Jump to content

సల్వార్ కమీజ్

వికీపీడియా నుండి
(సల్వార్ నుండి దారిమార్పు చెందింది)
సల్వార్, కమీజ్ ల చిత్రము

సల్వార్ కమీజ్ అనునవి దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ లలో స్త్రీ పురుషులిరువురి చే ధరింపబడే దుస్తులు. సల్వార్ అనగా పైజామా వలె ఉండే నడుము నుండి కాళ్ల వరకు ఆచ్ఛాదననిచ్చే వస్త్రము. నడుము వద్ద వదులుగా ఉండి క్రిందకు వెళ్ళే కొద్దీ బిగుతుగా ఉంటాయి. కమీజ్ అనగా కుర్తా వలె ఉండే చేతులకి, గొంతు నుండి నడుము వరకు, లేదా తొడల, మోకాళ్ళ, లేదా పిక్కల వరకూ ఆచ్ఛాదన నిచ్చే వస్త్రము. కమీజ్ కి నడుము వద్ద నుండి క్రింద వరకు ఉండే చీలికలు కదలికకై స్వేచ్ఛని ఇస్తాయి.

వివరణ

[మార్చు]
A man's shalwar held up to display amount of material needed.

సల్వార్ నడుమును ఎలాస్టిక్ లేదా త్రాడుతో చుట్టబడి ఉంచే దుస్తులలోని రకము. ఈ పాంట్స్ విశాలంగా బాగీ లేదా దగ్గరగా, బట్టలు కత్తిరెంచే విధానం బట్టి ఉంటుంది.

ఈ కమీజ్ సాధారణంగా సరళంగా సమానంగా కత్తిరిస్తారు. పూర్వపు కమీజ్ ను సాంప్రదాయకంగా కత్తిరించేవారు. నవీన కమీజ్ యూరోపియన్ ప్రభావం కలది. దర్జీల నైపుణ్యం సల్వార్ కమీజ్ కుట్టునపుడు కత్తిరించుటలోనే కాదు దాని మెడ ఆకారాన్ని అలంకరణ చేయుటలో ఉంటుంది. నవీనంగా స్త్రీల యొక్క కమీజ్ లు సాంప్రదాతక దుస్తుల కంటే నిరాడంబరంగా ఉంటుంది. ఈ కమీజ్ ఎక్కువ నెక్ లైన్ కత్తిరించి, దానిపై మంచి వస్త్రము లేదా స్టైల్ కేప్ స్లీవ్స్ లేదాస్లీవ్ లెస్ డిసైన్ లలో కుడతారు.

ఆ క్రమంలో చివరకు లడఖ్ వంటి మారుమూల ప్రాంతాలకు కూడా చేరింది.[1] ఇది పాకిస్తాన్లో జాతీయ వస్త్రధారణ, [2][3] 1960ల నుంచీ పంజాబీ సల్వార్ పాకిస్తానీ ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగించడం ప్రారంభించాకా జాతీయ డ్రెస్ గా స్థిరమైపోయింది.[4]

పంజాబీ సంస్కృతిలో ఈ వస్త్రధారణ శతాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది, ఒక్కొక్కప్పుడు సూతాన్ గానూ[5][6] కుర్తా/కుర్తీగా కలయికగానో లేదా సల్వార్ ఝంగా (కమీజ్) /కుర్తా కాంబినేషన్ గానో వాడారు. ఈ దుస్తుల రకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన పటియాలా సల్వార్, సరైకీ సల్వార్ సూట్స్ వంటివి ఉన్నాయి.

స్త్రీల సల్వార్ కమీజ్

[మార్చు]

పంజాబీ సూట్‌ మాదిరిగానే నిండుగా ఉంటుంది. స్త్రీలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ సల్వార్‌ కమీజ్‌లో చాలా రకాలే ఉన్నాయి. అందులో పటియాలా సల్వార్‌ కమీజ్‌ ఒకటి. ఏ వయస్సు వారికైనా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సరికొత్త డిజైన్స్‌తో మహిళలను అలరిస్తున్నాయి. ఈ పటియాలా డ్రెస్‌ రాజుల కాలం నుండి వస్తుంది. ధరించిన వారికి కంఫర్ట్‌గా ఉండి వైరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాలా డ్రెస్‌కు ఇప్పటకీ జనంలో క్రేజ్‌ ఉంది. ఇప్పుడు పటియాలా సూట్‌లో సరికొత్త డిజైన్స్‌ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్‌ వాడొచ్చు. నచ్చిన ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు. స్త్రీల పంజాబీ సల్వార్ సూట్ శైలి మొత్తం భారత ఉపఖండంలోనూ, ఆపైన ప్రపంచంలోని చాలాభాగాల్లోనూ ప్రాచుర్యం పొందింది.[7][8]

వ్యుత్పత్తి, చరిత్ర

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

యివి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. Textiles, Costumes, and Ornaments of the Western Himalaya by Omacanda Hāṇḍā [2]
  2. Basic facts about Pakistan, Issue 5 (1950)
  3. Nelson,Lise . Seager,Joni (2008) A Companion to Feminist Geography
  4. Qadeer. Mohammad (2006) Pakistan - Social and Cultural Transformations in a Muslim Nation [3]
  5. "1892 Punjab Gazeetter" (PDF). Archived from the original (PDF) on 2014-05-01. Retrieved 2016-12-20.
  6. Kumar, Raj (2008) Encyclopaedia of Untouchables Ancient, Medieval and Modern [4]
  7. The Tribune Pran Nevile 27 May 2000
  8. Lois May Burger (1963) A Study of Change in Dress as Related to Social and Political Conditions in an Area of North India [1]

యితర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.