ఆత్మకూరు (ఎం) మండలం
ఆత్మకూరు (ఎం) మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, ఆత్మకూరు (ఎం) మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′21″N 79°07′59″E / 17.472502°N 79.132919°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | ఆత్మకూరు (ఎమ్) (యాదాద్రి భువనగిరి) |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 39,194 |
- పురుషులు | 19,898 |
- స్త్రీలు | 19,296 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.14% |
- పురుషులు | 63.25% |
- స్త్రీలు | 38.93% |
పిన్‌కోడ్ | 508111 |
ఆత్మకూరు (ఎం) మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] ఆత్మకూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,194 - పురుషులు 19,898 - స్త్రీలు 19,296. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 29,479. జనాభాలో పురుషులు 14,979 కాగా, స్త్రీల సంఖ్య 14,500. మండలంలో 7,401 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కొరటికల్
- మొరిపిరాల
- సర్వేపల్లి
- రైపల్లి
- ఆత్మకూరు (ఎమ్)
- రహీంఖాన్‌పేట్
- కాప్రాయిపల్లి
- కూరెల్ల
- తుక్కపూర్
- పల్లెర్ల
- లింగరాజ్‌పల్లి
- రాఘవపూర్
- కల్వపల్లి
- సింగారం
- పల్లెపహడ్
- పారుపల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.