ఆర్యసమాజ్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆర్యసమాజము
[మార్చు]- ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న, బొంబాయి (ముంబాయి) లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
- ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడింది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా,, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీనిముఖ్యఉద్దేశము.
ముఖ్యోద్దేశ్యము
[మార్చు]- ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్వం తో విశ్వమార్యం ", అనగా.. సమసమాజ స్థాపన.
- ఆర్యసమాజనికి మూలమువేదాలు, వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోడీకరించారు.
- ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట, ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
- ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, బ్రిటన్, నెదర్ల్యాండ్స్, కెన్యా, టాంజేనియా, దక్షిణ ఆఫ్రికా, మారిషియస్, పాకిస్తాన్, బర్మా, సింగాపుర్, హంగ్‌కాంగ్ లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
- ఆర్యసమాజము వేదాలు, ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త, అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించింది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత, రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
సమాజములో ఆర్యసమాజము
[మార్చు]- వేదాలు చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన భారతీయ సంస్కృతి ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భిన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
- మూర్తిపూజ, హిందు సంస్కృతి పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం సమర్ధించదు.
- స్త్రీ లకు, హరిజనులకు స్వాతంత్ర్యం, విద్యను సమర్థిస్తుంది.
- దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించింది.
- స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
- మూర్తి పూజ, నరబలి, సతి సహగమనము - వీటిని నిరసించును.
- సమస్త సత్య విద్యల గ్రంథమైన " సత్యార్థ ప్రకాశ్ "ను ప్రచారము చేసినది.
- భారత వర్షాన్ని విస్తృత , సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము ప్రాశ్చాత్యులను అనుకరించడము లేదా నవీన ఆలోచనావిధానాలు కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
- సమాజ్ లక్ష్యం భారత దేశానికి సాంఘిక , ధర్మ సంస్కరణ
- సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
- హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు , హిందు లౌకికవాదులకు దూరమైనది.
- భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణకలిగించినది.
- ఆర్యసమాజ్ శాఖల పరిధులలోని యువకులతో ఆర్యవీర్ దళ్‌ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, యోగాభ్యాసంలో శిక్షణ ఇచ్చేవారు.
బృహత్కార్యములు
[మార్చు]- అజ్ఞానము, దారిద్ర్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యాచరణ కై పది సూత్రాలను క్రోడీకరించినది.
- నాలుగు వేదాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
- భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాళుడు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
- ఓంకారమే నినాదముగా, " సత్యార్థ ప్రకాశ్ "ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
- విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారతదేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
- సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
- వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రోత్సహిస్తున్నారు.
వైదిక దినచర్య
[మార్చు]- ప్రాత ః స్మరణ
- సంధ్యా వందనము (గాయత్రీ మంత్రముతో మొదలవుతుంది)
- హవనము
- భజనలు
- సత్సంగము
ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు
[మార్చు]ఆర్యసమాజ ప్రముఖులు
[మార్చు]- మహర్షి స్వామి విరజానంద సరస్వతి (దయానంద సరస్వతి గురువు)
- మహర్షి స్వామి దయానంద సరస్వతి (ఆర్యసమాజ్ స్థాపకుడు)
- స్వామి రామానందతీర్థ
- శ్రద్ధానంద సరస్వతి
- పండిత గోపదేవ్ శాస్త్రి
- పండిత్ నరేంద్రజీ