మర్వన్ ఆటపట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Marvan Atapattu
దస్త్రం:శ్రీలంక Cricket Practice Session - Coach Marvan Atapattu giving slip catching practice.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Marvan Samson Atapattu
పుట్టిన తేదీ (1970-11-22) 1970 నవంబరు 22 (వయసు 53)
Kalutara, Ceylon
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm లెగ్ స్పిన్
పాత్రOpening బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 46)1990 నవంబరు 23 - ఇండియా తో
చివరి టెస్టు2007 నవంబరు 16 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 59)1990 డిసెంబరు 1 - ఇండియా తో
చివరి వన్‌డే2007 ఫిబ్రవరి 17 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–2006/07సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్
2007–2008ఢిల్లీ Giants
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ List A
మ్యాచ్‌లు 90 268 228 329
చేసిన పరుగులు 5,502 8,529 14,591 10,802
బ్యాటింగు సగటు 39.02 37.57 48.79 39.42
100లు/50లు 16/17 11/59 47/53 18/71
అత్యుత్తమ స్కోరు 249 132* 253* 132*
వేసిన బంతులు 48 51 1,302 81
వికెట్లు 1 0 19 1
బౌలింగు సగటు 24.00 36.42 64.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 1/9 0/4 3/19 1/12
క్యాచ్‌లు/స్టంపింగులు 58/– 70/– 150/– 91/–
మూలం: CricketArchive, 2008 సెప్టెంబరు 27

మర్వన్ ఆటపట్టు (Marvan Samson Atapattu) 1970, నవంబర్ 22న శ్రీలంక లోని కలుతరలో జన్మించాడు. ఇతడు శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. ఇండియన్ క్రికెట్ లీగ్లో ఢిల్లీ జెట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిఛాడు.

క్రీడా జీవితం

[మార్చు]

ఆతపట్టు నవంబర్ 1990లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసాడు. ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ఆటతీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. తొలి 6 ఇన్నింగ్సులలో 5 డకౌట్లు మరో ఇన్నింగ్సులో 1 పరుగు సాధించాడు. దేశవాళి పోటీలలో టన్నులకొద్ది పరుగులు సాధించే ఆటపట్టు ఆ తరువాత 11 ఇన్నింగ్సులలో అత్యధిక స్కోరు 29 మించలేకపోయాడు. అతని 10వ టెస్టులో భారత్ పై ఎట్టకేలకు తొలి సెంచరీని నమోదుచేశాడు. అప్పటికి టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసి 7 సంవత్సరాలు కావడం గమనార్హం. 22 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి డకౌట్లలో, పేరౌట్లలో (రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే ఔట్ కావడం) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు!

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

క్రమక్రమంగా పట్టు సాధించి మొత్తంపై 89 టెస్టులలో 5502 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 249 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

ఆటపట్టు 268 వన్డేలలో 37.57 సగటుతో 8529 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 59 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 132 (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

ఆటపట్టు 4 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా శ్రీలంక విజయం సాధించిన 1996లో, ఆ తరువాత 1999, 2003, 2007లలో కూడా శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.