Jump to content

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు

వికీపీడియా నుండి
(Kadha screenplay dharshakathvam appalarraju నుండి దారిమార్పు చెందింది)
కథ చిత్రానువాదం దర్శకత్వం అప్పల్రాజు
దర్శకత్వంరాం గోపాల్ వర్మ
రచనరాం గోపాల్ వర్మ
నీలేష్ గర్కర్
స్క్రీన్ ప్లేనీలేష్ గర్కర్
కథనీలేష్ గర్కర్
నిర్మాతకిరణ్ కుమార్ కోనేరు
తారాగణంసునీల్,
స్వాతి,
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి యక్కంటి
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంకోటి
పంపిణీదార్లుశ్రేయ ఫిల్మ్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 18, 2011 (2011-02-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు 2011 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఇందులో సునీల్ కథానాయకునిగా నటించారు

నేపథ్యం

[మార్చు]

సినిమా పరిశ్రమ గురించి తాను చెప్పదలచుకున్నది చెబుతానని రామ్‌గోపాల్‌వర్మ చేసిన ప్రయత్నమే కథ-అప్పల్రాజు. దర్శకుడు అవ్వాలనుకుని హైదరాబాద్‌ వచ్చే వ్యక్తికి కనబడే కష్టాలు తీశానని అన్నాడు. కానీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఆధిపత్య పోరులో అప్పల్రాజు వంటి దర్శకుడు ఎలా నలిగిపోయాడనే దానిపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు వర్మ.

అమలాపురంలో రంభ అనే థియేటర్‌లో సినిమా చూస్తున్న అప్పల్రాజు (సునీల్‌) కనబడతాడు. తన పక్కనే ఉన్న కృష్ణుడుతో తనదగ్గర ఓ కథ ఉందనీ, ఇటువంటి కథల్ని చూస్తుంటే తన కథ కూడా సినిమా తీయాలని చెబుతాడు. అలా తన ఇంటిలో గొడవ చేసి హైదరాబాద్‌ రైలు ఎక్కుతాడు. తన ఫ్రెండ్‌ సత్యం రాజేష్‌ హీరోగా ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని అతని దగ్గరకెళతాడు. ఇక్కడ పరిస్థితి వివరిస్తాడు. ఎలాగైనా సరే దర్శకుడవ్వాలనుకుంటారు. రాసుకున్న కథకు 'నాయకీ' అని పేరు పెడతాడు. అక్కడ రాంఖీ (రఘుబాబు) అనే బూతు సినిమాల నిర్మాతను కలుస్తాడు. అతనికి కథ వినిపిస్తే అది అలా...అలా... హీరోయిన్‌ కనిష్క (సాక్షి)కి చేరుతుంది. తను రాసుకున్న ట్రాజెడీ సినిమాకు కమర్షియల్‌ హంగులు కలిపి రకరకాల ప్రయోగాలు చేస్తారు చుట్టుప్రక్కలవారంతా. అందులో క్రియేటివ్‌హెడ్‌, డిస్ట్రిబ్యూటర్‌, హీరో, హీరోయిన్‌, శ్రీశైలం అనే రౌడీ (బ్రహ్మానందం).. ఇలా తలో ముక్క జోడించి ఆఖరికి సినిమాను మారుస్తారు. తనకిష్టం లేకపోయినా పరిస్థితుల రీత్యా అప్పల్రాజు లొంగిపోతాడు. రిలీజ్‌నాడు టీవీల్లో నెగెటివ్‌టాక్‌తో విమర్శకులు చర్చాగోష్టీ పెడతారు. మరికాసేపటికి అది హిట్‌ అని ప్రేక్షకులుతీర్పు చెబుతారు. దీంతో తన సినిమా ఇంత హిట్‌ ఎందుకు అయిందో తెలియని అమాయకత్వంతో కూడిన ఫేసు పెడతాడు. అది చిత్రముగింపు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాణం: శ్రేయ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: కోనేరు కిరణ్‌కుమార్‌
  • దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ.

పాటల జాబితా

[మార్చు]

లక్ టూశివ సినిమా, గానం.శ్రీకాంత్

మాయాబజార్ , గానం.శ్రీకాంత్

నాపేరు శ్రీశైలం , గానం.బ్రహ్మనందం

ఎమ్మెట్టి పెంచారే, గానం.గీతామాధురి , సింహా

అన్ బిలీవబుల్ , గానం. స్వాతి రెడ్డి, మైనంపాటి శ్రీరామచంద్ర

రింగ్ రోడ్డు, గానం.హేమచంద్ర , గీతామాధురి

పబ్లిసిటీ, గానం.రంజిత్

కొట్టుకొందాం తిట్టుకొందాం, గానం.కోటి, గీతామాధురి , సాయి

మూలాలు

[మార్చు]
  1. "Sakshi Gulati". IMDb.

బయటి లంకెలు

[మార్చు]