శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°55′N 78°08′E / 18.91°N 78.14°E |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నిజామాబాద్ జిల్లా |
ప్రదేశం: | సీ.హెచ్.కొండూర్, నందిపేట్ మండలం |
ఆలయ వివరాలు | |
ముఖ్య_ఉత్సవాలు: | బ్రహ్మోత్సవాలు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారతదేశం |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 2022 |
సృష్టికర్త: | కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్‌కుమార్ |
శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, సీ.హెచ్.కొండూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్‌కుమార్ దంపతులు సొంత ఖర్చుతో నిర్మించిన ఈ దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలు 2022 జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగాయి.[1][2]
చరిత్ర
[మార్చు]గతంలో గోదావరి నదిని ఆనుకొని ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా ముంపునకు గురైంది. దాంతో ఆ గ్రామ ప్రజలు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు. పాతగ్రామంలోని దేవాలయం కూడా ముంపుబారిన పడడంతో, లక్ష్మీనరసింహుడి విగ్రహాలను నూతన గ్రామానికి తీసుకొచ్చి చిన్నపాటి గూడును ఏర్పాటు చేసుకొని, ఐదున్నర దశాబ్దాలుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.[3]
నిర్మాణం
[మార్చు]ప్రతిష్ఠాపనోత్సవాలు
[మార్చు]శిలామయ, లోహమయమూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం మహాధార్మిక క్రతువులను నిర్వహించారు. లోక కల్యాణార్థం, విశ్వశాంతి, ప్రజల ఆయురారోగ్య, ఐశ్వర్య సిద్ధి కోసం ఆరు రోజులపాటు ధార్మిక క్రతువులు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ నూతన నిర్మాణ ప్రదేశంలో యాగశాలలను నిర్మించారు. రుత్వికులు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.[4]
- మొదటిరోజు: నూతన ఆలయ ప్రారంభోత్సవ క్రతువులో భాగంగా శనివారం ఉదయం ధ్వజస్తంభం ప్రతిష్టాపన, సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం దీక్షాధారణ అంకురార్పణ వంటి కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 15 వేలకుపైగా భక్తులు ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించారు.
- రెండవరోజు: ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం ప్రాతారాధన, సేవాకాలం, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, అరని మథనం, యాగశాల ప్రవేశం, మూల మంత్రమూర్తి, మంత్ర హవనం, చాయాధివాసం, వాస్తు శాంతి, వాస్తు పర్యగ్నీకరణం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్య పూర్ణాహుతి, మంగళశాసనము, వేద విన్నపాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. మధ్యాహ్నం 5 వేల మందికి వివిధ రకాల వంటకాలతో భోజనం ఏర్పాటుచేశారు.[5] పంచసూక్త పరివార ప్రాయశ్చిత హవన ము, నిత్య పూర్ణాహుతి తర్వాత మంగళ శాసనం, వేద విన్నపాలు, తీర్థ ప్రసాద గోష్టితో రాత్రి 9.30గంటలకు రెం డో రోజు కార్యక్రమాలు ముగిశాయి. పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్ ఆమేర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.[6]
- మూడవరోజు: 4400 లీటర్ల గోక్షీరంతో మూల మూర్తులకు, పరివార దేవతామూర్తులకు క్షీరాధివాసం కార్యక్రమం జరిగింది. అనంతరం మహాయజ్ఞం నిర్వహించబడింది.
- నాలుగవరోజు: ఫల పుష్ప ధాన్య ధన శయ్యాధివాసాల క్రతువు నిర్వహణం జరిగింది. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్టాపన కార్యక్రమాలు సేవాకాలం, నివేదన మంగళా శాసనాలు, వేద విన్నపాలు, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూల మంత్రమూర్తి మంత్ర హవనం, పంచ సూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్య పూర్ణాహుతి, శాత్తుమోరై కార్యక్రమాలు భక్త జనరంజకంగా జరిగాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో సాయంకాల కార్యక్రమాలు ప్రారంభమై నరసింహ ఉపాసకుల మంగళా శాసనాలు, తీర్థ ప్రసాద గోష్ఠితో ముగిసాయి.
- ఐదవరోజు: ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి 9.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మంగళాశాసనము, వేద విన్నపాలు, తీర్థప్రసాద గోష్టి జరిగాయి. నవ నారసింహ పూజలో భాగంగా ఉగ్ర, కృధ్ధ, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీలక్ష్మి నరసింహ ఆరాధన చూడముచ్చటగా జరిగింది. నరసింహ కరావలంబం, నరసింహ స్తోత్రాలు అనంత భక్తిశ్రద్ధలతో పఠించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత తల్లి, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేశ్ గుప్తా, ఆర్మూర్ శాసనసభ్యులు పిఏసి చైర్మన్ జీవన్ రెడ్డి, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు కమలాకర్ రావు, పండిత పరిషత్ అబ్దుల్లా, కృపాల్ సింగ్‌తో పాల్గొన్నారు.
- ఆరవరోజు: దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ, సంప్రోక్షణ, విమాన శిఖరం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు కుటుంబ సమేతంగా యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత తల్లి, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తదితరులు హాజరయ్యారు. ఆరురోజులపాటు కార్యక్రమాలు నిర్వహించిన వేదపండితుల బృందాన్ని, దేవాలయ నిర్మాణానికి భూదానం చేసిన దాతలను సన్మానించారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-06-04). "సీహెచ్ కొండూర్‌లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు". Namasthe Telangana. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-06.
- ↑ Velugu, V6 (2022-06-04). "వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Desam, A. B. P. (2022-06-04). "గుడిసెలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి నేడు భవనంలోకి మారాడు". telugu.abplive.com. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
- ↑ telugu, NT News (2022-06-04). "ప్రతిష్ఠాపనోత్సవాలకు ముస్తాబు". Namasthe Telangana. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
- ↑ telugu, NT News (2022-06-06). "మార్మోగిన గోవింద నామస్మరణ". Namasthe Telangana. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
- ↑ telugu, NT News (2022-06-06). "ఆద్యంతం.. ఆధ్యాత్మికం". Namasthe Telangana. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-15.
- ↑ G, Rajesh (2022-06-10). "కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి, ఆరురోజుల పాటు వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవం". Mango News. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.