Jump to content

కరీనా కపూర్

వికీపీడియా నుండి
కరీనా కపూర్ ఖాన్
కరీనా కపూర్ 2016 లో టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డ్ ల వేడుకలో
జననం
కరీనా కపూర్

1980
ఇతర పేర్లుకరీనా కపూర్
వృత్తినటి
జీవిత భాగస్వామిసైఫ్ అలీ ఖాన్
పిల్లలు2
తల్లిదండ్రులురణధీర్ కపూర్ (తండ్రి),
బబితా కపూర్ (తల్లి)

కరీనా కపూర్ (జననం 21 సెప్టెంబర్, 1980) బాలీవుడ్ నటి. నటులు రణధీర్ కపూర్, బబితాల కుమార్తె, కరిష్మా కపూర్ చెల్లెలు ఆమె. రొమాంటిక్ కామెడీల నుంచీ క్రైం డ్రామాల వరకూ ఎన్నో రకాల సినిమాలు చేసిన కరీనా, ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె ఆరు ఫిలింఫేర్ పురస్కారాలను పొందారు. ఆమె బాలీవుడ్ లో ప్రముఖ నటి, ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.[1]

2000లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె ఒకేలాంటి ప్రాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక, ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. 2004 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలతో పాటు, ఓంకారాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. 2007లో నటించిన జబ్ వియ్ మెట్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి, 2010లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా.  ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్ (2009), బాడీగార్డ్ (2011), రా.వన్ (2011), భజరంగీ భాయీజాన్ (2015) సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 2009లో నటించిన కుర్బానా, 2012లో చేసిన హీరోయిన్ సినిమాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె.

నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు  కరీనా. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా  ఆమె చాలా ప్రముఖమైన నటి.  కరీనా స్టేజ్  పెర్ఫార్మెన్స్  లు కూడా ఇస్తారు. అంతే కాక ఆమె మూడు పుస్తకాలు సహ రచయిత కూడా ఒకటి తన జీవిత చరిత్ర కాగా,  రెండు పోషకవిలువలకు సంబంధించిన పుస్తకాలు.  అంతర్జాతీయ బ్రాండ్ గ్లోబస్ తో కలసి ఆమె స్వంతంగా ఒక బట్టల బ్రాండ్ ను ప్రారంభించారు.

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం

[మార్చు]
Kareena and Karisma Kapoor with their mother Babita
విలేఖరి వీర్ సంఘవీకి ఇచ్చన ఇంటర్వ్యూలో తల్లి బబిత (ఎడమ), అక్క కరిష్మా కపూర్ లతో కరీనా.

21 సెప్టెంబరు 1980న ముంబైలో పంజాబీ హిందువులైన నటుడు  రణధీర్ కపూర్, బబితలకు జన్మించారు కరీనా.[2][3] ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత (తండ్రికి తండ్రి) రాజ్ కపూర్ ప్రముఖ బాలీవుడ్  నటుడు. కరీనా తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమె చదివిన అన్న కరెనినా పుస్తకం పేరునే మార్చి కరీనా అని పేరు పెట్టారట.[4] ఆమె తండ్రి పంజాబీ, తల్లి సింధీ-బ్రిటిష్ కుటుంబానికి చెందినవారు.[5] చిన్నతనంలో తమ కుటుంబంతో కలసి హిందూ పూజలలో ఎక్కువగా పాల్గొన్న ఆమె, తల్లితో కలసి క్రిస్టియన్ సంప్రదాయాలనూ పాటించేవారు.[6]

తను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లననీ, ఇంటినిండా నటులే కావడంతో సినిమాలపై ఎక్కువ ఆసక్తి కలిగిందనీ వివరిస్తారు కరీనా. నటి నర్గీస్, మీనా కుమారి తనకు ఆదర్శమని తెలిపారు ఆమె. నటుల కుటుంబమే అయినా ఆడవారు సినిమాల్లోకి రావడానికి తన తండ్రికి అంతగా ఇష్టం లేదని అంటారు కరీనా.[7] ఈ గొడవతోనే ఆమె తల్లితండ్రులిద్దరూ  విడిపోయారు.[8] అందుకే ఆమె తల్లి పెంపకంలో పెరిగారు. 1991లో కరిష్మా సినిమాల్లోకి వచ్చేవరకు బబితా వివిధ పనులు చేసి వారిని పోషించారు.[9] చాలా ఏళ్ళు విడిగా ఉన్న తరువాత కరీనా తల్లిదండ్రులు అక్టోబరు 2007లో తిరిగి ఒకటయ్యారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ "తండ్రి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనవారు. చాలా ఏళ్ళు ఆయనతో కలసి మేం ఉండకపోయినా, ఇప్పుడు మేం ఒక కుటుంబం అయ్యాం" అని వివరించారు.

ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్ లోనూ, డెహ్రాడూన్ లోని వెల్హం గర్ల్స్ స్కూల్ లోనూ చదువుకున్నారు.[10] ఆమె తన తల్లిని తృప్తి పరిచేందుకు మాత్రమే స్కూల్ కు వెళ్ళేవారట. గణిత శాస్త్రం తప్ప తనకు అసలు చదువంటే పెద్దగా ఇష్టం ఉండదని చెప్తారు కరీనా. ముంబైలో మిథిబై కళాశాలలో రెండేళ్ళు కామర్స్ చదివారు.[10] ఆ తరువాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మైక్రో కంప్యూటర్స్ లో మూడు నెలల సమ్మర్ కోర్సు చేశారు కరీనా.[10] నెమ్మదిగా న్యాయ శాస్త్ర విద్య వైపు మక్కువ పెంచుకున్న ఆమె ముంబై ప్రభుత్వ లా కళాశాలలో చేరారు. అలా నెమ్మదిగా చదువుపై ఇష్టం పెంచుకున్నారు.[10] కానీ ఒక సంవత్సరం చదివాకా తనకు ఇష్టమైన నటన వైపు కెరీర్ మలచుకోవాలని భావించి చదువు మధ్యలోనే వదిలేశారు కరీనా.[11] ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సభ్యుడైన కిశోర్ నమిత్ కపూర్ నేతృత్వంలో నడుపుతున్న యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు ఆమె.[12]

నటనా కెరీర్

[మార్చు]

2000–03: కెరీర్ తొలినాళ్ళు, మొదటి హిట్

[మార్చు]

ట్రైనింగ్ లో ఉన్నప్పుడే హృతిక్ రోషన్ నటించిన కహో నా.. ప్యార్ హై (2000) సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే మొదట్లో ఒప్పుకున్నా, తరువాత సినిమా నుంచి తప్పుకున్నారు ఆమె. అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఈ సినిమాలో అక్రమంగా పాక్ కు తరలింపబడే అభిషేక్ తో ప్రేమలో పడే బంగ్లాదేశ్ యువతిగా నటించారు ఆమె. ఈ సినిమాలోని ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.[13][14] ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.[15] ఈ సినిమాకు ఫిలింఫేరు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు.[16]

సినిమాలు, అవార్డులు

[మార్చు]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

కరీనా మొత్తం 6 ఫిలింఫేర్ పురస్కారాలు, 10 నామినేషన్లు  పొందారు.రెఫ్యూజీ సినిమాలోని నటనకు 2000లో ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం గెలుచుకున్నారు. చమేలీ (2003) సినిమాకు ప్రత్యేక జ్యూరీ గుర్తింపు అందుకున్నారు. దేవ్ (2004), ఓంకారా (2006) సినిమాల్లోని నటనకు విమర్శకుల ఉత్తమ నటి పురస్కారం లభించాయి ఆమెకు. జబ్ వియ్ మెట్ (2007) సినిమాకు ఉత్తమ నటి, వియ్ ఆర్ ఫ్యామిలీ (2010) సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా.


ఇవి కూడ చూడండి

[మార్చు]

కంబఖ్త్ ఇష్క్

మూలాలు

[మార్చు]
  1. Saini, Minakshi (18 September 2012).
  2. Verma, Sukanya (30 October 2002).
  3. "Star of The Week-Kareena Kapoor".
  4. IndiaFM News Bureau (29 December 2004).
  5. Upala KBR (23 December 2008).
  6. "Sajid beats Saif to the altar – After civil marriage, a suspense at play".
  7. (Chatterjee, Deenvi & Nihalani 2003, p. 483)
  8. Lalwani, Vickey (10 October 2007).
  9. Thakraney, Anil (16 December 2007).
  10. 10.0 10.1 10.2 10.3 Verma, Sukanya (18 May 2000).
  11. Kelkar, Reshma (26 May 2006).
  12. Bhakoo, Shivani (11 August 2006).
  13. Adarsh, Taran (30 June 2000).
  14. Chopra, Anupama (18 September 2000).
  15. "Kareena Kapoor: Box Office Details and Filmography".
  16. "Kareena Kapoor: Awards & Nominations".