సన్ ఆఫ్ ఇండియా
సన్ ఆఫ్ ఇండియా | |
---|---|
దర్శకత్వం | డైమండ్ రత్నబాబు |
రచన | డైమండ్ రత్నబాబు |
స్క్రీన్ ప్లే | మంచు విష్ణు |
నిర్మాత | మంచు విష్ణు |
తారాగణం | |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థలు | 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీs | 18 ఫిబ్రవరి 2022(థియేటర్) 17 మే 2022 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సన్ ఆఫ్ ఇండియా దేశభక్తి ప్రధానాంశంగా 2021లో నిర్మించిన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించగా డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీకాంత్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 18న విడుదలై[1], 2022 మే 17న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[2]
కథ
[మార్చు]బాబ్జీ (మోహన్‌బాబు) ఎన్.ఐ.ఎ అధికారిణి అయిన ఐరా (ప్రగ్యా జైశ్వాల్) దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తిరుపతి బయలుదేరిన కేంద్ర మంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) తలకోనలో కిడ్నాప్‌కి గురవుతాడు. ఈ కేసుని ఛేదించడం కోసం ఐరా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కిడ్నాప్‌ల వెనక బాబ్జీ అని తెలుస్తుంది. ఇంతకీ బాబ్జీ ఆ కిడ్నాప్‌లు ఎందుకు చేశాడు? అతను గతం ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[3]
చిత్రనిర్మాణం
[మార్చు]ఈ సినిమాను 2020 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను మోహన్ బాబు ప్రకటించాడు.[4] ఈ సినిమా 2020 అక్టోబరు 23న పూజ కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.[5] ఈ సినిమా టీజర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.[6]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
- నిర్మాత: మంచు విష్ణు
- దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
- స్క్రీన్ ప్లే: మోహన్ బాబు
- సంగీతం: ఇళయరాజా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 February 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Sakshi (17 May 2022). "ఓటీటీలో 'సన్ ఆఫ్ ఇండియా' స్ట్రీమింగ్.. ఎక్కడంటే ?". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
- ↑ Andhra Jyothy (18 February 2022). "సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ News18 Telugu (15 August 2019). "'సన్ ఆఫ్ ఇండియా'గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్." News18 Telugu. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu (23 October 2020). "Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు 'సన్నాఫ్ ఆఫ్ ఇండియా' మూవీ." News18 Telugu. Archived from the original on 29 November 2020. Retrieved 14 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (5 June 2021). "డైలాగ్ కింగ్‌కి మెగా వాయిస్". Sakshi. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.