ఆదిలాబాద్ బస్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిలాబాద్ బస్ స్టేషన్,తెలంగాణ రాష్ట్రం,ఆదిలాబాద్ జిల్లా, కేంద్రంలోని విద్యానగర్ లో ఉంది.ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ కి బస్సుల నిలుపుట,నిర్వహణ, మరమత్తుల కొరకు ప్రక్కనే బస్సు డిపో కూడా ఉంది. ఈ బస్ స్టేషన్ నుండి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు బస్సులను కూడా నడుపుతుంది[1] [2][3].

ఆదిలాబాద్ బస్ స్టేషన్
ఆదిలాబాద్ బస్ స్టేషన్ లో ఆదిలాబాద్-హైదరాబాద్ బస్సు
సాధారణ సమాచారం
Locationఆదిలాబాదు, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
భారత దేశము
యజమాన్యంతెలంగాణ ప్రభుత్వం
నిర్వహించువారుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
Bus routesతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర
Bus standsఆదిలాబాద్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణిక ( నేలమీద )
ఇతర సమాచారం
స్టేషను కోడుADB
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

[మార్చు]

TSRTC సురక్షితమైన బస్సు సేవా లకు ప్రసిద్ధి. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇచ్చేలా వారు కఠినమైన నిర్వహణ ,భద్రత ప్రమాణాలను అనుసరిస్తారు. బస్సు సర్వీసులు ఖచ్చితమైన షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాత్రికులకు,పర్యాటకుల ప్రయాణ అవసరాలను తీరుస్తుంది. ఆదిలాబాదు సందర్శించే వారు ఖచ్చితంగా బస్సు ప్రయాణాన్ని ఎంచుకోండి.

ఆర్టీసీ డిపో

[మార్చు]

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో నాలుగు ఏసీలు,రెండు నాన్ ఏసీలు లహరి బస్సు సర్వీసులను ప్రారంభించడం జరిగింది. సూదూరు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బస్సులు స్లీపర్ కమ్ సీటర్ బస్సులుగా పని చేస్తున్నాయి. ఒక్కోక్క బస్సులో 48 సీట్లు ఉన్నాయి. ఒకే సారి ఈ బస్సులో గరిష్టంగా 48 మంది ప్రయాణం చేయవచ్చును.

బస్సు సర్వీసులు

[మార్చు]

ఆదిలాబాదు జిల్లాల్లో బస్సు ప్రయాణం ఒక ముఖ్య మైన రవాణా మార్గం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రో జిల్లాజు ఈ జిల్లా కేంద్రం నుండి హైదరాబాదు,గుంటూరు,వరంగల్,కరీంనగర్,హనుమకొండ,విజయవాడ, నిజామాబాద్, గోదావరిఖని బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మహారాష్ట్రలోని పలు ముఖ్య పట్టణాలకు బయలు దేరుతున్నాయి. ఆదిలాబాద్ నుండి పాండర్ కవడా,వని అకోలా,అమరావతి, యావత్మాల్,ముఖద్బన్,ఉమర్ ఖేడ్, డిగ్రెస్,మహూర్,పూసద్, అరణి, కిన్వట్, చంద్రపూర్,గడచాందుర్, రాజురా,మాండ్వి మొదలగు పట్టణాలకు బయలు దేరుతాయి. ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్, నిర్మల్,ఉట్నూర్,మంచిర్యాల,సిర్పూర్ కాగజ్ నగర్,బెల్లంపల్లి, కరంజి,అందర్ బంద్,గిమ్మ,పిపల్ దరి,లోకారి,గాదిగూడ,సింగిడి,కరంజి ,భరంపూర్ ,అర్లి ,పెండల్ వాడ,కౌఠా, దీపాయి గూడ,కూరా,కోసాయి ,సిరిచల్మ తంబి ,బెర్హం పూర్ ,బోథ్ బెల, పంధరవాడ,వంటి ఇతర ప్రధాన నగరాలకు కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలకు కలుపబడి ఉంది. ఇక్కడ నుండి పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్,డిలక్స్,సూపర్ లగ్జరీ, ఇంద్ర ,గరుడ బస్సులు అందుబాటులో ఉన్నాయి[4][5].

మూలాలు

[మార్చు]
  1. "TSRTC Adilabad Bus Stand, Vidya Nagar". www.mappls.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-13.
  2. "APSRTC Adilabad Bus Station | Adilabad Bus Station Map". www.onefivenine.com. Retrieved 2024-07-13.
  3. Correspondent, Special (2019-10-05). "RTC runs nearly 60 % services in Adilabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-07-13.
  4. "Discover The Best Adilabad Bus Timings 2024 For Hassle-Free Travel" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-11. Archived from the original on 2024-07-13. Retrieved 2024-07-13.
  5. "Discover The Best Adilabad Bus Timings 2024 For Hassle-Free Travel" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-11. Archived from the original on 2024-07-13. Retrieved 2024-07-13.