ధర్మవరం
పట్టణం | |
Coordinates: 14°24′N 77°42′E / 14.4°N 77.7°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండలం | ధర్మవరం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 40.50 కి.మీ2 (15.64 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 1,21,874 |
• జనసాంద్రత | 3,000/కి.మీ2 (7,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 958 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8559 ) |
పిన్(PIN) | 515671 |
Website |
ధర్మవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి.
చరిత్ర
[మార్చు]ఒకప్పుడు పసపులేటి నాయుడు అనే రాజు, మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే, ప్రవాహం బాగా ఎక్కువై, వెంటనే గట్టు మీదకు వచ్చి నెమ్మదిగా నడుస్తుంటే ప్రవాహం పెరుగుతూనే ఉంది. అతనికి ఈ నీటికి అడ్డుకట్ట వేసి నిలవ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన స్పురించింది. అప్పుడే ఒక ఆజానుబాహువైన సన్యాసిఅటు వస్తుంటే అతనికి చెప్పగా ఆలోచన చాలామంచిదని వెంటనే పని ప్రారంభించమని, మళ్ళీ వస్తానని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. [3]
నది వరద తగ్గగా, గ్రామ కరణాన్ని పిలిపించి, తన ఉద్దేశ్యం చెప్పి కావలసిన డబ్బు తాను సమకూరుస్తానని చెప్పి పని మొదలుపెట్టమని ఆజ్ఞ జారీచేశాడు. మర్నాడే తొండ మాలలు, హరికారులు (అరకాల వాళ్ళు) నేమర్సు జాతులలో త్రావాకం పనిలో నైపుణ్యం ఉన్న వారిని నియమించి పని మొదలు పెట్టించాడు కరణం. పని క్రమంగా పెరిగి పోతుండటంతో, రాజు దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చైపోయింది. అప్పటికి సుమారు మూడు వంతుల పని మాత్రమే జరిగింది. నాయుడు విచారంలో మునిగిపోయాడు. అకస్మాత్తుగా అతనిని ఆశీర్వదించిన సన్యాసి ప్రత్యక్షమై, తన ఉత్తమ క్రియా శక్తితో పూర్తి చేశాడు. అతనే శ్రీ క్రియా శక్తి ఒడయారు.
నీటి వసతి ఏర్పాటైంది కనుక గ్రామ నిర్మాణం జరగాలని భావించారు. అంతకు ముందు ఇక్కడ చిలుముత్తూరు అనే పల్లె ఉండేది. దీనికి 1133-34లో తుమ్మల మల్లరుసు కరణంగా ఉండేవాడు. ఇతని తాత మాదయ. తండ్రి నాగరుసు. క్రియా శక్తి ఒడయారు ఒకరోజు వచ్చి అక్కడ గ్రామం నిర్మించాలను కొంటున్నానని మల్లరుసుతో చెప్పాడు. సంతోషించి 1153-54 శ్రీ ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం ముహూర్తం నిర్ణయించారు. పని ప్రారంభం కాగానే జనం తండోపతండాలుగా వచ్చి సాయం చేశారు. క్రియా శక్తి ఒడయారు కీర్తి దశదిశలా వ్యాపించింది. కూలీలు సాయంత్రం దాక పని చేసి, ఒక్కొక్కడు తన ఎదుట చిన్న మట్టి కుప్ప చేయటం, స్వామి వచ్చి వెండి బెత్తం తో వాటిని తాకుతూ 'మాడిదవనిగే మాడిదస్టుమహరాయా' అంటూ వెళ్ళిపోయేవాడు. కూలీలు తర్వాత వచ్చికుప్పలో వెదికితే ఆ రోజు కూలి ఖచ్చితంగా అందులో దొరికేదట. గ్రామ నిర్మాణం చేసి దానికి తనతల్లిపేరు మీదుగా 'ధర్మవరం' అని పేరు పెట్టాడు. ఇక్కడ పని అంతాపూర్తయ్యాక ఒడయారు స్వామి ఆనెగొందికి వెళ్లి అక్కడి నుంచి చెన్న కేశవ స్వామి విగ్రహం తెచ్చి ధర్మవరం లో ప్రతిష్టించి, ఆలయం కట్టించి పంచ విగ్రహ ప్రతిష్టలు కూడా చేశాడు. 700 ఏళ్ళక్రితం చిత్రావతీ నదీతీరంలో ఒడయారు స్వామి నిర్మించిన ధర్మవర గ్రామం క్రమంగా వృద్ధి చెందింది.
గ్రామ నిర్మాణం విజయవంతంగా అయ్యాక కరణం మల్లరుసు క్రియా శక్తి ఒడయారు స్వామిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి సన్మానించి గౌరవించాడు. తాను కడుపేదననీ కుటుంబ పోషణకు కరణం వృత్తిచాలటం లేదనీ స్వామికి విన్నవించగా, అతను తనతో వస్తే విజయనగర రాజు ప్రౌఢ దేవరాయలకు మనవి చేయవచ్చునని సలహా ఇవ్వగా, వెళ్లి రాజును కలిసి, స్వామి విషయం తన విషయం చెప్పుకొన్నాడు మల్లరుసు. చాలా సంతోషించి స్వామి ఆజ్ఞగా భావించి, తుమ్మల సీమలోని ధర్మవరానికి చెందిన 32 గ్రామాలు, పండపేటి స్థలం లో కనగానపల్లెకు చెందిన 20 గ్రామాలు, పినాకినీ గడ్డకు పప్పూరికి చెందిన 37 గ్రామాలు యాడికి వణితానికి 34 గ్రామాలు మొత్తం 123 గ్రామాలను శ్రీముఖ ఆశ్వయుజ పౌర్ణమి నాడు తామ్రాశాసనంగా రాయించి అందజేశాడు. ఈ విజయనగరం హంపీ విజయనగరం కాదనీ 1156-57లో తుంగభద్రా తీరంలో విజయధ్వజరాజు నిర్మించి పాలించిన చిన్న విజయనగర పట్టణం అనీ విజయధ్వజుడే ప్రౌఢ దేవరాయలు కావచ్చునని అంటారు.
మల్లరుసు మరొకసారి విజయనగరం వెళ్లి ప్రౌఢరాయలకు కార్యనిర్వాహకుడైన సోమదేవరాయని ఆశ్రయం పొందాడు. విజయనగర రాజుల తర్వాత హండే దొరలూ, తర్వాత రాయదుర్గం దొరలూ తర్వాత అనేకమంది పాలించాక శ్రీరంగపట్టణ పాలకుడు హైదరాలీకి, తర్వాత కొడుకు టిప్పు సుల్తాన్ కు ధర్మవరం చేరింది, తర్వాత ఇంగ్లీష్ వారు పాలించారు. కాలక్రమము ఇది బాగా అభివృద్ధి చెంది విద్యా వైద్య సదుపాయాలూ రోడ్లు దేవాలయాలు మసీదులు మొదలైన ప్రార్ధనామందిరాలు అన్నీ విస్తరించాయ. కళలకు కాణాచి అయింది. క్రియా శక్తి ఒడయారు సమాజం ఏర్పడి సాంఘికాది సేవలు నిర్వహిస్తోంది. అనేక క్షామాలను, ఉపద్రవాలను ఆటు పోట్లను తట్టుకొని ఎదుర్కొని నిలిచింది.
ధర్మవరానికి చెందిన సంస్కృత నిధి కోడేకొండ్ల పెద్దయాచార్యులు, ఆయుర్వేద సంస్కృత విద్వాంసులు వైద్యం కృష్ణమాచార్యులు, ఆంధ్రనాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు, సంస్కృతపండితుడు దుద్దాల నారాయణ శాస్త్రి, బంధకావ్యాలను కంఠస్థం చేసి ఉచితంగా బోధించిన అంధులు పంచకావ్యం రామాచార్యులు, హఠయోగిగోపాలం చిన్నప్ప, పోలీస్ ఇన్స్పెక్టర్ మద్దిపి హనుమంతనాయుడు ధర్మవరాని కి యెనలేని కీర్తి నార్జించి పెట్టారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి ఉత్తరంగా 39 కి.మీ దూరంలో, సమీప నగరమైన అనంతపురం నుండి దక్షిణంగా 39 కి.మీ దూరంలో వుంది.
జనగణన వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 1,21,874.
పరిపాలన
[మార్చు]ధర్మవరం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 44 పై ఈ పట్టణం వుంది. గుంతకల్లు - బెంగుళూరు రైలు మార్గంలో ఇది ఒక ప్రధాన రైలు కూడలి. ఇక్కడ నుండి పాకాలకు రైలు శాఖా మార్గం వుంది.
ప్రముఖులు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ http://www.onefivenine.com/india/villages/Anantapur/Dharmavaram/Dharmavaram.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ శిరిపి, ఆంజనేయులు (1919). ధర్మవరం చరిత్ర (PDF). చెన్నపట్టణం: ఆంధ్రపత్రికా ముచ్రాక్షరశాల, చెన్నపురి.
వెలుపలి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Commons category link is on Wikidata
- శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రాలు
- శ్రీ సత్యసాయి జిల్లా పట్టణాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- Pages using the Kartographer extension