Jump to content

అనంతపురం నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
అనంతపురం గడియారపు స్థంబపు సెంటరు

అనంతపురం నగరపాలక సంస్థ, అనంతపురం జిల్లా లో అనంతపురం నగరానికి స్థానికి స్వపరిపాలనా సంస్థ.

చారిత్రక నేపధ్యం

[మార్చు]

రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది

నగరపాలనాధికారులు

[మార్చు]
అనంతపురం సప్తగిరి సెంటరు

ఛైర్మన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత... అనంతపురం పురపాలక సంఘం తొలి ఛైర్మన్‌గా మేడా సుబ్బయ్య ఎంపిక అయ్యారు. ఈయన 1952-1959 దాకా పనిచేశారు. 1959-64 మధ్య డీసీ నరసింహారెడ్డి, 1964-66 వరకు ఎంఏ జబ్బార్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఆనాటి నుంచి 1981 ఆగస్టు 12వ తేదీ దాకా 15 మంది ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 1981 ఆగస్టు నుంచి 1983 నవంబరు 28వ తేదీ దాకా అంబటి నారాయణరెడ్డి ఛైర్మన్‌గా పనిచేశారు. 1983 డిసెంబరు 31 నుంచి 1985 ఆగస్టు 27వ తేదీ దాకా ఎన్.రామకృష్ణ, 1985 అక్టోబరు 10 నుంచి 1986 జూన్ 30వ తేదీ దాకా కేసీ నారాయణ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1987 జూలై నుంచి అదే సంవత్సరం మార్చి 31వ వరకు అప్పటి కలెక్టర్ ఐవీ సుబ్బారావు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 1987 నుంచి ఛైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. ఈ ఎన్నికలో అంబటి నారాయణరెడ్డి గెలుపొందారు. 1987 మార్చి 30 నుంచి 1992 మార్చి 31 దాకా పనిచేశారు. ఆ తర్వాత 1995 మార్చి 28 వరకు ప్రత్యేక అధికారి, 1995లో మళ్లీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రభాకర్‌చౌదరి విజయం సాధించి 2000 మార్చి 28 వరకు కొనసాగారు. 2000లో నూరుమహమ్మద్ గెలుపొంది... 2005 మార్చి 28 వరకు పనిచేశారు. 2005 ఏప్రిల్ ఒకటో తేదీన పురపాలక సంఘం నుంచి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. ప్రథమ నగర మేయర్‌గా రాగే పరశురాం పనిచేశారు. 2010 సెప్టెంబరు నాటికి మేయర్ పాలన ముగిసింది. అప్పటి నుంచి 2014 దాకా ప్రత్యేక అధికారి పాలనలోనే సాగింది.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]