Jump to content

వేలేరుపాడు

అక్షాంశ రేఖాంశాలు: 17°31′23″N 81°14′38″E / 17.523°N 81.244°E / 17.523; 81.244
వికీపీడియా నుండి
(Velerupadu నుండి దారిమార్పు చెందింది)
వేలేరుపాడు
—  రెవెన్యూ గ్రామం  —
వేలేరుపాడు is located in Andhra Pradesh
వేలేరుపాడు
వేలేరుపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°31′23″N 81°14′38″E / 17.523°N 81.244°E / 17.523; 81.244
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
మండలం వేలేరుపాడు

వేలేరుపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం, వేలేరుపాడు మండలానికి ప్రధాన కేంద్రం.ఇది ప్రసిద్డ పుణ్యక్షేత్రం. భద్రాచలం నుండి 60 కి.మీ దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు), కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "List of seven mandals to be included in AP". web.archive.org. 2020-11-01. Archived from the original on 2020-11-01. Retrieved 2021-10-11.

వెలుపలి లింకులు

[మార్చు]