Jump to content

ఎ. సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
A. C. Subba Reddy Government Medical College
ఎ. సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం2014
వైస్ ఛాన్సలర్డాక్టర్ సి.వి. రావు
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ N. ప్రభాకర్‌రావు
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లు
స్థానందర్గామిట్ట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

ఎ. సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ వైద్య కళాశాల 2014 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం (ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) నకు అనుబంధంగా ఉంది. నీట్ పరీక్ష ద్వారా ఇందులో వైద్య విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం 150 ఎంబిబిఎస్ సీట్లును నీట్ పరీక్ష ఆధారంగా కేటాయిస్తారు. ఈ కళాశాలకు ప్రముఖ నాయకుడు, నెల్లూరుజిల్లా మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనం చెంచు సుబ్బారెడ్డి పేరు పెట్టారు.[1]

చరిత్ర

[మార్చు]

నెల్లూరులోని దొడ్ల సుబ్బారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి 1963 నుండి 1968 వరకు నిర్మించబడింది. DSR జిల్లా కేంద్ర హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి చేత శంకుస్థాపన చేయబడింది. DSR జిల్లా కేంద్ర హాస్పిటల్ ను 1968 డిసెంబరు 18 న కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.[2] దొడ్ల సుబ్బారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి ఆవరణలోనే ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించబడింది.

క్యాంపస్

[మార్చు]

ఈ ప్రాంగణం 67.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. M.B.B.S విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మౌలిక సదుపాయాలు, పరికరాలు, అధ్యాపకులు వంటి అన్ని సౌకర్యాలు ఈ కళాశాలకు లభించాయి.

మూలాలు

[మార్చు]
  1. "About A.C. Subba Reddy". The Hindu. Archived from the original on 17 ఆగస్టు 2015. Retrieved 6 June 2019.
  2. "About ACSR Govt. Medical College". www.acsrgmcnlr.edu.in. Archived from the original on 6 జూన్ 2019. Retrieved 6 June 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]