అంకిత్ కొయ్య
అంకిత్ కొయ్య | |
---|---|
జననం | |
విద్య | బి.టెక్ |
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
అంకిత్ కొయ్య తెలుగు సినిమా నటుడు.[1] 2016లో నటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి, సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ముఖ్య పాత్రలలో మెప్పించి ప్రస్తుతం ప్రధాన పాత్రలు పోషిస్తున్నాడు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]అంకిత్ 1995 జూన్ 20న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. సొంత ఊరిలోని టింపనీ స్కూల్ లో పదో తరగతి వరకు చదువు పూర్తిచేసి, విశాఖపట్నం గీతం విశవవిద్యాలయంలో కంప్యూటర్స్ సైన్స్ లో బి. టెక్ చేశాడు. స్కూల్, కాలేజీలలో వీధి నాటకాలు, మూకాభినయ నాటకాలు, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు.[3]
సినిమారంగం
[మార్చు]నటనపై ఆశక్తితో బి.టెక్ చదువుతున్నప్పుడే అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. కెమెరా ముందు మొదటిసారి 2016 ఏప్రిల్ లో అల్లు అర్జున్ తో ' ఓఎల్ఎక్స్' యాడ్ చేసి తన ప్రయాణం మొదలుపెట్టాడు.[4] అంకిత్ వెండితెర మీద మొదటిసారి కనిపించిన సినిమా నాగ చైతన్య, సమంతా కలిసి నటించిన మజిలీ.[5]
నటించినవి
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2016 | ఎదనే వదిలి వెళ్లిపోమాకే | అంకిత్ | షార్ట్ ఫిల్మ్ |
2019 | మజిలీ | మస్తాన్ | |
2019 | అల | స్నేహిత్ | వెబ్ ఫిల్మ్ |
2020 | అశ్వథ్థామ | ||
2020 | జోహార్ | సిద్ధు | వెబ్ ఫిల్మ్[6] |
2021 | తిమ్మరుసు | వాసు గొప్పిశెట్టి | [7] |
2021 | ఊరికి ఉత్తరాన | ||
2021 | శ్యామ్ సింగరాయ్ | ||
2022 | 9 అవర్స్ | నందకుమార్ | వెబ్ సిరీస్ |
2022 | మోడ్రన్ లవ్ హైదరాబాద్ | ఆది | వెబ్ సిరీస్ |
2023 | జిలేబి | బాబీ | |
2023 | గుడ్ ఓల్డ్ డేస్ | సంతోష్ | వెబ్ సిరీస్ |
2024 | సత్యభామ | రిషి | [8] |
2024 | ఆయ్ | హరి | [9][10] |
2024 | మారుతీనగర్ సుబ్రమణ్యం | అర్జున్ | [11] |
2024 | బచ్చల మల్లి | బచ్చల రమణ | చిత్రీకరణలో ఉంది |
2024 | రుద్ర | చిత్రీకరణలో ఉంది | |
2024 | జాన్ సే | చిత్రీకరణలో ఉంది | |
2024 | అదృశ్యం | చిత్రీకరణలో ఉంది | |
2024 | 14 రోజులు జిఫ్ ఇంటిలో | హర్ష | చిత్రీకరణలో ఉంది |
2024 | బ్యూటీ | చిత్రీకరణలో ఉంది |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2018 | సైమా | ఉత్తమ సహాయ నటుడు | ఎదనే వదిలి వెళ్లిపోమాకే (షార్ట్ ఫిల్మ్) | విజేత[12] |
మూలాలు
[మార్చు]- ↑ Rachavelpula, Kausalya (2024-08-18). "Ankith Koyya Plays Allu Aravind's Son and Allu Arjun's Brother in Maruthi Nagar Subramanyam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-18.
- ↑ Dundoo, Sangeetha Devi (2024-09-18). "With 'Aay' and 'Maruthi Nagar Subramanyam', Ankith Koyya secures his place in the sun". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-18.
- ↑ Today, Telangana (2024-08-22). "Ankith Koyya is all in excitement for his next 'Maruthi Nagar Subramanyam'". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-09-18.
- ↑ aithagoni.raju. "అల్లు అర్జున్‌తో ఓఎల్‌ఎక్స్ యాడ్ ఆ కుర్రాడి లైఫ్ టర్న్.. కట్ చేస్తే హీరోగా సినిమా!". Asianet News Network Pvt Ltd. Retrieved 2024-09-18.
- ↑ "Here's who's playing one of Naga Chaitanya's best friends in 'Majili'". The Times of India. 2019-04-04. ISSN 0971-8257. Retrieved 2024-09-18.
- ↑ "Director Krish all praise for Teja Marni's debut film Johaar actor Ankith Koyya". The Times of India. 2020-08-13. ISSN 0971-8257. Retrieved 2024-09-18.
- ↑ H, Murali Krishna C. (2021-07-31). "'Thimmarusu' review: A convoluted thriller weighed down by inconsistent narration". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-18.
- ↑ Dundoo, Sangeetha Devi (2024-06-07). "'Satyabhama' movie review: Kajal Aggarwal delivers solid punches, but the drama is far from riveting". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-18.
- ↑ "Telugu Movie Aay Review: Narne Nithiin, Ankith Koyya Deliver A Performance Worth Watching". News18 (in ఇంగ్లీష్). 2024-08-16. Retrieved 2024-09-18.
- ↑ Dundoo, Sangeetha Devi (2024-08-16). "'Aay' movie review: An enjoyable, lighthearted social drama from the Godavari region". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-18.
- ↑ Harsh, B. H. (2024-08-24). "'Maruthi Nagar Subramanyam' movie review: A relentless, roller coaster comic ride". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-18.
- ↑ Ganguly, Nivedita (2017-06-13). "Vizag boy wins best supporting actor for short film in Siima". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-18.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంకిత్ కొయ్య పేజీ