ఊర్వశివో రాక్షసివో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊర్వశివో రాక్షసివో
దర్శకత్వంరాకేశ్ శశి
రచనరాకేశ్ శశి
నిర్మాతధీరజ్ మొగిలినేని
తారాగణం
ఛాయాగ్రహణంతన్వీర్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థలు
జీఏ2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీs
2022 నవంబరు 4 (2022-11-04)(థియేటర్)
2022 డిసెంబరు 9 (2022-12-09)(ఆహా ఓటీటీ)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ఊర్వశివో రాక్షసివో 2022లో విడుదలైన తెలుగు సినిమా. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్‌, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 29న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 31న విడుదల చేసారు.[3] సినిమా నవంబర్ 4న విడుదలైంది.[4]

కథ[మార్చు]

శ్రీకుమార్ (అల్లు శిరీష్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆఫీసులో కొత్తగా చేరిన సింధూజ (అనూ ఇమ్మాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు. శ్రీకుమార్ పెళ్లి చేసుకుందామని అంటే కొన్నాళ్లు సహజీవనం చేద్దామని అంటుంది. దింతో తన ఇంటికి దగ్గరలోనే ఇద్దరు ఇళ్లు తీసుకొని సహజీవనం ప్రారంభిస్తారు. శ్రీకుమార్ తల్లి (ఆమని) అతనికి పెళ్ళి చేయడమే లక్ష్యంగా బతుకుతుంది. తల్లి కోసం శ్రీ పెళ్లి చేసుకున్నాడా? సింధూజతో సహ జీవనం చేశాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

అతిధి పాత్రల్లో[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జీఏ2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: ధీరజ్ మొగిలినేని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాకేశ్ శశి[6]
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: తన్వీర్
  • ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
  • పాటలు: కాసర్ల శ్యామ్, పూర్ణచారి

పాటలు[మార్చు]

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మాయారే"  రాహుల్ సిప్లిగంజ్ 3.45
2. "దీంతననా"  సిద్ శ్రీరామ్[7] 3.36

మూలాలు[మార్చు]

  1. Eenadu (2 December 2022). "ఓటీటీలో 'రామ్‌సేతు'.. 'ఊర్వశివో రాక్షసివో' ఎప్పుడంటే?". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  2. "రొమాంటిక్ జోష్ లో శిరీష్.. ఊర్వశివో రాక్షసివో నుంచి టీజర్ రిలీజ్..!". 29 September 2022. Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
  3. "ఫన్, ఎంటర్‌టైనింగ్‌గా 'ఊర్వసివో రాక్షసివో' ట్రైలర్‌..!". 31 October 2022. Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  4. Eenadu (31 October 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  5. Eenadu (7 December 2022). "రివ్యూ: ఊర్వశివో రాక్షసివో". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  6. Andhra Jyothy (4 November 2022). "రొమాన్స్‌ హద్దులు దాటదు" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
  7. "ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు" (in ఇంగ్లీష్). 7 October 2022. Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.

బయటి లింకులు[మార్చు]