Jump to content

చేమూరు

అక్షాంశ రేఖాంశాలు: 13°50′21″N 79°41′51″E / 13.83917°N 79.69750°E / 13.83917; 79.69750
వికీపీడియా నుండి
చేమూరు గ్రామం
జిల్లా: చిత్తూరు
మండలం: తొట్టంబేడు
అక్షాంశం: 13°47'56"N
రేఖాంశం: 79.635043E
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 797
పురుషులు: 405
స్త్రీలు: 392
జనసాంద్రత: /చ.కి.మీ / చ.కి.మీ
అక్షరాస్యత (2001 లెక్కలు)
చూడండి:
ఇతర వివరాలు
పంటలు: వరి, వేరుశనగ, చెరకు
నీటి వనరులు: బావులు/చెరువులు

చేమూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తొట్టంబేడు నుండి 12 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాళహస్తి నుండి 10 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 229 ఇళ్లతో, 818 జనాభాతో 1582 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 426, ఆడవారి సంఖ్య 392. షెడ్యూల్డ్ కులాల జనాభా 260 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 50. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595881.[1]. శ్రీకాళహస్తి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులలో గ్రామానికి చేరుకోవచ్చును. గ్రామంలో ఉంది ఒకే ప్రధామైన వీధి. దీన్ని సిమెంటు రోడ్డుగా మార్చారు. ఇంకొంచెం ముందుకు వెళితే పాండురంగ స్వామి అగ్నిగుండం కనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో ప్రజలు వీధి తూర్పు చివరన గల వేపచెట్టు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని జూమాను అని అంటారు.

చేమూరు
చేమూరు గ్రామంలో ఇళ్లు
చేమూరు గ్రామంలో ఇళ్లు
పటం
చేమూరు is located in ఆంధ్రప్రదేశ్
చేమూరు
చేమూరు
అక్షాంశ రేఖాంశాలు: 13°50′21″N 79°41′51″E / 13.83917°N 79.69750°E / 13.83917; 79.69750
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంతొట్టంబేడు
విస్తీర్ణం15.82 కి.మీ2 (6.11 చ. మై)
జనాభా
 (2011)[2]
818
 • జనసాంద్రత52/కి.మీ2 (130/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు426
 • స్త్రీలు392
 • లింగ నిష్పత్తి920
 • నివాసాలు229
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517536
2011 జనగణన కోడ్595881

గ్రామ జనాభా

[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనాభా మొత్తం 797 - పురుషుల 405 - స్త్రీల 392 - గృహాల సంఖ్య 183

చరిత్ర

[మార్చు]
దొడ్లప్ప దేవాలయం

ఇక్కడ గ్రామదేవత పేరు చేమూరమ్మ. తూర్పుగా ఉన్న ఒక వేపచెట్టు దగ్గర గ్రామస్థులు ప్రతి ఏటా పొంగళ్ళు పెడతారు. సుమారు వంద సంవత్సరాల క్రితం ఓ విగ్రహం కూడా ఉండేది. అయితే దాన్ని పంగూరు గ్రామస్థులు తీసుకొని వెళ్ళిపోయారు. గ్రామానికి దక్షిణంగా ఉన్న దొడ్లయ్య దేవాలయం దగ్గర్లో ఉన్న ఊరు నెమ్మదిగా ప్రస్తుతం ఉన్న చోటుకి మారింది. దొడ్లప్ప దేవాలయం గురించి గ్రామస్తులకు తెలిసిన సమాచారం ప్రకారం దొడ్లప్ప పరమశివుని స్వరూపం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వారికి చేమూరు పక్క గ్రామమైన కాసరంలో ఉన్న లింగాల బొంద అనే సరస్సులో దొడ్లప్ప విగ్రహం ఉన్నట్లు తెలియవచ్చింది. దాన్ని ఓ దున్నపోతుల బండి మీద ఎక్కించి చేమూరు మీదుగా శ్రీకాళహస్తికి తీసుకుని వస్తుండగా ఒక దగ్గర బండి భూమిలో దిగబడి పోయింది. దాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తుండగా అక్కడున్న వ్యక్తులలో ఒకతనికి దొడ్లయ్య పూని తను ఇప్పుడున్న చోటు శ్రీకాళహస్తికి సరిగ్గా ఉన్నదని అక్కడే ఆలయం నిర్మించమని కోరాడు. దాంతో అక్కడే ఆలయం నిర్మించారు. కాలక్రమేణా ఊరు గుడి దగ్గరి నుంచి తరలి పోవడంతో గుడి పాడుబడిపోయింది. తరువాత దొడ్లప్ప విగ్రహం కింద గుప్త నిధులు దాచి ఉంటారనే ఉద్దేశంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని తవ్వి పక్కన పడేశారు. తరువాత గ్రామస్థులు పూనుకొని దీన్ని బాగుచేశారు.

విద్య

[మార్చు]
ప్రాథమిక పాఠశాల

బస్సుదిగి ఊరికి వెళుతూ ఉంటే దారిలో ప్రాథమిక పాఠశాల దర్శనమిస్తుంది. అంగన్‌వాడీ పాఠశాల కూడా ఉంది. అక్షరాస్యతా శాతం సుమారు 50%[3]. ఈ ఊర్లో మొదటి గ్రాడ్యుయేట్ చేమూరు మునికృష్ణా రెడ్డి. ఆయనే ఇప్పుడు గ్రామ పెద్దగా వ్యవహరిస్తుంటాడు. ఆయన అప్పట్లో ఆర్‌ఈసీ వరంగల్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీ.ఈ. పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేసి పదవీ విరమణ చేశాడు. తరువాత చాలా మంది డిగ్రీ పూర్తి చేసి ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు లాంటి వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

జీవనాధారం

[మార్చు]
చేమూరు గ్రామం ఒక దృశ్యం

చేమూరు గ్రామంలో సుమారు వంద ఇళ్ళు దాకా ఉంటాయి. కొద్ది మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ 99 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. సేద్యపు నీటికి ఎక్కువగా వర్షం, గొట్టపు బావులే ఆధారం. గ్రామానికి తూర్పుగా స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. దీని మీద చాలా పొలాలు ఆధారపడి ఉన్నాయి. వరి, వేరుశనగ ఇక్కడ ప్రధామైన పంటలు. నీరు విస్తారంగా అందుబాటులో ఉన్న సమయంలో వరి, కొంచెం కొరతగా ఉన్నపుడు వేరుశనగ పండిస్తారు. ఇంకా రాగులు, సజ్జలు, మిరప, మినుములు, మొదలైన వాటిని తక్కువ స్థాయిలో పండిస్తారు.ఇంకా స్వర్ణముఖి నదికి ఉపనదియైన ఒక చిన్న ఏరు మీద ఆధారపడి చాలా పొలాల్లో సాగుబడి చేస్తారు. ఈ ఏటి నుండి రైతులు విద్యుత్ మోటార్ల సాయంతో నీటిని పొలాలకు మళ్ళిస్తారు. సోమ శిల నుంచి చెన్నపట్టణానికి నీరందించే తెలుగు గంగ కాలువ నుంచి ఒక ఉప కాలువ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే గ్రామస్తులకు సాగు నీటి కొరత చాలా వరకు తగ్గుతుంది.గ్రామంలో చాలా కుటుంబాలకు గొర్రెల మందలున్నాయి. ఇంకా ఆవులు, బర్రెలు మేపడం ద్వారా పాలు పోసి కూడా ఆదాయాన్ని ఆర్జిస్తారు.

ఆలయాలు, పండుగలు

[మార్చు]
గ్రామం నడిబొడ్డులోని రామాలయం

గ్రామం నడిబొడ్డులో ఉన్న రాములవారి మందిరం ప్రముఖ దేవాలయం. అయితే గ్రామంలో అన్నింటికన్నా ప్రాచీన దేవాలయం మాత్రం ఊరికి ఈశాన్య దిక్కులో పొలాల మధ్య ఉన్న దొడ్లప్ప దేవాలయం. దొడ్లప్ప అంటే శివునికి ప్రతి రూపం. ఒకప్పుడు గ్రామం ప్రస్తుతమున్న స్థలంలో కాకుండా ఈ గుడికి చేరువలో ఉండేది. కానీ నెమ్మదిగా ఊరు దీనికి దూరంగా జరిగిపోవడంతో, గుడి పాడుబడిపోయింది. గుప్తనిధులు దాచిఉంటారని కొంతమంది దుండగులు ఆలయంలో విగ్రహాన్ని తవ్వి ప్రక్కన పడేశారు. కానీ కొంత మంది గ్రామస్థులు చొరవ తీసుకుని గుడిని కొంచెం బాగు చేశారు. ఇక్కడ కూడా ప్రతి యేటా శివరాత్రి సమయంలో పొంగళ్ళు పెడతారు.ప్రతి యేటా మార్చి నెలలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. మూడవ రోజు అతి ముఖ్యమైన రోజు. రాత్రి పురోహితుడు నిర్ణయించిన ముహూర్త సమయంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో నిప్పులపై నడుస్తారు. దీన్నే అగ్నిగుండ ప్రవేశం అని అంటారు. మొదటగా భజన గురువు పూల చెండును నిప్పులపై దొర్లిస్తూ ప్రారంభిస్తే మిగతా భక్తులు ఆయన్ను అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో తాజాపూలతో తయారైన పూలబంతి నిప్పులపై దొర్లించినా పూలు ఏ మాత్రం వాడిపోకుండా ఉండటం గమనార్హం. ఇవి కాక గ్రామ దేవతలైన చేమూరమ్మ, అంకమ్మ లకు సంవత్సరానికి ఒకసారి పొంగళ్ళు పెడతారు. జంతు బలులు కూడా సాధారణం. గ్రామం నడిబొడ్డులో గంగమ్మ రాయి ఉంటుంది. సంక్రాంతి మరుసటి రోజు గ్రామంలో మహిళలంతా కలిసి గొబ్బిళ్ళు తడతారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల కొకసారి జరిపే కొలుపులో భాగంగా అంబళ్ళు పోస్తారు. నాగుల చవితికి ఊరి చెరువుగట్టు మీదున్న ఒక పుట్ట దగ్గర గ్రామంలో ఉన్న ప్రజలు పాలు, కోడిగుడ్లు, పండ్లు మొదలైనవి సమర్పించి వస్తారు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

శ్రీకాళహస్తికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి తారు రోడ్డు ఉంది. శ్రీకాళహస్తి నుంచి చియ్యవరం, కాసారం, పిల్లమేడు, వెంకటగిరి, చిన్నప్పరెడ్డి పల్లి మొదలైన ఊర్లకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఎక్కడం ద్వారా ఊరు చేరుకోవచ్చు. బస్సులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు నడిపే సెవెన్ సీటర్ ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషను ఎల్లకారు. ఇక్కడ పాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. దూర ప్రయాణాల కోసం శ్రీకాళహస్తి రైల్వే స్టేషనుకు వెళ్ళాలి. ఇక్కడికి దగ్గర ఉన్న ప్రధాన నగరం చెన్నై. శ్రీకాళహస్తిగుండా వెళితే బస్సులో సుమారు 4 గంటల సమయం పడుతుంది.

రాజకీయాలు

[మార్చు]

చేమూరు గ్రామం చియ్యవరం పంచాయితీ పరిధిలోకి వస్తుంది. శాసనసభ నియోజక వర్గంశ్రీకాళహస్తి. పార్లమెంటు నియోజక వర్గం తిరుపతి.

భూమి వినియోగం

[మార్చు]

గ్రామంలో భూమి వినియోగం ఈ విధంగా ఉంది (హెక్టార్లలో):

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 280.53
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 50.99
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 44.52
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 36.83
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 352.57
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 143.92
  • బంజరు భూమి: 477
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 195.64
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 625.55
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 191.01

ఇతరత్రా

[మార్చు]

వైద్యం కోసం దగ్గర్లోనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే. దానికంటే దగ్గర్లో కాసరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా మెరుగైన వైద్యం కోసం ప్రజలు శ్రీకాళహస్తి వైపే మొగ్గు చూపుతారు. గీత కార్మికులు కూడా ఇక్కడ తాటి కల్లు తీయడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటారు. ఊర్లో ఉన్న తాటి చెట్లను వీరు తమలో తాము పంచుకుంటారు. ఊరిని తూర్పున ఆనుకుని హరిజనవాడ ఉంటుంది.

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. 2.0 2.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-22. Retrieved 2009-11-01.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చేమూరు&oldid=4255127" నుండి వెలికితీశారు