Jump to content

మడకశిర

అక్షాంశ రేఖాంశాలు: 13°56′13″N 77°16′10″E / 13.9369°N 77.2694°E / 13.9369; 77.2694
వికీపీడియా నుండి
(Madakasira నుండి దారిమార్పు చెందింది)
పట్టణం
పటం
Coordinates: 13°56′13″N 77°16′10″E / 13.9369°N 77.2694°E / 13.9369; 77.2694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండలంమడకశిర మండలం
విస్తీర్ణం
 • మొత్తం30.18 కి.మీ2 (11.65 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం21,464
 • జనసాంద్రత710/కి.మీ2 (1,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి981
ప్రాంతపు కోడ్+91 ( 8493 Edit this on Wikidata )
పిన్(PIN)515 301 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata


మడకశిర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం. ఇక్కడగల మడకశిర కోట జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారకం.

చరిత్ర

[మార్చు]
మడకశిర కోటలో ఒక కట్టడం

స్థానిక చరిత్ర ప్రకారం మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి. పూర్వపు గ్రామం ఇప్పుడున్న గ్రామానికి ఆగ్నేయంగా ఉండేది. ప్రస్తుత మడకశిరను మైసూరు శీర నాయకులు కట్టించారు. ఈ వంశాన్ని విజయనగరరాజుల కాలంలో హీర ఉడయరు స్థాపించాడు. చితాల్‌దుర్గ్ ప్రాంతంలో పన్నెండు గ్రామాలు జమీగా పొంది, శీర వద్ద పాతకోటను ఈయనే కట్టించాడు. బీజాపూరు రాజుల దండయాత్రవళ్ల రాజ్యాన్ని కోల్పోయిన వీరికి ప్రత్యామ్నాయంగా రత్నగిరి, మడకశిర ఇవ్వబడ్డాయి.[2] 1520లో స్థానిక నాయకుడు రత్నగిరి సర్జిప్ప రాయప్ప రాజా అడవిని చదును చేసి ఇక్కడ ఒక గ్రామాన్ని, ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించినాడని కథనం.[3] 1728లో మరాఠుల చేతిలోకి వెళ్ళింది. మురారిరావు ఇక్కడ ఒక కోటను, మహలును నిర్మించాడు. హిందూరావుగా పేరొందిన మురారిరావు తండ్రి సిద్ధోజి రావు ఇక్కడే మరణించాడని. తాలూకా ఆఫీసు తూర్పున ఉన్న సమాధి ఈయనదే అని భావిస్తారు.[2] 1762లో మడకశిరను హైదర్ అలీ ఆక్రమించుకున్నారు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంపై హైదర్ అలీ పట్టు క్షీణించడంతో మురారి రావు మడకశిరను తిరిగి చేజిక్కుంచుకున్నడు. తిరిగి 1774లో హైదర్ అలీ ఆధీనంలోకి వెళ్ళి, 1799లో టిప్పు సుల్తాను ఆంగ్లేయుల చేతిలో మరణించేవరకు వారి ఆధీనంలోనే ఉంది. ఇక్కడ చోళరాజు కట్టించిన ఆలయంలో ఒక శాసనం ఉంది. చోళరాజు ఇక్కడ ఆలయం కట్టించాడంటే ఈ గ్రామం 1520కి చాలా పూర్వం నుండి ఉండి ఉండాలి .[3]

భౌగోళికం

[మార్చు]

ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.

జనగణన వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5005 ఇళ్లతో, 21,464 జనాభాతో 3,018 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10,834, ఆడవారి సంఖ్య 10,630.[4]

పరిపాలన

[మార్చు]

మడకశిర నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 11, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల పావగడలో ఉంది. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హిందూపురంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

భూమి వినియోగం

[మార్చు]

2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 723 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 41 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 36 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 60 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 11 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 65 హెక్టార్లు
  • బంజరు భూమి: 951 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1086 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1733 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 370 హెక్టార్లు
    • కాలువలు: 79 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 290 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

వేరుశనగ, శనగ, వరి, దానిమ్మ

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. 2.0 2.1 Anantapur By W. Francis
  3. 3.0 3.1 Lists of the antiquarian remains in the presidency of Madras
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=మడకశిర&oldid=4305285" నుండి వెలికితీశారు