1991 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1991 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1989 1991 మే 20, జూన్ 12, జూన్ 15[1]
1992 ఫిబ్రవరి 19 (పంజాబ్)
1996 →

543 కి గాను 534 స్థానాలకు
268 seats needed for a majority
Registered49,83,63,801
Turnout56.73% (Decrease 5.22pp)
  First party Second party
 
P. V. Narasimha Rao.JPG
Lal Krishna Advani 2009.jpg
Leader పి.వి.నరసింహారావు ఎల్.కె.అద్వానీ
Party కాంగ్రెస్ (ఐ) భాజపా
Last election 39.53%, 197 స్థానాలు 11.36%, 85 స్థానాలు
Seats won 244 120
Seat change Increase 47 Increase 35
Popular vote 10,12,85,692 5,58,43,074
Percentage 36.40% 20.07%
Swing Decrease 3.13 pp Increase 8.71 pp

  Third party Fourth party
 
V. P. Singh (cropped).jpg
E. M. S. Namboodiripad.jpg
Leader వి.పి.సింగ్ ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
Party జనతా దళ్ సిపిఐ (ఎం)
Last election 17.79%, 143 స్థానాలు 6.55%, 33 స్థానాలు
Seats won 59 35
Seat change Decrease 84 Increase 2
Popular vote 3,26,28,400 1,69,54,797
Percentage 11.73% 6.16%
Swing Decrease 6.06 pp Decrease 0.39 pp


ప్రధాన మంత్రి before election

చంద్రశేఖర్
సమాజవాది జనతా పార్టీ

ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి

పి.వి.నరసింహారావు
కాంగ్రెస్ (ఐ)

భారతదేశంలో 10వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1991 మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, పంజాబ్‌లో మాత్రం 1992 ఫిబ్రవరి 19 న జరిగాయి.

లోక్‌సభలో ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), ఇతర పార్టీల మద్దతుతో కొత్త ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతాదళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా ల నుండి చేస్యించిన ఫిరాయింపుల కారణంగా వివాదాస్పద పరిస్థితుల్లో ప్రభుత్వం 1993 జూలై 28 న అవిశ్వాస తీర్మానం నుండి బయటపడింది.[2][3]

జమ్మూ కాశ్మీర్‌కు కేటాయించిన ఆరు స్థానాలకు, బీహార్‌లో రెండు, ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్థానానికి కూడా ఎన్నికలు జరగలేదు. ఓటింగ్ శాతం 57%గా నమోదైంది. ఇది, అప్పటి వరకు భారత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అతి తక్కువ వోటింగు.[4]

నేపథ్యం

[మార్చు]

అధికారంలో ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం, ఏర్పడిన 16 నెలలకే రద్దు అవడంతో, 1991 ఎన్నికలు జరిగాయి. దాని 50 కోట్లకు పైగా ఉన్న ఓటర్లకు మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లభించింది.[5] ఎన్నికలు భిన్నధ్రువాలుగా విడిపోయిన జరిగాయి. రెండు ముఖ్యమైన ఎన్నికల సమస్యలైన మండల్ కమిషన్ పర్యవసానాలు, రామజన్మభూమి-బాబ్రీ మసీదు సమస్యల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలను 'మండల్-మందిర్' ఎన్నికలు అని కూడా పిలుస్తారు.

మండల్-మందిర్ సమస్య

[మార్చు]

VP సింగ్ ప్రభుత్వం అమలు చేసిన మండల్ కమీషన్ నివేదిక ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన కులాల (OBC)లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల ప్రజల నుండి విస్తృతమైన హింసకు, నిరసనలకూ దారితీసింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో అనేక మంది విద్యార్థులు తమకు తాము నిప్పంటించుకున్నారు కూడా. అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదుపై జరుగుతున్న వివాదం కారణంగా అది కూడా ఈ ఎన్నికలకు మరో ప్రధానాంశం. ఇది భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశం.

మందిర సమస్య దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక అల్లర్లకు దారితీసింది. ఓటర్లు కుల, మత ప్రాతిపదికన విభజించబడ్డారు. నేషనల్ ఫ్రంట్ విడిపోవడంతో, కాంగ్రెస్(ఐ) అత్యధిక స్థానాలు సాధించి, మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభజనను అత్యధికంగా ఉపయోగించుకోగలిగింది.[6]

రాజీవ్ గాంధీ హత్య

[మార్చు]

మే 20 న మొదటి రౌండ్ పోలింగ్ జరిగిన ఒక రోజు తర్వాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్‌లో మరగతం చంద్రశేఖర్ తరపున ప్రచారం చేస్తూ హత్యకు గురయ్యాడు. మిగిలిన ఎన్నికలను జూన్ మధ్య వరకు వాయిదా వేసారు. చివరకు జూన్ 12, 15 తేదీల్లో ఓటింగు జరిగింది.

మొత్తం ఎన్నికలు జరగాల్సిన 534 నియోజకవర్గాలకు గాను, 211 నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగు జరిగిన తర్వాత హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్ళినందున, ఈ రెండు దశల ఎన్నికల ఫలితాలలో బాగా తేడా వచ్చింది.[7] మొదటి దశలో కాంగ్రెస్ (ఐ) దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. రెండవ దశలో భారీ సానుభూతి తరంగం కారణంగా భారీగా విజయాలు సాధించింది.[5] గతంలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పి.వి.నరసింహారావు నేతృత్వంలో, జనతాదళ్ మద్దతుతో కాంగ్రెస్ (ఐ) నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. రావు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తరువాత నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఓట్లతో గెలుపొందాడు.

వేర్పాటువాద హింసతో అట్టుడుకుతున్న పంజాబ్‌లో ముష్కరులు చేసిన రెండు దాడుల్లో 1991 జూన్ 17 న ప్రచారంలో 76 నుండి 126 మంది కాల్చి చంపబడ్డారు. సిక్కు తీవ్రవాదులు వేరువేరు రైళ్లలో ఈ హత్యలు చేశారని పోలీసు నివేదికలు తెలిపాయి.[8] జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌ లలో మొత్తం 19 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగలేదు.[9] పంజాబ్‌లో 1992 ఫిబ్రవరి 19 న ఎన్నికలు జరిగాయి,[10] ఇక్కడ కాంగ్రెస్ 13 స్థానాలకు గాను 12 ను గెలుచుకుంది,[11] తద్వారా లోక్‌సభలో వారి సంఖ్య 232 నుండి 244కి పెరిగింది.

ఫలితాలు

[మార్చు]
PartyVotes%Seats
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)9,97,99,40336.27232
భారతీయ జనతా పార్టీ5,53,45,07520.11120
జనతా దళ్3,25,89,18011.8459
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)1,69,54,7976.1635
జనతా పార్టీ92,67,0963.375
తెలుగు దేశం పార్టీ82,23,2712.9913
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా68,51,1142.4914
ద్రవిడ మున్నేట్ర కజగం57,41,9102.090
ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం44,70,5421.6211
Bahujan Samaj పార్టీ44,20,7191.612
Shiv Sena22,08,7120.804
Revolutionary సోషలిస్టు పార్టీ17,49,7300.644
Asom Gana Parishad14,89,8980.541
జార్ఖండ్ ముక్తి మోర్చా14,81,9000.546
జనతా దళ్ (గుజరాత్)13,99,7020.511
పట్టాళి మక్కల్ కచ్చి12,83,0650.470
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్11,45,0150.423
ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు) – Sarat Chandra Sinha9,82,9540.361
ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్8,45,4180.312
ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్6,44,8910.230
Natun Asom Gana Parishad4,94,6280.180
Karnataka Rajya Ryota Sangha4,90,2750.180
దూరదర్శి పార్టీ4,66,8690.170
ఆలిండియా Majlis-e-Ittehadul Muslimeen4,56,9000.171
Kerala కాంగ్రెస్ (M)3,84,2550.141
Jharkhand పార్టీ3,50,6990.130
హర్యానా వికాస్ పార్టీ3,31,7940.121
నాగా పీపుల్స్ ఫ్రంట్3,28,0150.121
భారతీయ Republican Paksha3,27,9410.120
Kerala కాంగ్రెస్3,19,9330.120
పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా2,95,4020.110
యునైటెడ్ మైనారిటీస్ ఫ్రంట్, అస్సాం2,06,7370.080
లోక్ దళ్1,73,8840.060
మార్క్సిస్టు కోఆర్డినేషన్ కమిటీ1,71,7670.060
United Reservation Movement Council of Assam1,70,3760.060
మణిపూర్ పీపుల్స్ పార్టీ్1,69,6920.061
Autonomous State Demand Committee1,39,7850.051
Sanjukta Loka Parishad1,25,7380.050
సిక్కిం సంగ్రామ పరిషత్1,06,2470.041
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రాగడె)91,5570.030
శిరోమణి అకాలీ దళ్(సింరంజిత్ సింగ్ మాన్)88,0840.030
Plain Tribals Council of Assam87,3870.030
మిజో నేషనల్ ఫ్రంట్82,0190.030
Sarv Jati జనతా Parishad70,3680.030
అఖిల భారత హిందూ మహాసభ67,4950.020
మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ64,7520.020
Tharasu Makkal Mandram55,1650.020
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్47,3690.020
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (S.S. Srivastava)43,0850.020
భారతీయ Krishi Udyog Sangh42,5040.020
Jan Parishad37,7250.010
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా36,5410.010
అంరా బంగాలీ35,1860.010
ఇండియన్ Union Muslim League (IML)31,3870.010
Sampooran Kranti Das29,6470.010
Akhil భారతీయ Manav Seva Das28,5280.010
Uttar Pradesh Republican పార్టీ28,3790.010
Yuva Vikas పార్టీ28,1590.010
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్)27,7300.010
Jawan Kisan Mazdoor పార్టీ23,9290.010
Proutist Bloc of India22,7340.010
Soshit Samaj Dal19,9250.010
Akhil భారతీయ Jansangh19,2430.010
Orissa Vikas Parishad15,8930.010
హుల్ జార్ఖండ్ పార్టీ15,4060.010
Akhil భారతీయ Hindustani Krantikari Samajwadi పార్టీ12,8200.000
Dalit Panthers పార్టీ11,9670.000
భారతీయ Loktantrik Mazdoor Dal10,8370.000
Akhil భారతీయ Revolutionary Samaj Dal8,8250.000
Akhil Bhartiya Shivsena-Rashtrawadi8,8100.000
Asom Jatiyatabadi Dal8,5190.000
అంబేద్కర్ మక్కళ్ ఇయక్కం8,2520.000
Asom Jatiya Parishad8,0470.000
Akhil భారతీయ Pichhadavarg పార్టీ6,8970.000
ఆలిండియా దళిత్ ముస్లిం మైనారిటీస్ సురక్షా మహాసంఘ్5,8880.000
Vidarbha Praja పార్టీ5,5970.000
Akhil భారతీయ గ్రామ పరిషత్5,5210.000
Akhil Bhartiya Dharmnirpeksh Dal5,4360.000
హిందూ స్వరాజ్ సంఘటన్5,3250.000
రిపబ్లికన్ ప్రెసీడియమ్ పార్టీ ఆఫ్ ఇండియా4,9670.000
Surajya పార్టీ4,7050.000
సర్వోదయ పార్టీ4,6420.000
జనతా దళ్ (Samajwadi)4,5480.000
దేశీయ కర్షక పార్టీ4,5080.000
Gondwana పార్టీ3,6050.000
Azad Hind Fauz (Rajkiya)3,5430.000
Samdarshi పార్టీ2,9210.000
Lok పార్టీ2,8730.000
ఆలిండియా Urdu Morcha2,6550.000
Akhil Bhartiya Ramrajya Parishad (Vasudev Shastri Atul)2,5190.000
ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ2,3110.000
Pondicherry Mannila Makkal Munnani2,2590.000
Pandav Dal2,2130.000
Internationalist Democratic పార్టీ2,0780.000
Gomant Lok పార్టీ1,9830.000
Akhil భారతీయ Desh Bhakt Morcha1,7920.000
Workers పార్టీ ఆఫ్ ఇండియా1,7810.000
Nationalist పార్టీ1,7680.000
Marx Engles Leninist Commune Health Association1,6920.000
Nagaland పీపుల్స్ పార్టీ1,5720.000
Adarsh Lok Dal1,5440.000
Desh Bhakt పార్టీ1,5210.000
Akhil భారతీయ Bharat Desham పార్టీ1,4660.000
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (Kamble)1,3000.000
Akhil భారతీయ Janhit Jagrati పార్టీ1,2450.000
Mukt Bharat1,1910.000
Rashtriya Krantikari Dal1,1250.000
Sampooran Rashtriya Sena1,0400.000
Gramma Munnetra Kazhagam1,0300.000
Navbharat పార్టీ7870.000
Labour పార్టీ ఆఫ్ ఇండియా (V.V. Prasad)6840.000
Thayaga Marumalrchi Kazhagam6650.000
Poorvanchal Rashtriyaకాంగ్రెస్6050.000
Jammu-Kashmir Panthers పార్టీ5870.000
Kannada Paksha5760.000
Akhil భారతీయ Mahila Dal5730.000
Lokhit Morcha5320.000
Republican పార్టీ ఆఫ్ ఇండియా (Athawale)5210.000
Labour పార్టీ (Ashok Bhattacharjee)4340.000
Akhil భారతీయ Loktantra పార్టీ4080.000
Cheluva Kannad Nadu3830.000
Azad పార్టీ3720.000
Democratic పార్టీ ఆఫ్ ఇండియా3590.000
భారతీయ బ్యాక్‌వర్డ్ పార్టీ3290.000
Hindu Shiv Sena (A.K. Brahmbatt)3250.000
Rashtriya Unnatsheel Das3160.000
Akhil భారతీయ Gram Parishad3140.000
Akhil భారతీయ Loktantric Alpsankhyak Janmorcha2570.000
Sr. Citizens నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా2500.000
M.G.R. Munnetra Kazhagam2280.000
Mahabharat People's పార్టీ2250.000
Janataకాంగ్రెస్ పార్టీ of Bharatvarsha1940.000
Akhil Bhartiya Hindu Shakti Dal1930.000
Akhil Bharatiyaసోషలిస్టుt పార్టీ1660.000
Kannada Desh పార్టీ1640.000
భారతీయ Dhruba Labour పార్టీ1420.000
Jai Mahakali Nigrani Samiti1380.000
Bhartiya Sangthit Nagrik పార్టీ1200.000
Vishal Bharat పార్టీ560.000
Jan Ekata Morcha340.000
Independents1,14,41,6884.161
Nominated Anglo-Indians2
Total27,51,83,289100.00523
చెల్లిన వోట్లు27,51,83,28997.35
చెల్లని/ఖాళీ వోట్లు74,93,9522.65
మొత్తం వోట్లు28,26,77,241100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు49,83,63,80156.72
మూలం: ECI

పంజాబ్‌లో

[మార్చు]
PartyVotes%Seats
ఇండియన్ Nationalకాంగ్రెస్ (Indira)14,86,28949.2712
Bahujan Samaj పార్టీ5,94,62819.711
భారతీయ జనతా పార్టీ4,97,99916.510
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (Marxist)1,19,9023.980
శిరోమణి అకాలీ దళ్(Simaranjit Singh Mann)77,9702.580
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా47,2261.570
జనతా దళ్39,2201.300
జనతా పార్టీ27,9660.930
Lokdal2,8390.090
భారతీయ Krishi Udyog Sangh1,3490.040
Independents1,21,0094.010
Total30,16,397100.0013
చెల్లిన వోట్లు30,16,39795.59
చెల్లని/ఖాళీ వోట్లు1,39,1264.41
మొత్తం వోట్లు31,55,523100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు1,31,69,79723.96
మూలం: ECI

అనంతర పరిణామాలు

[మార్చు]

కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. మీడియాలో ప్రధానమంత్రిగా ప్రస్తావనకు వచ్చిన వ్యక్తులు:[12]

వివాదాస్పద పరిస్థితుల్లో జనతాదళ్ నుండి బయటి మద్దతు పొంది, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్(ఐ) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి తరువాత, నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడు ప్రధాని అయిన రెండవ కాంగ్రెస్ నాయకుడు నరసింహారావు. 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా అతనే.[14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "1991 India General (10th Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 23 April 2021. Retrieved 2020-09-07.
  2. "Narashima Rao becomes butt of 'suitcase' and 'crore' jokes among Congressmen, Opposition". India Today. 15 August 1993. Archived from the original on 16 October 2022. Retrieved 27 April 2023.
  3. "JMM MP turns approver in bribery case against Rao". www.rediff.com. Archived from the original on 24 September 2015. Retrieved 16 March 2013.
  4. "India: parliamentary elections Lok Sabha, 1991". archive.ipu.org. Archived from the original on 13 June 2021. Retrieved 2020-09-06.
  5. 5.0 5.1 "INKredible India: The story of 1991 Lok Sabha election - All you need to know". Zee News (in ఇంగ్లీష్). 2019-04-08. Archived from the original on 15 January 2022. Retrieved 2022-01-13.
  6. "History Revisited: How political parties fared in 1991 Lok Sabha election". Zee News (in ఇంగ్లీష్). 2019-04-06. Archived from the original on 27 October 2020. Retrieved 2020-09-06.
  7. The congress party did poorly in the pre-assassination constituencies and swept the post-assassination constituencies
  8. Crossette, Barbara (1991-06-17). "Party of Gandhi Narrowly Ahead in India Election". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 22 September 2021. Retrieved 2020-09-07.
  9. "Once Upon a Poll: Tenth Lok Sabha Elections (1991)". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 21 March 2014. Archived from the original on 7 April 2018. Retrieved 2018-04-07.
  10. Vinayak, Ramesh (September 3, 2013) [February 29, 1992]. "With militant scare and Akali boycott, Punjab elections may be a damp squib". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2020. Retrieved 2020-09-06.
  11. "1992 India General Elections Results". www.elections.in. Archived from the original on 21 September 2020. Retrieved 2020-09-06.
  12. 12.0 12.1 12.2 12.3 "Rao, Pawar in race for CPP-I leadership". The Indian Express. Madras. 18 June 1991. Archived from the original on 10 May 2017. Retrieved 2016-03-12.
  13. "A meeting of hearts". The Indian Express. Madras. 15 June 1991. Archived from the original on 10 May 2017. Retrieved 2016-03-12.
  14. "How Shukla saved Rao govt in 1992". The Times of India. Archived from the original on 20 April 2018. Retrieved 19 April 2018.