అక్షాంశ రేఖాంశాలు: 13°50′N 77°29′E / 13.83°N 77.49°E / 13.83; 77.49

హిందూపురం

వికీపీడియా నుండి
(Hindupur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 13°50′N 77°29′E / 13.83°N 77.49°E / 13.83; 77.49
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండలంహిందూపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం38.16 కి.మీ2 (14.73 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం1,51,677
 • జనసాంద్రత4,000/కి.మీ2 (10,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి986
ప్రాంతపు కోడ్+91 ( 8556 Edit this on Wikidata )
పిన్(PIN)515201 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

హిందూపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరు గల మండలానికి కేంద్రం.

చరిత్ర

[మార్చు]

హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం,రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. మరాఠా యోధుడు మురారి రావు ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన లేపాక్షి హిందూపురం తాలూకా లోనిది. కల్లూరి సుబ్బారావు హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు. ఇచ్చట యల్.జి.బాలకృష్ణన్ సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పించాడు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారు.

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుండి నైరుతి దిశలో 67 కి.మీ దూరంలో, సమీప నగరమైన బెంగుళూరుకు ఉత్తరంగా 104 కి.మీ దూరంలో వుంది.

నీటి సమస్య

[మార్చు]

హిందూపురం లో నీటిసమస్య వుంది. 1000 అడుగుల లోతు తవ్వినా నీరు పడని పరిస్థితికి చేరింది. కావున చుట్టు ప్రక్కల గ్రామాలలోని వ్యవసాయ బోర్ల నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు [2].

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 2,03,538 - పురుషులు 1,02,664 - స్త్రీలు 1,00,874.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
హిందూపురం రైల్వే స్టేషన్ సైన్ బోర్డు దృశ్య చిత్రం
  • జాతీయ రహదారి 44 పై వుంది. పరిగి రహదారి, లేపాక్షి రహదారి, పెనుకొండ రహదారి ఇతర ముఖ్యరహదారులు.
  • రైలు: సౌత్ వెస్ట్రన్ రైల్వే లో భాగంగా, బెంగళూరు-ధర్మవరం జంక్షన్ మార్గం లో హిందూపూర్ రైల్వే స్టేషన్ వుంది. (కోడ్ - 'HUP')

పరిపాలన

[మార్చు]

హిందూపురం పురపాలక సంఘం ద్వారా పట్టణ పరిపాలన జరుగుతుంది.

పరిశ్రమలు

[మార్చు]

హిందూపురం ప్రాంతం బెంగుళూరు లోనికెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రభుత్వం హిందూపురం, పరిగి, కొడికొండ, ఓబుళదేవరచెరువు 'ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం భూసేకరణ చేపట్టింది. [ఆధారం చూపాలి]

  • గోళ్లాపురం వద్ద పరిశ్రమల స్థాపనకు 1100 ఎకరాలకు పైగా ఏపీఐఐసీ సేకరించింది.
  • రాశి ప్రాపర్టీస్‌, ఇండస్ట్రిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 916ఎకరాల్లో, పరిగి మండలంలో వ్యాపార్‌ ఇండస్ట్రియల్‌ పార్కుకోసం 1418 ఎకరాలు సేకరించారు.
  • లేపాక్షి నాలెడ్జి హబ్ చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో సెజ్‌ కోసం 9,428ఎకరాలు సేకరించారు.
  • సైన్స్‌ సిటీ... ఓడీసీ, అమడగూరు మండలాల్లో 640ఎకరాలను సేకరించారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "కన్నీటి.. 'పురం'!". ఈనాడు. 2016-05-27. Archived from the original on 2016-06-02. Retrieved 2016-05-27.

బయటి లింకులు

[మార్చు]