Coordinates: 13°58′39″N 77°06′18″E / 13.977447°N 77.104984°E / 13.977447; 77.104984

గుడిబండ

వికీపీడియా నుండి
(Gudibanda నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుడిబండ
—  రెవెన్యూ గ్రామం  —
గుడిబండ is located in Andhra Pradesh
గుడిబండ
గుడిబండ
అక్షాంశరేఖాంశాలు: 13°58′39″N 77°06′18″E / 13.977447°N 77.104984°E / 13.977447; 77.104984
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా సత్యసాయి
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,561
 - పురుషుల సంఖ్య 4,976
 - స్త్రీల సంఖ్య 4,585
 - గృహాల సంఖ్య 2,035
పిన్ కోడ్ 515271
ఎస్.టి.డి కోడ్

గుడిబండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లా, గుడిబంండ మండలంలోని గ్రామం, మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 48 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2035 ఇళ్లతో, 9561 జనాభాతో 3847 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4976, ఆడవారి సంఖ్య 4585. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1628 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 413. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595384[1].పిన్ కోడ్: 515271.

గ్రామ చరిత్ర[మార్చు]

ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.సా.శ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలు ఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాక గుడిబండ కొండపై ఉన్న కొలనులో నిమ్మకాయవేస్తే కొండకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరుబాగల్ చెరువులో నిమ్మకాయ తేలుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఇలాంటి కొండపైఅప్పట్లో కోటను నిర్మించడానికి రాజులు నానా తంటాలు పడ్డారని, ఆ కోట ఒక ప్రక్క నిర్మిస్తే మరోపక్క కూలిపోయేదని చివరకు మల్లేశ్వరుడి గుడి కట్టిన తర్వాతనే కోట నిర్మాణం జరిగిందని పూర్వీకులు చెపుతున్నారు. మూఢ విశ్వాసంతో ఒక నిండు గర్భిణిని అప్పట్లో బలిచ్చారట. ఇప్పటికీ ఆ మరణించిన మహిళ ఆనవాళ్ళు నేటికీ ఆ కొండపై చూడవచ్చు. ఈ కొండ పై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని బలైన మహిళ ఆనవాళ్ళను చూసి తెలుసుకోవడానికి ఎంతో మంది సందర్శకులు వచ్చి వెళుతుంటారు. ఈ కొండపైకి వెళ్లడానికి సరైన మెట్ల సౌకర్యం లేక మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొండపై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయం కూడా కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది.మైరాడా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఆలయానికి మరమ్మతు చేయించింది. దానితో ఆలయానికి పూర్వవైభవం వచ్చింది. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నూతనంగా నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొండ పైకి వెళ్లే మెట్లదారిలో విద్యుత్ స్తంభాలను అమర్చి మల్లేశ్వర దేవాలయానికి కొండ పైకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 16, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మడకశిరలోను, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అనంతపురంలోను, పాలీటెక్నిక్ హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

గుదిబండలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

గుదిబండలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

గుదిబండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 346 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 277 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 218 హెక్టార్లు
  • బంజరు భూమి: 648 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2356 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2888 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 117 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

గుదిబండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 117 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

గుదిబండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు

సుష్మాగోపాలకృష్ణ[మార్చు]

వ్యవసాయం లాభసాటి కాదు అనేది ప్రస్తుతం అందరి మాట. తలలు పండిన రైతులే దానిని తలకుం మించిన భారంగా భావిస్తున్న సమయంలో ఒక యువజంట దానినే సవాలుగా తీసుకుని సుభాష్ పాలేకర్ తరహాలో వ్యవసాయాన్ని సాగుబడిగా మార్చింది. లక్షల రూపాయల జీతాన్ని తీసుకుంటున్నా లేని సంతృప్తి, యువతలో స్ఫూర్తి కలిగించడం చాలా విశేషం. ఈ గ్రామంలో వ్యవసాయ భూములున్నా సరైన నీటి సదుపాయం లేక భూములను బీడుగా పెట్టేసినారు. అలాంటి భూములలో అనేక కష్టాలకోర్చి, సిరులు పండించి, చుట్టుప్రక్కల గ్రామాలవారికి గూడా స్పూరి కలిగించి, వారిని గూడా గ్రామంలోనే ఉంచి, వారి చేత గూడా వారి భూములలో లాభసాటిగా వ్యవసాయం చేయించిన ఘనత ఈ యువజంటదే.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గుడిబండ&oldid=4125815" నుండి వెలికితీశారు