Jump to content

సనత్కుమారులు

వికీపీడియా నుండి
(సనకసనందాదులు నుండి దారిమార్పు చెందింది)
సనక, సనాతన, సనందన, సనత్కుమారులు

సనత్కుమారులు లేదా సనకసనందాదులు బ్రహ్మ మానస పుత్రులు.[1] వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు.ధర్మప్రజాపతి పుత్రులు.వీరితల్లి హింస.సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు.సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సుచేస్తూ కాలంగడిపారు.బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.

భాగవత పురాణం 12 మంది మహా భక్తులు పేర్కొనబడ్డారు.[2] వీరు జీవన్ముక్తులైనా విష్ణువు భక్తులై దేశ సంచారులుగా భగత్సేవచేస్తూ జీవిస్తారు. అందరిలోకి పెద్దవారైనా సనత్కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తుంటారు.[3] వీరు హిందూ పురాణాలో విశిష్టమైన పాత్ర పోషించారు.

ఒకనాడు విష్ణు దర్శనార్ధం విచ్చేసిన సనత్కుమారులకను అడ్డగించిన జయవిజయులు శాపానికి గురైనారు. తత్ఫలితంగా మూడు జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. వీరే భాగవతంలోని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మహాభారతంలోనిశిశుపాలుడు, దంతవక్తృడు, రామాయణంలోని రావణుడు, కుంభకర్ణుడు.

మూలాలు

[మార్చు]
  1. Bhag-P 3.15.12 Archived 2007-09-30 at the Wayback Machine "Lord Brahma said: My four sons Sanaka, Sanatana, Sanandana and Sanatkumara, who were born from my mind"
  2. "Bhag-P 6.3.20-21". Archived from the original on 2012-02-04. Retrieved 2009-02-13.
  3. Bhag-P 7.1.37 Archived 2009-12-09 at the Wayback Machine "Although these four great sages were older than Brahma's other sons like Marici, they appeared like small naked children only five or six years old"