త్రిపురనేని సాయిచంద్
త్రిపురనేని సాయిచంద్ | |
---|---|
జననం | రామకృష్ణ సాయిబాబా 1956 మార్చి 12 కర్నూలు, ఆంధ్రప్రదేశ్ |
విద్య | బి.కాం |
విద్యాసంస్థ | న్యూ సైన్సు కాలేజ్, హైదరాబాదు |
తల్లిదండ్రులు |
|
త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త.[1] రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు.[2] పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేశాడు. నిజజీవితంలో బ్రహ్మచారి[3]గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[4]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]సాయిచంద్ 1956 మార్చి 12న త్రిపురనేని గోపీచంద్, శకుంతలా దేవి దంపతులకు కర్నూలులో జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం అయిదు మంది సంతానం. వీళ్ళందరిలో సాయిచంద్ చివరివాడు. తండ్రి గోపీచంద్, ఆయన తండ్రి త్రిపురనేని రామస్వామి పేరొందిన రచయితలు. సాయిచంద్ కి ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. పదేళ్ళ వయసులో తల్లి కూడా మరణించింది. అప్పటి నుంచి మాతామహుడైన (తల్లికి తండ్రి) నారయ్య సమక్షంలో పెరిగాడు. చిన్నతనంలో తండ్రి రచనలు చదవడం ప్రారంభించాడు.
గోరా ప్రారంభించిన వాసవ్య పాఠశాలలో చదువుకున్నాడు. ఆ పాఠశాల నిర్వాహకురాలు, గోరా కోడలైన హేమలతా లవణం ఊయనకు తన పేరు, తండ్రి పేరు కలిసొచ్చేలా సాయిచంద్ అని పేరు మార్చింది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సాయిచంద్ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
- మాభూమి (1980)
- ధర్మవడ్డీ (1982)
- పెళ్లీడు పిల్లలు (1982)
- మంచుపల్లకీ (1982)
- ఆడవాళ్లే అలిగితే (1983)
- ఈ దేశంలో ఒకరోజు (1983)
- రంగులకల (1983)
- విముక్తి కోసం (1983)
- ఈ చదువులు మాకొద్దు (1984)
- శివ (1989)
- అంకురం (1992)
- ఫిదా (2017)
- సైరా నరసింహారెడ్డి (2018)
- చెక్ (2021)
- ఉప్పెన (2021)
- కొండపొలం (2021)
- విరాటపర్వం (2022)
- విరూపాక్ష (2023)
- మా నాన్న సూపర్‌హీరో (2024)
మూలాలు
[మార్చు]- ↑ Nadadhur, Srivathsan (2 August 2017). "Sai Chand: The father figure". The Hindu (in Indian English). The Hindu. Retrieved 15 February 2018.
- ↑ "మనం మరిచిపోయిన నటుడు". Archived from the original on 2017-08-01. Retrieved 2017-07-31.
- ↑ "వెబ్ దునియా, పెళ్ళికాని బ్రహ్మచారిని". Archived from the original on 2017-07-31. Retrieved 2017-07-31.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ The Hindu (13 September 2019). "Sai Chand's debut book 'Care Of': To the family, with love" (in Indian English). Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
- ↑ "తాతగారి మీద సినిమా తీస్తా..! - Sunday Magazine". www.eenadu.net. Archived from the original on 2021-03-09. Retrieved 2021-03-09.