దగ్గుబాటి పురంధేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దగ్గుబాటి పురంధేశ్వరి
దగ్గుబాటి పురంధేశ్వరి

2013 లో దగ్గుబాటి పురంధేశ్వరి


నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-22) 1959 ఏప్రిల్ 22 (వయసు 65)
చెన్నై, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతానం 1 కొడుకు , 1 కూతురు
నివాసం హైదరాబాదు
17 మే, 2009నాటికి

దగ్గుబాటి పురంధేశ్వరి (జ: 22 ఏప్రిల్, 1959) భారత పార్లమెంటు సభ్యురాలు. ఈమె 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. ఈమె బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు. జులై 4, 2023 న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.[1]

కుటుంబం

[మార్చు]

ఈమెకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో వివాహం జరిగింది.

రాజకీయ ప్రస్తానం

[మార్చు]

పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేసింది.

పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరింది. అనంతరం ఆమె మహిళా మోర్చా ప్రభారిగా, బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆమెను 2023 జులై 4న  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.[2][3][4]

రచించిన గ్రంధాలు

[మార్చు]

ఈమె In Quest Of Utopia అనే గ్రంథాన్ని రచించి ప్రచురించింది.

మూలాలు

[మార్చు]
  1. "BJP: ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే." EENADU. Retrieved 2023-07-04.
  2. A. B. P. Desam (4 July 2023). "ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం, వాళ్లిద్దరికీ నిరాశే!". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  3. Eenadu (4 July 2023). "ఏపీ, తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షులు వీరే." Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. Andhra Jyothy (4 July 2023). "ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి." Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.