Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 3

వికీపీడియా నుండి
జూన్ 3, 2008 (2008-06-03)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తస్లీమా నస్రీన్ కు ఆశ్రయం ఇవ్వడానికి స్వీడన్ ఆహ్వానం పలికింది. బంగ్లాదేశ్ బహిష్కరించుటలో 1994 నుంచి నస్రీన్ విదేశాలలో ఆశ్రయం పొందుతున్నది.
  • తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఉపఎన్నికల ఫలితాలపై నైతికబాధ్యత వహిస్తూ పార్టీ అద్యక్షపదవికి రాజీనామా చేశాడు.
  • విద్యుత్తును ఆదా చేయడానికి వీలుగా పాకిస్తాన్ లో అన్ని గడియారాలు ఒక గంట ముందుకు జరుపాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • శ్రీలంకలో కురిసిన భారీవర్షాల వల్ల అనేక ప్రాంతాలలో వరదలు సంభవించి 80వేలమంది నిరాశ్రయులయ్యారు.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో కలిసి ఆడేందుకు భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, మహేష్ భూపతిలు అంగీకరించారు.
  • ప్రాణాంతక సార్స్ వ్యాధి నిర్మూలనకై కృషిచేసిన ప్రవాస భారతీయురాలు షీలా బస్రూర్ కెనడాలో మృతి.
  • మాదక ద్రవ్యాలను కలిగిఉన్నాడనే అనుమానంతో పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ ఆసిఫ్ దుబాయ్ లో అరెస్ట్ అయ్యాడు.