మాలెం మల్లేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలెం మల్లేశం
మాలెం మల్లేశం

మాలెం మల్లేశం


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యుడు
నియోజకవర్గం మేడారం నియోజకవర్గం (ప్రస్తుతం రామగుండం శాసనసభ నియోజకవర్గం)

వ్యక్తిగత వివరాలు

మరణం డిసెంబరు 11, 2019
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు (కిరణ్, మధు)
నివాసం మార్కండేయ కాలనీ, గోదావరిఖని
మతం హిందూ

మాలెం మల్లేశం తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. మేడారం నియోజకవర్గం నుండి 1985, 1994లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

జననం[మార్చు]

పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, సింగిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు.[3] హెచ్.ఎస్.సి. వరకు చదివాడు.

ఉద్యోగం - కుటుంబం[మార్చు]

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కార్మికుడిగా పనిచేశాడు. మల్లేశంకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు (కిరణ్, మధు) ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనంతరం ఏఐవైఎఫ్‌లో, ఇతర పార్టీలలో అంచెలంచెలుగా ఎదిగాడు. 1973లో కరీంనగర్ జిల్లా మేడారం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయాడు. ఎన్.టి.ఆర్. అభిమాన సంఘం నాయకుడిగా పనిచేసిన మల్లేశం, 1982లో ఎన్.టి.ఆర్. టిడిపి పార్టీ పెట్టగానే మొదటి సమావేశంలో పార్టీలో చేరాడు. 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1985)లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మడి నరసయ్యపై 28,331 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1989)లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి మాతంగి నర్సయ్య చేతిలో 3,110 ఓట్లతో ఓడిపోయాడు. ఆ తరువాత 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1994)లో టీడీపీ టికెట్‌ రాకపోడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి, టీడీపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 15,319 ఓట్లతో గెలుపొందాడు.

ఆ తరువాత 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2004)లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో 56,563 ఓట్లతో ఓడిపోయాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2009)లో కూడా ఓడిపోయాడు

రామగుండం నగరపాలక సంస్థకు 2020లో జరిగిన ఎన్నికలల్లో ఈయన కుమారులు కిరణ్ 44వ డివిజన్‌ నుంచి, మధు 33వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటిచేసి, ఓడిపోయారు.[4]

మరణం[మార్చు]

మల్లేశం హైదరాబాదులోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 11న మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ప్రధానాంశాలు (2019-12-12). "మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కన్నుమూత". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.
  2. Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. సాక్షి, తెలంగాణ (2020-01-18). "ఎన్నికల్లో వారసులొస్తున్నారు..!". Sakshi. Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (2019-12-12). "మాజీ ఎమ్మెల్యే మాలెం మృతి". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.