాం + తెలంగాణలో ఇస్లాం, అవుతుంది. తెలంగాణలో ఇస్లాం అనే ప్రాజెక్టును + ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ను పూర్తి చేయగలిగితే = ఆంధ్ర దేశంలో ఇస్లాం అనే ఓ పరిపూర్ణ చారిత్రిక రూపం వస్తుంది. దీనిపై సభ్యులు తమ అమూల్యమైన, స్పష్టమైన సలహాలను అందించగలరని ఆశిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 09:22, 29 సెప్టెంబరు 2014 (UTC)
ప్రాజెక్టు వలన లాభాలు
[మార్చు]- ఈ ప్రాజెక్టు కొరకు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలలో ప్రయాణించి విషయసేకరణ చేయవలెను కాబట్టి,
- తెవికీకి ఓ మంచి ప్రచార సాధనం కావచ్చు.
- అలాగే, ఈ ప్రయాణం, తెవికీకి అనేక ఫోటోల సేకరణకు ఉపయుక్తంగా వుంటుంది.
- అనేక సంస్థలతో అనుసంధానాలు, తెవికీ విధివిధానాల ప్రచారం జరుగవచ్చు
- కొత్త సభ్యుల చేర్పులు జరిగే అవకాశాలు
- కొత్త వ్యాసాలు వ్రాయడానికి కావలసిన వనరులు సేకరించవచ్చు.