అనపర్తి
అనపర్తి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°56′2″N 81°57′22″E / 16.93389°N 81.95611°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | అనపర్తి |
విస్తీర్ణం | 18.07 కి.మీ2 (6.98 చ. మై) |
జనాభా (2011) | 26,788 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 13,342 |
• స్త్రీలు | 13,446 |
• లింగ నిష్పత్తి | 1,008 |
• నివాసాలు | 7,833 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08857 ) |
పిన్‌కోడ్ | 533342 |
2011 జనగణన కోడ్ | 587541 |
అనపర్తి (అనపఱ్ఱు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మండపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7833 ఇళ్లతో, 26788 జనాభాతో 1807 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 13342, ఆడవారి సంఖ్య 13446. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3224 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 211. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587541[2].పిన్ కోడ్: 533342.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,533. ఇందులో పురుషుల సంఖ్య 12,856, మహిళల సంఖ్య 12,677, గ్రామంలో నివాసగృహాలు 6,545 ఉన్నాయి.
గ్రామ విశేషాలు
[మార్చు]పచ్చని పొలాలతో అందంగా ఉండే ఈ గ్రామం ఒకప్పుడు స్మగుల్ చేయబడిన పరికరాలు (వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి) వ్యాపారానికి ప్రసిద్ధి. క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాలకు సామాన్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఎల్ కె జి నుండి, డీగ్రి, బీఇడీ, ఎమ్ సి ఎ, ఎమ్ బి ఎ, నర్సింగ్ కాలేజీలతో ముఖ్య విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గ్రామం జనాభాలో అధికంగా రెడ్డి కులస్తులు ఉన్నారు. వడ్డీ వ్యాపారం ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగి ఉంది. రైల్వేస్టేషను నుండి దేవి చౌక్‌వరకు వున్న వూరును కొత్తవూరని, కాలువ అవతలనుండి పొలమూరు వైపు వున్న వూరును పాతూరు అని అంటారు.దాదాపు ముపై ఏళ్ళక్రితం పెంకుటిళ్ళు ఎక్కువగా వుండేవి. ప్రస్తుతం వాటిస్థానాన్ని డాబాలు, ఆపార్టుమెంటులు ఆక్రమించాయి. లిప్టు సౌకర్యం ఉన్న అపార్టుమెంటుకూడా ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి.2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల మల్ల్లంపూడిలో ఉంది. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్ రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొమరిపాలెంలోను, అనియత విద్యా కేంద్రం రాజమండ్రిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]అనపర్తిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 16 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఏడుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. 14 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]అనపర్తిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉందిరాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
రైల్వే ష్టేషను
[మార్చు]ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్‌లో చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్ళు (గోదావరి ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, బొకారో ఎక్స్‌ప్రెస్, పూరి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాకినాడ పాసింజర్, కాకినాడ-తిరుపతి పాసింజర్, మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్, విజయవాడ-విశాఖపట్నం పాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం పాసింజర్, రాయగడ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు) ఆగుతాయి.కంప్యూటరు రిజర్వేషను సౌఖర్యం ఉంది.ఈ మధ్యకాలంలో స్టేషనును అధునీకరించారు. స్టేషను ప్లాట్‌ఫారం ఎత్తు, పొడవు పెంచారు.
బస్‌స్టాండు
[మార్చు]అనపర్తి నియోజకవర్గానికి కేంద్రం అయినప్పటికి సరైన బస్‌స్టాండు లేదు. దేవిచౌక్‌వద్దనున్న రాజమండ్రి-కాకినాడ రోడ్దుమీదనే బస్సులను ఎక్కడం, దిగడం జరుగుచున్నది. 6 సంవత్సరాల క్రితం RTC వారు బస్‌స్టాండును నిర్మించినప్పటికి అది ఊరికి అర కిలోమీటరు దూరంగా ఉండటంవలన, ఊరిలోనికి, బస్‌స్టాండుకు వెళ్ళుటకు రిక్షాలు అందుబాటులో లేకపోవడం వలన ప్రయాణీకులు దేవిచౌక్ వద్దనే బస్‌ఎక్కడం వలన, బస్‌స్టాండు నిరుపయోగంగా మారడం వలన, దానిని న్యాయశాఖకు బదలాయించారు. ఎమ్మెల్యే నిధులతో ప్రస్తుతం దేవి చౌక్‌ఎదురుగా బస్‌షెల్టరు నిర్మించారు.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]అనపర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 236 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 93 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1477 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 388 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1088 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]అనపర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 969 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 59 హెక్టార్లు
- చెరువులు: 59 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]అనపర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
పరిశ్రమలు
[మార్చు]ITC వారి పొగాకు పరిశ్రమ కూడా ఉంది. రైసుమిల్లులు, కోళ్ళఫారాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. తవుడు నుండి నూనె తీసేవి, తవుడునూనెను శుద్ధి చేసేవీ పరిశ్రమలు రెండు ఉన్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]దేవాలయాలు
[మార్చు]వీరుళ్ళమ్మ గుడి
[మార్చు]అనపర్తిలో ప్రతిఏడు వీరుళ్ళమ్మ జాతరమరియు బాపనమ్మ జాతర చాలా వైభవంగా చేస్తారు. వీరుళ్ళమ్మ జాతర సంక్రాంతి సమయంలో చేస్తారు.వారంరోజుల పాటు జాతర వుంటుంది.రైల్వేస్టేషను నుండి మైయిన్‌రోడ్డు వద్దనున్న దేవి ఛౌక్‌వరకు రోడ్డుకు ఇరువైపుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. తినుబండారాల దుకాణాలు (జీళ్ళు, పంచదార చిలకలు తదితరాలు) పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అర్కెస్ట్రా నిర్వహణ వుంటుంది. అమ్యూజ్మెంట్‌పార్కుల ఏర్పాటు వుంటుంది. వీరుళ్ళమ్మ జాతరకు అనపర్తి గ్రామ పరిసరగ్రామాలనుండి జనం తండోపతండాలుగా వస్తారు. చివరిరోజున బాణసంచా పేలుస్తారు.
ఇతర ఆలయాలు
[మార్చు]- అయ్యప్ప గుడి
- సాయి మందిరం
- రామాలయం
- ఉమామహేశ్వర ఆలయం
- వీరుళ్లమ్మ గుడి
- బాపనమ్మ ఆలయం
- జనార్ధనస్వామి ఆలయం
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ( వీర్రాజు మావుళ్లు అని ప్రసిద్ధి )
సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]'జాహ్నవి'వారు ప్రతినెల మొదటివారంలో నాటక-నాటిక లేదా ఎదైన లలితకళలకు చెందిన కార్యక్రమాన్ని నిర్హహిస్తారు. పంచాయతి గ్రంథాలయంప్రక్కనే తేతలి రామారెడ్ది-మంగాయమ్మ కళావేదిక ఉంది.
సినిమా థియేటరులు
[మార్చు]మూడు సినిమా హాల్ లున్నాయి. 1.పద్మశ్రీ 2.సత్యగౌరి A/c Dts, 3.సూర్యశ్రీ A/c Dts పద్మశ్రీ టాకీస్ నిర్మించి ముప్పై సంవత్సరాలైనది.సినిమాహల్ కాంపౌండ్ మీదుగా ఫ్లైఒవరు బ్రిడ్జి నిర్మించడం వలన హల్‌ను మూసివేశారు.
విద్యా సంస్థలు
[మార్చు]- 1.GBR (గొలుగూరి బాపిరాజు) విద్యాసంస్థలు (కేజీ నుంచి పీజీ వరకు ఉంది)
- 2.T.A.R. Talent School.
- 3.MNR విద్యాసంస్థలు ( సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్, Mnr జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ)
- 4.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
- 5.Narayana school & college.
- 6.sri chitanya e techno school
- 7.మహర్షి విద్యానికేతన్
- 8.లావణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్
వైద్య సదుపాయం
[మార్చు]- 1.ప్రభుత్వ వైద్యశాలవున్నది.ఇన్‌పేసెంట్ (పడకలనుకల్గి) వున్నది.
- 2.నారాయణ కంటి హస్పటల్:గత ముప్పై, నలభై ఏళ్ళగా ఈ ప్రాంతంలో పేరున్న వైద్యశాల.డా.సత్యనారాయణరెడ్ది గారు తన తండ్రి పేరుమీద ఈ హస్పిటల్‌ను నిర్మించారు.ఈ జిల్లానుండే కాకుండగా పక్కజిల్లాలనుండికూడా రోగులు వస్తుంటారు.ఇన్ పెసెంట్ సదుపాయం ఉంది.
- 3.కర్రిబాపిరెడ్ది గారి నర్సింగ్‌హోమ్:డా, కర్రిబాపిరెడ్ది గారు గతంలోITC లో డాక్టరుగా ఉన్నారు. ఈయన ఫీజు పేదప్రజలకు అందుబాటులో వున్నందున గ్రామీణులు ఇక్కడకే వస్తుంటారు.
- గంగిరెడ్డి నర్సింగ్ హోమ్: రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉంది.ఇన్ పెసెంట్ సదుపాయం ఉంది.
- 4.పద్మావతి నర్సింగ్‌హోమ్:గర్భిణి మహిళలకు చెందిన రుగ్మతలకు వైద్యసదుపాయం అందించే ఆసుపత్రి.E.S.I సదుపాయం ఉంది.
- 5.K.A.R.ఆర్థోపెడిక్ హస్పిటల్:నూతనంగా (2012) ప్రారంభీంచిన హస్పిటల్.
- 6.Sagar children hospital (సాగర్ చిన్నపిల్లల ఆసుపత్రి)
- 7. CDR hospital ( ఇంతకు మునుపు రాము ఆసుపత్రిగా ప్రాచుర్యం పొందింది .. అతని మరణాంతరం కొత్త ఆసుపత్రి పెట్టి నడుపుచున్నారు)
- 8.షణ్ముఖ్ డెంటల్ కేర్
బ్యాంకులు
[మార్చు]అనపర్తిలో వున్నబ్యాంకులు
- 1.స్టేట్‌బ్యాంక్‌ఆఫ్ ఇండియా
- 2.స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా2
- 3.యునియన్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆంధ్రాబ్యాంక్)
- 4.ICICI బ్యాంక్
- 5.జిల్లా సహకారబ్యాంక్‌శాఖ
- 6.బ్యాంక్ అఫ్ ఇండియా
- 7.కెనరా బ్యాంక్
- 8.HDFC Bank
- 9.ది జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
- 10.యునియన్ బ్యాంక్ ఆప్ ఇండియా (కార్పొరేట్ బ్యాంక్)
- 11.DCB బ్యాంక్
- 12.ముత్తూట్ ఫైనాన్స్
ఇతరాలు
[మార్చు]1.C.I.స్థాయి పోలిసు స్టేషను ఉంది.
2.ఫైర్ స్టేషను ఉంది
3.జూనియర్ సివిల్ కోర్ట్ ఉంది
ప్రముఖులు
[మార్చు]- తేతలి సూర్యనారాయణ మూర్తి ( గ్రామ మునసీబు)
- గొలుగురి బాపిరాజు ( విద్యా దాత, పూర్వపు గ్రామ సర్పంచ్ )
- గొలుగురి రెడ్డి ( రాజకీయవేత్త )
- ద్వారంపూడి రాధా కృష్ణ రెడ్డి ( పూర్వపు గ్రామ సర్పంచ్ )
- ద్వారంపూడి వెంకట రెడ్డి ( పారిశ్రామికవేత్త )
- గొలుగురి బాపిరాజు ( గ్రామ సర్పంచ్ )
- తేతలి రామారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
- నల్లమిల్లి మూలారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
- నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి (పూర్వపు గ్రామ సర్పంచ్)
- నల్లమిల్లి శేషారెడ్డి (2009 ఎమ్మెల్యే పూర్వపు శాసనసభ్యులు )
- నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ( 2014 ఎమ్మెల్యే, పూర్వపు శాసనసభ్యలు )
- డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి ( ప్రస్తుత శాసనసభ్యులు 2019 )
- పడాల వెంకటరామారెడ్డి (రాము) (రాజకీయవేత్త )
- కర్రి ధర్మారెడ్డి దొరబాబు ( జెడ్ పి టి సి పూర్వపు సభ్యులు )
- సబ్బెళ్ల అమ్మి రెడ్డి (అమ్మి రెడ్డి ఆయిల్స్ అధినేత )
- కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి ( బీజేపీ లీడర్ )
- డా. తేతలి సత్యనారాయణ రెడ్డి ( ప్రముఖ వైద్యులు, నారాయణ కంటి ఆసుపత్రి అధినేత )
- తేతలి రాధాకృష్ణారెడ్డి (పారిశ్రామికవేత్త)
- కర్రి సూర్య ప్రకాష్ రెడ్డి (పారిశ్రామికవేత్త)
- తాడి రామగుర్రెడ్డి (ప్రభుత్వ వైద్యులు డయాబెటిస్ స్పెషలిస్ట్)
- కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణులు
- తేతలి ఆదిరెడ్డి ( కొండబాబు) (జీబిఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్, సెక్రటరి)
- మల్లిడి అనంతసత్యనారాయణరెడ్డి (ఎమ్.ఎన్.ఆర్ విద్యాసంస్థల అధినేత)
- సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) (రాంబాబు యువసేన, బ్లడ్ డోనోర్స్ యాప్ వ్యవస్థాపకులు, వైసీపీ నాయకులు)
- నల్లమిల్లి మురళీమోహనబాల కృష్ణారెడ్డి (వైసీపీ నాయకులు)
- మల్లిడి ఆదినారాయణరెడ్డి (వైసీపీ నాయకులు)
- వల్లూరి రామకృష్ణ చౌదరి మాజీ శాసనసభ్యులు
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".